ఈ రోజే లాస్ట్ డేట్ : RBI అమ్మే ఈ బంగారం.. ఎంతో చీప్

Submitted on 12 July 2019
Hurry up! RBI selling gold cheaper than market rate, offer ends today

బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరిగిపోయాయి. బంగారం కొనాలంటేనే భయమోస్తోంది. జూన్ 5న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తొలి బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా బంగారంపై దిగుమతి సుంకాన్ని 10శాతం నుంచి 12.5శాతంగా పెంచుతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో బంగారం ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని అంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో బంగారం కొనుగోలు ఎలా చేయాలా? అని ఆలోచిస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్.

రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బంగారం అమ్ముతోంది. అదేంటీ.. ఆర్బీఐ బంగారం అమ్మడమేంటి? అని అనుకుంటున్నారా?అవును. మార్కెట్ రేటు కంటే తక్కువ ధరకే విలువైన బంగారాన్ని ఆర్బీఐ విక్రయిస్తోంది. శుక్రవారం (జూలై 12, 2019) చివరి తేదీ. త్వరపడండి.. తక్కువ ధరకే బంగారం సొంతం చేసుకోండి. 

ఒక గ్రామ్ బంగారం ధర ఎంతంటే? :
ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం సావరిన్ గోల్డ్ బాండ్ (SGB)ని స్కీమ్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ స్కీమ్ కింద ఆర్బీఐ జారీ చేసే బంగారాన్ని బాండ్ రూపంలో పొందవచ్చు. ఫిజికల్ బంగారానికి ఎంత విలువ ఉంటుందో అంతే విలువ దీనికి కూడా ఉంటుంది. ఈ బంగారం ధరను ఆర్బీఐ నిర్ణయిస్తుంది.

ఒక గ్రామ్ బంగారం ధర రూ.3వేల 443గా నిర్ణయించింది. కొనుగోలుదారులకు ముఖ్య గమనిక.. ఆర్బీఐ.. జారీ చేసే బంగారం రూపంలో ఉండదు. బాండ్ మాదిరిగా ఉంటుంది. ‘సబ్ స్ర్కిప్షన్ పిరియడ్‌ ముందు వారంలోని చివరి మూడు పనిదినాల్లో 999 స్వచ్ఛత బంగారం సాధారణ సగటుతో ముగింపు ధర ఆధారంగా నామమాత్రపు విలువ ఉంటుంది. 

ఈ తేదీల్లోగా కొనాలంటే : 
జూలై 3 నుంచి జూలై 5, 2019 వరకు ఒక గ్రాముకు రూ.3వేల 443 ధర పలికింది’ అని ఆర్బీఐ ఓ పత్రిక ప్రకటనలో తెలిపింది. సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 2019-20 సిరీస్-II ప్రకారం.. జూలై 8 నుంచి జూలై 12, 2019 వరకు సబ్ స్ర్కిప్షన్ ఓపెన్ అయి ఉంది. 2019-20 సిరీస్-III సబ్ స్ర్కిప్షన్ ఆగస్టు 5 నుంచి ఆగస్టు 9, 2019వరకు ఉంటుంది. ఆ తర్వాత 2019-20 సిరీస్-IV సబ్ స్ర్కిప్షన్ సెప్టెంబర్ 9 నుంచి సెప్టెంబర్ 13వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ఆసక్తికగల కొనగోలుదారులు ఈ తేదీల్లోగా బంగారాన్ని కొనుగోలు చేసుకోవచ్చు. 

ఆన్ లైన్ పేమెంట్.. ఎక్స్ ట్రా డిస్కౌంట్ : 
సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ కింద ఆన్ లైన్‌లో కొనుగోలు చేస్తే అదనంగా ఒక గ్రాముకు రూ.50 డిస్కౌంట్ పొందవచ్చు. ఈ స్కీమ్ కింద బంగారాన్ని ఇన్వెస్ట్ చేసేవారు ఒక గ్రాముకు రూ.3వేల 393 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. 22క్యారెట్ల స్వచ్ఛత బంగారం ఢిల్లీలో ఒక గ్రాము రూ.3వేల 360గా ఉంది. 24క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర రూ.3వేల 528గా ఉంది.

డిజిటల్ పేమెంట్స్ ను ప్రోత్సాహించే దిశగా కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంకు సహకారంతో ఆన్ లైన్ లో బంగారం కొనుగోలు చేసినవారికి ఒక గ్రాముకు రూ.50 చొప్పున డిస్కౌంట్ ఇవ్వాలని నిర్ణయించింది. ఇలా బంగారాన్ని ఆన్ లైన్ లో ఇన్వెస్ట్ చేసిన వారికి గోల్డ్ బాండ్ ధర ఒక గ్రాము రూ.3వేల 146కే సొంతం చేసుకోవచ్చునని ఆర్బీఐ ఒక ప్రకటనలో వెల్లడించింది. 

బంగారం.. ఇన్వెస్ట్ మెంట్ నిబంధనలు ఇవే :
* కనీసం ఒక గ్రాము బంగారం కొనుగోలు చేయొచ్చు.
* ఒక్కొక్కరు గరిష్టంగా 4కిలోల బంగారం వరకు కొనుగోలు చేసుకోవచ్చు.
* ప్రతి ఏడాది కొన్న బంగారంపై 2.5 శాతం వడ్డీ పొందవచ్చు. 
* సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 8 ఏళ్లు పరిమితి ఉంటుంది.
* ఐదేళ్ల తర్వాత మళ్లీ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. 
* బాండ్ కొనుగోలుకు మూడు రోజులు ముందుగానీ (కనీసం ఐదురోజుల తర్వాత) సాధారణ సగటు ధరను రిడీమ్ చేసుకోవచ్చు. 

Gold cheaper
RBI selling gold
Offer
Sovereign Gold Bond
RBI bank


మరిన్ని వార్తలు