రికార్డు స్థాయిలో పెరిగిన బంగారం ధర 

Submitted on 12 July 2019
Increased gold price At record levels

బంగారం ధర రికార్డు స్థాయిలో పెరిగింది. ఒక్కరోజే 10 గ్రాములపై బంగారం ధర రూ.930 పెరిగింది. ఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత గల 10 గ్రాముల బంగారం ధర రూ.930 పెరిగి రూ.35 వేల 800 దగ్గర నిలిచింది. 99.5 స్వచ్ఛత గల బంగారం ధర రూ.35 వేల 630. 8 గ్రాముల సావరిన్ బంగారం ధర రూ.100 పెరిగి రూ.27వేల 400 దగ్గర నిలిచింది. 

హైదరాబాద్‌లో 24 క్యారెట్ బంగారం ధర 10 గ్రాములకు రూ.36 వేల 290 కాగా 22 క్యారెట్ బంగారం ధర రూ.33 వేల 270. అంతర్జాతీయంగా చూస్తే ఔన్స్ బంగారం ధర 1,420.80 డాలర్లుగా ఉంది. 

వెండి ధర కేజీపై రూ.300 పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.39 వేల 200. మార్కెట్‌లో 100 వెండి నాణేల కొనుగోలు ధర రూ.81 వేలు కాగా అమ్మకం ధర రూ.82 వేలు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ వెండి ధర 15.24 డాలర్లుగా ఉంది. 

త్వరలో వడ్డీ రేట్లలో కోత ఉంటుందని యూఎస్ ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ జెరోమ్ పోవెల్ చెప్పడం, అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా ఇన్వెస్టర్లు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావించారని నిపుణులు అంచనా వేస్తున్నారు. 
 

Increased
gold price
record levels
Delhi


మరిన్ని వార్తలు