నేను ఎవ్వరికి భయపడను..ఎవ్వరిని సమర్థించాల్సిన పనిలేదు..

20:30 - November 2, 2018

తూర్పుగోదావరి : సీఎం చంద్రబాబుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విరుచుకుపడ్డారు. తన అన్న చిరంజీవి కాంగ్రెస్ లో చేరినందుకు తనతో విభేదించి స్వంత పార్టీని స్థాపించానని..ఇది కేవలం రాష్ట్రానికి అన్యాయం చేసినందుకే తప్ప కాంగ్రెస్ పార్టీతో తీవ్రంగా విభేదించానని స్పష్టం చేశారు. భాజపాను వెనకేసుకొస్తున్నానని సీఎం చంద్రబాబు అంటున్నారని.. సొంత అన్నయ్యనే కాదని బయటకు వచ్చిన తనకు ప్రధాని మోదీ ఎంత? అని వ్యాఖ్యానించారు. భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాకు భయపడతానా? అని అన్నారు. తనకు రూ.వేల కోట్ల ఆస్తులు, కాంట్రాక్టులు, దోపిడీచేసే చరిత్ర లేవన్నారు. అందువల్ల ఎవరైనా తనను ఎందుకు బెదిరిస్తారని పవన్ ప్రశ్నించారు. అమిత్ షాకు తాను భయపడాల్సిన పనిలేదనీ..తానేమన్నా వేలకోట్ల ప్రజల ధనాన్ని తాను దోచుకోలేదని అటువంటి సమయంలో తానెందుకు కేంద్ర ప్రభుత్వానికి భయపడతానని ప్రశ్నించారు. 
 

Don't Miss