కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద భారీ బందోబస్తు

Submitted on 13 June 2019
The huge police force at Kaleshwaram project

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు తొలి దశకు ముహూర్తం ఖరారు కావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. జూన్ 21వ తేదీన సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవానికి మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రులను సీఎం కేసీఆర్ పిలువనున్నారు. దీంతో పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. భద్రతను ఐజీ నాగిరెడ్డి పర్యవేక్షిస్తున్నారు. 

ఛత్తీస్ గడ్ - తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దుల వద్ద మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారం పోలీసులకు అందింది. మేడి గడ్డ బ్యారేజీ నుంచి కన్నెపల్లి పంప్ హౌస్ వరకు బందోబస్తు చేపట్టారు. సీఆర్పీఎఫ్ బలగాలతో పాటు రాష్ట్ర పోలీసులు భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే బ్యారేజీ నిర్మాణ పరిసర ప్రాంతాలను పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు.

దాదాపు 3 నుంచి 4 వేల మంది పోలీసులు బందోబస్తులో పాల్గొని జల్లెడ పడుతున్నారు. బ్యారేజీ పరిసర ప్రాంతాలు..అటవీ ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. అనుమానం వచ్చిన వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

ఎన్నిక‌ల కోడ్ ముగిసిన వెంట‌నే ప్ర‌భుత్వం కీల‌క ప్రాజెక్టుల ప్రారంభోత్స‌వాలు, శంకుస్థాప‌న‌ల‌కు ముహూర్తం ఖ‌రారు చేసింది. మూడేళ్ల క్రితం ప‌నుల‌ను ప్రారంభించిన కాళేశ్వ‌రం ప్రాజెక్టు మొదటి దశను జూన్ 21న సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. 

ప్ర‌తిష్టాత్మ‌క ప్రాజెక్టు కావ‌డం, పొరుగు రాష్ట్రాలతో నీటివాటాకు సంబంధించిన అంశాలు ముడిప‌డి ఉండ‌డంతో పొరుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌ను కాళేశ్వ‌రం ప్రాజెక్టు ప్రారంభోత్స‌వానికి ఆహ్వానిస్తోంది తెలంగాణా ప్ర‌భుత్వం. ఏపీ ముఖ్య‌మంత్రి  వైఎస్ జ‌గ‌న్‌తో పాటు, మహారాష్ట్ర ముఖ్య‌మంత్రి  దేవేంద్ర ఫ‌డ్న‌వీస్‌ను ప్రారంభోత్స‌వానికి హాజ‌రు కావాల‌ని కోరారు.

huge police
force
Kaleshwaram project

మరిన్ని వార్తలు