మనిషేనా : గుడ్డు కావాలని అడిగిన చిన్నారి.. కుత కుత ఉడికే కిచిడి పోసిన టీచర్

Submitted on 26 May 2019
Hot khichdi poured on 4-year-old who asked for extra egg in Bengal

చిన్నారులు నోరు తెరిచి నాకిది కావాలని అడిగితే ఏ మాతృహృదయమైనా కరిగిపోతుంది. కడుపులోదైనా తీసి పెట్టాలని అనుకుంటారు. కానీ స్త్రీకి సహజంగా ఉండే మాతృత్వం మాటే మరచిపోయిన ఓ మహిళ ఓ చిన్నారి పట్ల దారుణంగా ప్రవర్తించింది.  ఓ పిల్లాడు నాకు ఇంకో గుడ్డు కావాలని అడిగిన పాపానికి ఒళ్లంతా కాలిపోయేలా చేసింది ఓ మహిళ.  బెంగాల్‌ రాష్ట్రంలోని ముర్షీదాబాద్ జిల్లా రఘునాథ్‌గంజ్ ప్రాంతంలో ప్రభుత్వ నిధులతో కొనసాగుతున్న చిన్నారుల సంరక్షణా కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. ప్రభుత్వ నిధులతో నడుస్తున్న పిల్లల సంరక్షణా సంస్థలో ఓ నాలుగేళ్ల పిల్లాడు నాకు ఇంకో గుడ్డు కావాలని అడిగాడు. అంతే..దాంతో తీవ్రంగా ఆగ్రహించిన సెహారీ అనే ఓ టీచర్ అబ్బా నీకు ఇంకో ఎగ్ కావాలా..ఉండు నీ పని చెప్తా అంటూ ఆ పిల్లాడి బట్టలు విప్పేసింది. తరువాత పొగలు కక్కుతున్న వేడి వేడి కిచిడీని తీసుకొచ్చి ఆ పిల్లాడిపై పోసేసింది. దీంతో ఆ చిట్టితండ్రి శరీరంపై పడ్డ కిచిడీ వేడికి అల్లాడిపోయాడు. తొడ భాగం నుంచి కాళ్ల వరకూ తోలు ఊడిపోయింది.

పాపం ఆ చిట్టి తండ్రి బాధకు అరుస్తు..ఏడుస్తూ పెద్ద పెద్ద కేకలు వేస్తూ ఇంటికి పరిగెత్తాడు. అమ్మను చుట్టేసుకుని బోరున ఏడ్చాడు. పిల్లాడి గాయాలను చూసి తల్లడిల్లిపోయింది పిల్లాడి తల్లి. వెంటనే ఆ చిన్నారిని దగ్గర్లోని జంగీపూర్ కు తీసుకెళ్లింది. ప్రస్తుతం బాబు చికిత్స పొందుతున్నాడు. పాపం..నేనేమీ చేయలేదు..ఇంకో గుడ్డు కావాలని అడిగానంతే అంటు ఏడుస్తు..అమాయకంగా అంటున్న వాడిని చూసి అందరు కన్నీరు పెట్టుకుంటున్నాడు. 
కాగా ముక్కు పచ్చలారని పసిబిడ్డపై ఇంతదుర్మార్గానికి పాల్పడిన టీచర్  సెహారీ బావాపై బాబు తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని రఘునాథ్‌గంజ్ పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆమె పరారీలో ఉన్న ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు. 


 

Hot khichdi
4-year-old
extra egg
bengal

మరిన్ని వార్తలు