పెరుగుతున్న కాలుష్యంతో మెట్రో రైలుకు బ్రేకులు

Submitted on 13 June 2019
Hyderabad Metro train facing Pollution problems

హైదరాబాద్: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రారంభమయి హైదరాబాద్ నగరంలో రోజూ వేలాది మందిని గమ్య స్ధానాలకు చేరుస్తూ విజయవంతంగా నడుస్తున్న మెట్రో రైలు వ్యవస్ధకు నగరంలోని పొల్యూషన్ తో ఇబ్బందులు తెలత్తుతున్నాయి.  ఉప్పల్ లోని  ఆపరేషన్ కంట్రోల్ రూమ్ నుంచే  రెండు ప్రధాన  రూట్లలో మెట్రో రైళ్ల రాకపోకలను నియంత్రించ గలిగే కమ్యూనికేషన్  బేస్డ్ ట్రైన్ కంట్రోల్  వ్యవస్ధకు నగరంలో పెరిగిపోతున్న దుమ్ము ధూళి కాలుష్యం వల్ల తరచూ బ్రేక్ లు పడుతున్నాయి. పెరిగిపోతున్న పొల్యూషన్ వల్ల గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించాల్సిన రైళ్ల వేగం 25  కిలో మీటర్లకు పడిపోతోంది.

ఫ్రాన్స్, లండన్, సింగపూర్ వంటి విశ్వనగరాల్లో ఉపయోగిస్తున్న సాంకేతిక వ్యవస్ధనే హైదరాబాద్ మెట్రో ఉపయోగిస్తోంది. ఈ సీబీటీసీ టెక్నాలజీ హైదరాబాద్ నగర వాతావరణానికి సరిపోవటంలేదు. నగరంలో పొల్యూషన్ పెరిగిపోవటంతో మెట్రో రైలు మార్గంలోని రెడ్ లైట్లు అన్నీ ఒక్కసారిగా ఆన్ అవుతున్నాయి. దీంతో ఎక్కిడిరైళ్లు అక్కడే నిలిచి పోతున్నాయి. వాయు కాలుష్యం పెరిగినప్పుడల్లా ఇలాంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. తాజాగా మంగళవారం రాత్రి  8గంటల నుంచి 9 గంటల మధ్యన ఎల్బీ నగర్-మియాపూర్ మధ్య ఇలాంటి పరిస్ధితి తలెత్తింది. ఈ రూట్ లో ఉన్న 25 రెడ్ సిగ్నల్స్ ఒక్కసారిగా ఆన్ అయ్యే సరికి ఎక్కడి రైళ్లు అక్కడ నిలిచిపోయాయి. రైళ్ళ స్పీడ్ లోనూ 25కిలోమీటర్లకు పడిపోయింది.  దీంతో  మెట్రో సిబ్బంది రంగంలోకి దిగి రెడ్ లైట్ లను మ్యాన్యువల్ గా ఆఫ్ చేయాల్సి వచ్చింది. 

సాంకేతిక సమస్య తలెత్తే పరిస్ధితులు... 
వాతావరణ మార్పులతో పాటు ట్రాఫిక్ రద్దీ వల్ల కొన్ని రోజుల్లో  దుమ్ము, ధూళి, కాలుష్యం ఘనపు మీటరు గాల్లో 100 మైక్రోగ్రాములను మించుతోంది. ఈ స్దాయిలో కాలుష్యం నమోదైన ప్రతిసారీ మెట్రో రూట్లలోని సిగ్నలింగ్ వ్యవస్దలో  రెడ్ లైట్లు వెలిగి ఇలాంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. సాధారణంగా ఘనపు మీటరు గాలిలో ధూళి కాలుష్యం వంద మైక్రో గ్రాముల లోపల ఉంటేనే  సీబీటీసీ  టెక్నాలజీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా పనిచేయగలుగుతుంది.  కాలుష్యం పెరిగే సరికి  మెట్రో సిగ్నలింగ్ వ్యవస్ధ రిస్ట్రిక్టివ్ మోడ్ లోకి వచ్చేస్తోంది.  హైదరాబాద్ లో ఉన్న వాతావరణ, భౌగోళిక పరిస్ధితులకు అనుగుణంగా  మార్పులు చేయాలని మెట్రో రైలు అధికారులు ఈ టెక్నాలజీ డెవలప్ చేసిన ధేల్స్ (ఫ్రాన్స్)  కంపెనీకి ఎన్నిసార్లు  మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయిందని తెలుస్తోంది. 

Telangana
Metro Rails
Hyderabad
advanced technology
CBTC
Red Signals

మరిన్ని వార్తలు