24 గంటలు..64 కెమెరాలు : జులై 21న బిగ్ బాస్ 3

Submitted on 11 July 2019
BiggBossTelugu3 Starting 21st July at 9 PM on StarMaa

బుల్లితెరపై అలరించిన బిగ్ బాస్ 3 వచ్చేస్తోంది. దీనికి ముహూర్తం ఫిక్స్ చేసింది స్టార్ మా. 2019, జులై 21వ తేదీ నుంచి రాత్రి 9గంటలకు ప్రసారం కానుందని అధికారికంగా ప్రకటించేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను విడుదల చేసింది. కెమెరా ఆన్ కాగానే యాక్టింగ్ మొదలు పెడుతారు..కానీ అక్కడ అలా కుదరదు..24 గంటలు..64 కెమెరాలు..నో యాక్టింగ్..వోన్లీ రియాల్టీ..అంటూ హోస్ట్ నాగార్జున చెప్పారు. కేవలం 10 రోజులే ఉండడంతో ఆడియెన్స్‌లో ఉత్కంఠ పెరిగిపోతోంది. 

ఈ షోకి ఫిదా అయిన తెలుగు టెలివిజన్ ఆడియన్స్ బిగ్ బాస్ థర్డ్ సీజన్ కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే..హోస్ట్ ఎవరనేది చాలా వరకు సస్పెండ్‌లో పెట్టింది. చివరకు టాలీవుడ్ మన్మథుడు నాగార్జునను ఫైనల్ చేసింది. గతంలో మీలో ఎవరు కోటీశ్వరుడు షోకి హోస్ట్ గా వ్యవహరించి..షోని సక్సెస్ చేసిన నాగ్..బిగ్ బాస్ థర్డ్ సీజన్ హోస్ట్‌ అయితే బెటర్ అని భావించారు నిర్వాహకులు. 

బిగ్ బాస్ షో..మా టీవీలో ప్రసారమయిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు రెండు సీజన్లు కంప్లీట్ చేసుకుంది. మొదటి సీజన్‌కు జూనియర్ ఎన్టీఆర్, రెండో సీజన్‌కు నాని వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. బిగ్ బాస్ - 1 విజేతగా శివ బాలాజీ, బిగ్ బాస్ - 2 విజేతగా కౌశల్‌లు గెలిచారు. 

బిగ్ బాస్ 3 హౌస్‌లో 14 మంది 100 రోజుల పాటు ఉంటారని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. వీరంతా..ప్రపంచానికి దూరంగా ఒకే ఇంట్లో అంతా కలిసి ఉండాలి. 2017లో తెలుగు ఆడియన్స్ కి పరిచమైన ఈ షోకి చాలా తక్కువ టైంలోనే మంచి రెస్పాన్స్ వచ్చింది. బిగ్ బాస్ ఫస్ట్ అండ్ సెకెండ్ సీజన్స్ ని తెలుగు టెలివిజన్ ఆడియన్స్ విపరీతంగా ఎంజాయ్ చేశారు. అందుకే థర్డ్ సీజన్ పై ఎక్స్ పెక్టేషన్స్ పెరిగిపోయాయి. మరి కంటెస్టెంట్ ఎవరో అనేది తెలుసుకోవాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. 

Bigg Boss
Telugu
Starting
21st July
9pm
star maa

మరిన్ని వార్తలు