వేటగాళ్లకు బలైన 20 జింకలు : ముగ్గురు అరెస్ట్ 

Submitted on 26 May 2019
Hunting of 20 deers in Manjra village in Nagaur district of Rajasthan

నాగౌర్: అటవీశాఖ ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వేటగాళ్ల బారిన పడి వన్యప్రాణులు  బలైపోతునే ఉన్నాయి. ఈ క్రమంలో వేటగాళ్లు 20 జింకలను పొట్టన పెట్టుకున్నారు. రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లాలోని పాచౌడీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. 

పొటాలియా మంజ్రా గ్రామంలో 20 జింకలను వేటాడిన ఘటన వెలుగు చూసింది. ఈ విషయంపై తెలుసుకున్న ఓ స్వచ్చంధ సంస్థ కార్యకర్తలు గ్రామస్థుల సహకారంతో సదరు నిందుతుల కోసం గాలించారు. ఎట్టకేలకు ముగ్గురు వ్యక్తుల్ని పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. తరువాత అటవీశాఖ అధికారులకు కూడా తెలియజేశారు. 

దీంతో వెంటనే మంజ్రా గ్రామానికి చేరుకున్న పోలీసులు  వేటగాళ్లను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించిన మీదట ముగ్గురు నివాసాలలో తనిఖీలు నిర్వహించగా..20 జింకల అవశేషాలు లభించాయి. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులపై కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Hunting
20 deers
Manjra
Village
Nagaur
District
Rajasthan

మరిన్ని వార్తలు