కోలుకోపోతే కష్టమే: వార్మప్ మ్యాచ్ వదిలేశారు

Submitted on 26 May 2019
ICC World Cup 2019 warm-up: New Zealand win by India 6 wickets

ఇంగ్లాండ్ గడ్డపై జరిగిన తొలి మ్యాచ్‌ను కోహ్లీసేన అప్పగించేసింది. భారత బ్యాట్స్‌మెన్ ఐపీఎల్ ఫార్మాట్ నుంచి బయటికి రాకపోవడం పెద్ద బలహీనతగా మారింది. కేవలం 39.2ఓవర్లకే చాపచుట్టేసి 179పరుగులు మాత్రమే చేయగలిగింది. చేధనకు దిగిన న్యూజిలాండ్ భారత్‌పై విజయం సాధించింది. వరల్డ్ కప్ టోర్నీలో భారత్‌ను ఓడించడంతో మరే జట్టునైనా ఓడించగలమనే నమ్మకాన్ని వ్యక్తపరిచింది.

ఆరంభంలో తడబడ్డ భారత్.. 39పరుగులకే 4వికెట్లు కోల్పోయింది. పాండ్యా(30), జడేజా(54) చేయడంతో ఆ మాత్రం స్కోరునైనా నమోదుచేయగలిగింది. అయినప్పటికీ కివీస్ 6వికెట్ల తేడాతో విజయం సాధించింది. న్యూజిలాండ్ (సన్‌రైజర్స్ హైదరాబాద్) కెప్టెన్ కేన్ విలియమ్సన్ (67; 6ఫోర్లు, 1సిక్సు) సొంతజట్టుతో కలిసి బ్యాట్ ఝుళిపించాడు.

వార్మప్ మ్యాచ్‌లో బౌలర్లు మెరుగ్గానే రాణించారు. బుమ్రా, భువనేశ్వర్ కుమార్, షమీ తలో 4ఓవర్లు బౌలింగ్ చేశారు. ఈ మ్యాచ్‌లోనూ బుమ్రా వేగాన్ని కివీస్ తట్టుకోలేకపోయింది. 4ఓవర్లకు కేవలం 2పరుగులు మాత్రమే చేసి ఒక వికెట్ కోల్పోయింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ చెరో 2పరుగులు చేసి సరిపెట్టుకున్నారు. ఆ తర్వాత కోహ్లీ(18) చేసి అవుటవ్వగా,  నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన కేఎల్ రాహుల్(6)పరుగులకే వెనుదిరిగి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు.

చాలాసేపటి వరకూ క్రీజులో నిలదొక్కుకున్న ఎంఎస్ ధోనీ కూడా 42బంతులాడి 17పరుగులు మాత్రమే చేయగలిగాడు. రెండో వికెట్ కీపర్‌గా దిగిన దినేశ్ కార్తీక్ 4పరుగులు చేస్తే కుల్దీప్ యాదవ్ 19పరుగులు చేసి ఆశ్చర్య పరిచాడు. ఓ వైపు టీమిండియా పరీక్షల పేరు చెప్పుకొని ప్రయోగాలు చేస్తుంటే ఆస్ట్రేలియా వార్మప్ మ్యాచ్‌లోనూ శతకాల పంట పండించింది. స్టీవ్ స్మిత్(116; 102 బంతుల్లో 8ఫోర్లు, 3సిక్సులు)తో అదరగొట్టాడు.

ICC World Cup 2019 warm-up
new zealand
india
indvsnz

మరిన్ని వార్తలు