జెండా ఎగరేసిన మోడీ: జాతిని ఉద్దేశించి కీలక ప్రసంగం.. ఒకే దేశం.. ఒకే ఎన్నికలు

Submitted on 15 August 2019
Independence Day: PM Modi announces One Nation One Election

దేశవ్యాప్తంగా 73వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు ప్రజలు. ప్రధాని నరేంద్ర మోడీ ఎర్రకోటపై ఆరవసారి జాతీయ జెండాను ఎగురవేశారు. త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించన తర్వాత మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. స్వాతంత్ర్య సమరయోధులకు వందనం అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించిన మోడీ దేశం కోసం ప్రాణాలు అర్పించిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలిపారు. మొదటగా దేశంలో అనేక ప్రాంతాలు వరదల్లో చిక్కుకున్నాయని, వరదల్లో చనిపోయిన వారికి నివాళి అర్పించారు మోడీ. అలాగే దేశ ప్రజలందరికి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.

2019 ఎన్నికల తర్వాత ఇది నా తొలి ప్రసంగం.. దేశ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం అని అన్నారు మోడీ. 10వారాల్లో దేశం కోసం ఎన్నో కీలకమైన నిర్ణయాలు తీసుకున్నాం. ట్రిపుల్ తలాక్ రద్దు చేసి ముస్లిం మహిళలకు అండగా నిలిచాం. దీంతో ముస్లిం మహిళలకు స్వేచ్ఛ లభించిందని, ముస్లిం మహిళలకు సమాన హక్కులు లభించాయని అన్నారు. చిన్నారులపై లైంగిక వేధింపులను నివారించేందుకు కఠిన చట్టాలు తెచ్చినట్లు చెప్పారు.

ప్రతీ ఒక్కరూ ఇప్పుడు దేశం మారుతుంది అనే భావనలో ఉన్నారని, అన్నీ వర్గాల సంక్షేమానికి మేం కట్టుబడి ఉన్నామని అన్నారు. 130మంది కోట్లమంది భారతీయులు నన్ను ముందుండి నడుపుతున్నారు. రాబోయే కాలంలో సరికొత్త భారతావని నిర్మిద్ధాం. ఆర్టికల్ 370 రద్దుతో పటేల్ ఆకాంక్షను నెరవేర్చాం. కాశ్మీర్ ప్రజలకు స్వేచ్ఛను ఇచ్చాం. అన్ని పార్టీలు ఆర్టికల్ 370 రద్దును సమర్థించాయని, ఆర్టికల్ 370, 35A రద్దుతో కాశ్మీర్ ప్రజలకు బహుమతి ఇచ్చామని అన్నారు. జమ్మూకశ్మీర్‌లోని అన్నీ వర్గాల ప్రజలకు సమాన హక్కులు దక్కాలని అన్నారు.

లడక్‌లో శాంతి స్థాపనే మా ప్రభుత్వం లక్ష్యం అని అన్నారు. టెర్రరిజంపై భారత్ చేస్తున్న పోరాటానికి ప్రపంచ దేశాలు సపోర్ట్ చేస్తున్నాయని, టెర్రరిజాన్ని ఉపేక్షించే ప్రసక్తే లేదని అన్నారు. నా భవిష్యత్ గురించి నాకు భయం లేదు.. దేశ భవిష్యత్తే నాకు ముఖ్యం అని అన్నారు మోడీ. అలాగే వన్ నేషన్.. వన్ పోల్‌ను కూడా అమలు చేస్తామని వెల్లడించారు మోడీ. ఒకే దేశం.. ఒకేసారి ఎన్నికలపై దేశంలో విస్తృతంగా చర్చ జరగాలని అన్నారు మోడీ
 

independence day
pm modi
One Nation
One Election

మరిన్ని వార్తలు