ఏ ఒక్కరూ ప్రాణాలతో లేరు...AN-32 ప్రమాదంపై IAF ప్రకటన

Submitted on 13 June 2019
IAF: Following air-warriors lost their lives in #AN32 aircraft crash

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన ఏఎన్-32 విమానం ఆచూకీ లభించినప్పటికీ ఈ విమానంలో ప్రయాణిస్తున్న 13 మంది ఆచూకీ మాత్రం లభించలేదు. ఈ 13 మంది ప్రాణాలతోలేరని  భారత వాయుసేన ప్రకటించింది. ఇప్పటికే ఈ విషయాన్ని వారి కుటుంబ సభ్యులకు తెలియజేసినట్లు IAF తెలిపింది. అరుణాచ‌ల్‌ప్ర‌దేశ్‌ లోని లిపో ప‌ట్ట‌ణానికి 16 కిలోమీట‌ర్ల దూరంలో విమాన శకలాలను గుర్తించారు. సుమారు 12వేల అడుగుల ఎత్తులో ఆ శ‌క‌లాల‌ను గుర్తించారు. వాయుసేన‌కు చెందిన ఎంఐ-17 హెలికాప్ట‌ర్ విమాన శ‌క‌లాల‌ను గుర్తించిన విషయం తెలిసిందే.
13మంది సిబ్బందితో జూన్-3,2019న  మధ్యాహ్నం 12.25 గంటలకు అసోంలోని జోర్హత్ ఎయిర్ బేస్ నుంచి బయలుదేరిన AN-32 అరుణాచల్ ప్రదేశ్ లోని మెచుకా వ్యాలీలో ల్యాండింగ్ కావాల్సివుంది. అయితే టేకాఫ్ అయిన కొద్దిసేపటికే మధ్యాహ్నం 1 గంటకు రాడార్ తో సంబంధాలు తెగిపోయి విమానం కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే. 
మూడేళ్ల క్రితం జులై 22,2016లో 29మందితో చెన్నై నుంచి అండమాన్ లోని పోర్ట్ బ్లెయిర్ కు బయల్దేరిన AN-32 ఎయిర్ క్రాఫ్ట్ టేకాఫ్ అయిన కొద్ది సేపటికే రాడర్ తో సంబంధాలు తెగిపోయి మిస్ అయింది.ఇప్పటివరకు దీని ఆచూకీ కనిపెట్టలేకపోయారు.ఎక్కడ కూలింది,ఏలియన్స్ ఎత్తుకెళ్లారా ఇలా ఏ ప్రశ్నకు ఇంతవరకు సమాధానం లేదు.2009 జూన్‌లో కూడా అచ్చం ఇలాగే ఇదే ప్రాంతంలో 13 మందితో అదృశ్యమైన ఏఎన్‌-32 విమానం శకలాలు మేచుకాకు 25 కిలోమీటర్ల దూరంలో దొరికాయి. ఈ దుర్ఘటనలో విమానంలో ఉన్న 13 మంది చనిపోయారు.

IAF
an-32
lost
lives
CRASH
Aircraft
Missing
ARUNACHALPRADESH
CONFIRM
warriors

మరిన్ని వార్తలు