Mute చేయండిలా : అలెక్సా.. మీ మాటలు వింటుందా? 

Submitted on 12 June 2019
How to stop Amazon from listening to your Alexa conversations

అమెజాన్ లో సెర్చ్ చేసే యూజర్ల వాయిస్ ను Alexa వింటుందని తెలుసా? అలెక్సా యాప్ లో యూజర్ల వాయిస్ రికార్డు అవుతుందని ఎప్పుడైన గుర్తించారా? మీకు తెలియకుండానే అలెక్సా మీ మాటలను వినేస్తుంది. మీ మాటలను వినేందుకు ప్రత్యేకించి ఇండియాలో ఫుల్ టైం ఉద్యోగాలను నియమించుకున్నట్టు మే నెలలో బ్లూమ్ బెర్గ్ రిపోర్ట్ వెల్లడించింది.

ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది అలెక్సా సమీక్షులను కాంట్రాక్ట్, ఫుల్ టైం ఉద్యోగులుగా నియమించుకుని యూజర్ల వాయిస్ ను రికార్డు చేస్తున్నట్టు రిపోర్టు తెలిపింది. 9 గంటల లాంగ్ షిఫ్ట్ సమయంలో రోజుకు 100 నుంచి వెయ్యి అలెక్సా యూజర్ల ఆడియో క్లిప్స్ వింటున్నట్టు గుర్తించింది. 

అలెక్సా తమ మాటులు వింటుందని తెలిసి చాలామంది యూజర్లు అసౌకర్యంగా ఫీలవుతున్నట్టు నివేదిక తెలిపింది. అమెజాన్ లో అలెక్సా యాప్ నుంచి యూజర్లు వాయిస్ సెర్చ్ ఆప్షన్ ద్వారా వాటి కోసం సెర్చ్ చేస్తుంటారు. ఇక నుంచి అమెజాన్ లో వాయిస్ సెర్చ్ చేసినప్పుడు.. అలెక్సా రివ్యూవర్స్ మీ వాయిస్ వినకూడదని భావిస్తున్నారా?

అలెక్సా మీ వాయిస్ రికార్డింగ్ చేయకుండా ఉండేందుకు కొన్ని టిప్స్ ఫాలో అవ్వండి చాలు. మీ అనుమతి లేకుండా అలెక్సా మీ వాయిస్ వినకుండా మీ ఫోన్లలో యాప్ సెట్టింగ్స్ మార్చేయండి.. అది ఎలానో ఓసారి లుక్కేయండి. ప్రైవసీ సెట్టింగ్స్ లోకి వెళ్లి అక్కడి ఆల్ వాయిస్ హిస్టరీ బటన్ పై క్లిక్ చేసి డిలీట్ చేస్తే చాలు.. 

* మీ స్మార్ట్ ఫోన్ లో Alexa App ను ఓపెన్ చేయండి.
* టాప్ లెప్ట్ కార్నర్.. సెట్టింగ్స్ మెనూ కోసం ట్యాప్ చేయండి.
* సెట్టింగ్స్ ఆప్షన్ క్లిక్ చేయండి.
* అలెక్సా అకౌంట్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. 
* అమెజాన్ వర్చువల్ అసిస్టెంట్ సెట్టింగ్స్ యాక్సస్ అవుతుంది.
* స్ర్కోల్ డౌన్ చేసి.. అలెక్సా ప్రైవసీ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
* అలెక్సా వాయిస్ హిస్టరీ, Manage అలెక్సా స్కిల్ పర్మిషన్స్ మార్చేయండి.
* అలెక్సాతో లింక్ అయిన స్మార్ట్ ఫోన్ హోం డివైజ్ ల్లో మ్యానేజ్ హిస్టరీని కూడా చూడొచ్చు.
* టాప్ manage పై Voice Data అలెక్సా ఆప్షన్ ఉంటుంది.
* వాయిస్ డేటాను మ్యూట్ చేయండి.. 

ప్రైవసీ సెట్టింగ్స్ మార్చాలంటే : 
* అలెక్సా అకౌంట్ సెట్టింగ్స్ కు వెళ్లండి..
* ప్రైవసీ సెట్టింగ్స్  ఓపెన్ చేయండి. 
* రివ్యూ వాయిస్ హిస్టరీ ఆప్షన్ కనిపిస్తుంది. 
* డేటా రేంజ్.. ఆల్ హిస్టరీ సెలక్ట్ చేసుకోండి. 
* డిలీట్ రికార్డింగ్, ఆల్ హిస్టరీ డిలీట్ ఆప్షన్ ఏదో ఒకటి ఎంచుకోండి
* డిలీట్ ఓకే చేయగానే.. ఓ డైలాగ్ బాక్స్ వస్తుంది.. Yes బటన్ పై క్లిక్ చేయండి. 

amazon
 Alexa conversations
speech recognition
Alexa conversations

మరిన్ని వార్తలు