ట్రాఫిక్ పోలీసు కొత్త ఆలోచన : ఆత్మహత్యలపై సాంగ్స్ కంపోజ్.. విద్యార్థుల్లో అవగాహన

Submitted on 11 June 2019
Hyderabad traffic policeman composes songs based on crimes to spread awareness

పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని ఒకరు.. మార్కులు తక్కువ వచ్చాయని మరొకరు.. ఇలా ఎంతోమంది విద్యార్థులు క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. పరీక్షలు అనేవి జీవితంలో ఒక భాగం మాత్రమేగానీ, పరీక్షలే జీవితం కాదనే సందేశంతో హైదరాబాద్ కు చెందిన ట్రాఫిక్ పోలీసు ఎ. నాగమల్లు విద్యార్థుల్లో అవగాహన కల్పిస్తున్నారు.

విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపే దిశగా వినూత్న ఆలోచనకు ఆయన శ్రీకారం చుట్టారు. విద్యార్థుల ఆత్మహత్యలపై 2012 నుంచి పాటలు కంపోజ్ చేస్తున్నారు. ప్రస్తుత తరం యువకులంతా ఎంటర్ టైన్ మెంట్ పైనే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఎంటర్ టైన్ మెంట్ రూపంలో ఏదైనా సందేశాన్ని ఇస్తే ఈజీగా అర్థం చేసుకుంటారనే ఉద్దేశంతో నాగమల్లు ఇలా క్రైం సాంగ్స్ కంపోజ్ చేస్తున్నట్టు చెప్పారు. 

‘2012 నుంచి క్రైం సాంగ్స్ కంపోజ్ చేస్తున్నాను. నేటి తరం అంతా ఎంటర్ టైన్ మెంట్ వైపే ఆకర్షతులవుతున్నారు. యువకుల్లో అవగాహన కల్పించడానికి ఇదే సరైన మార్గమని భావించి ఇలా పాటల రూపంలో అవగాహన కల్పిస్తున్నాను’ అని నాగమల్లు తెలిపారు. ఇప్పటివరకూ 20 పాటలను కంపోజ్ చేసినట్టు చెప్పారు. సోషల్ మీడియాలో తన పాటలను షేర్ చేస్తున్నారు. 

ఇదివరకే యూట్యూబ్, ఫేస్ బుక్ సహా ఇతర సోషల్ ప్లాట్ ఫాంల్లో షేర్ చేసినట్టు ట్రాఫిక్ పోలీసు తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రజలందరికి నేరాలపై అవగాహన కల్పించడమే తన లక్ష్యమని నాగమల్లు తెలిపారు. ట్రాఫిక్ పోలీసు నాగమల్లు స్టోరీని ట్విట్టర్ లో పోస్టు చేసిన గంటలోపే వందలాది లైక్స్, ఎక్కువ సంఖ్యలో రీట్వీట్లు చేశారు. 

Hyderabad traffic policeman
 crimes based songs
spread awareness
A Nagamallu 

మరిన్ని వార్తలు