రెజీనా ముచ్చట్లు : ఆ సినిమా కోసం.. రోజుకు 3 గంటలే నిద్రపోయా!

Submitted on 13 August 2019
I Slept Only Three Hours A Day For That Movie... Regina

వెంకట్‌ రామ్‌జీ దర్శకత్వంలో అడివి శేష్‌, రెజీనా జోడీగా రూపొందుతోన్న థ్రిల్లర్‌ 'ఎవరు'. పివిపి సినిమా బ్యానర్‌పై.. పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నే నిర్మించిన ఈ సినిమా టీజర్, ట్రైలర్ అండ్ సాంగ్స్‌ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. మూవీ రిలీజ్ ముందే రెజీనా సోమవారం హైదరాబాద్‌లో మీడియాతో చిట్ చాట్‌లో ఏం చెప్పారంటే? 

ఈ సినిమా కథ విన్నాక మీకొచ్చిన మొట్టమొదటి ఆలోచన ఏంటి?
> డైరెక్టర్ రామ్‌జీ, హీరో శేష్‌ కలిసి కథ చెప్పారు. ఈ కథ వింటున్నప్పుడే నేను చేయబోయే సమీర పాత్రకి సంబంధించి కొన్ని దృశ్యాలు కళ్ల ముందు మెదిలాయి అన్నారు. అంతేకాదు డైరెక్టర్ గారు కథ చెప్పిన విధానం నన్ను ఆకట్టుకొన్నది. నాకు ఉన్న అనుభవాన్ని బట్టి ఓ దర్శకుడిని నమ్మాలంటే నాకు రెండు గంటలు చాలు. అతడు నాకు కథ చెప్పిన తీరు అద్భుతంగా ఉంది.

ఈ పాత్ర మీ కెరీర్ పై ఎలాంటి ప్రభావం చూపిస్తుందంటారు? 
> నేను ఒక కథ వింటున్నప్పుడు... ఒక నటిగా నేనేం ఇవ్వగలను అనేదే ఆలోచిస్తా తప్ప అది నా కెరీర్‌కి ఎంత మేలు చేస్తుంది? ఎలాంటి ప్రభావం చూపిస్తుందని ఆలోచించను. ‘అ!’ సినిమా కోసమూ కూడా అలాగే కష్టపడ్డా. దానికి జాతీయ పురస్కారాలొచ్చాయి.

మీ ఫస్ట్ హిందీ మూవీ ‘ఏక్‌ లడ్‌కీ కో దేఖాతో..’ కి ఎలాంటి స్పందన వచ్చింది?
> అసలు ఆ సినిమా చేయాలా వద్దా? అని చాలా ఆలోచించా. ‘ఏక్‌ లడ్‌కీ కో దేఖాతో ఐసా లగా’లో నా పాత్రని చూసి చాలామంది కమర్షియల్‌ కథానాయిక అయినా, ఇలాంటి పాత్రలు చేయడం బాగుందని మెచ్చుకున్నారు.

‘అ!’కి జాతీయ పురస్కారాలు వచ్చాయని తెలిశాక మీ ఫీలింగ్ ఏంటి?
> ఆ విషయం గురించి నాని నాకు మెసేజ్‌ చేశారు. మేకప్‌కి జాతీయ పురస్కారం వచ్చింది, అందుకు నువ్వొక ప్రధాన కారణం అని అందులో రాశారు. అది చూశాక నాకు చాలా ఆనందం కలిగింది. ‘అ!’కి మేకప్‌ వేసుకోవడానికి నాకు 24 గంటలు పట్టేది. రోజులో 2, 3 గంటలే నిద్రపోయేదాన్ని. అంత కష్టపడి చేసిన సినిమా అది.

టాప్ హీరోల సినిమాల్లో ఎక్కువగా అవకాశాలు అందుకోలేకపోయారేంటి?
> ఏడేళ్లుగా ఫిలిం ఇండస్ట్రీలో ఉంటున్నా.. ఏం జరిగిందో, ఎక్కడ తప్పులు చేస్తున్నానో ఇంకా అర్థం కావట్లేదు. కొంతమంది ఇలా చేయాలి, అలా చేయకూడదని చెప్పారు కానీ... నేను మాత్రం నా అనుభవం ప్రకారమే నిర్ణయాలు తీసుకొన్నా.

Regina
Adavi Sesh
Evaru
August 15 Released

మరిన్ని వార్తలు