పితృ పర్వతంపై బంగారు హనుమంతుడు

Submitted on 13 June 2019
Gold Hanuman statue on  pitru mountain in Indore madhya pradesh

పితృపర్వతంపై బంగారు హనుమంతుడు కొలువుదీరనున్నాడు. హనుమ అంటేనే భారీ ఆహ్యారం మన కళ్లముందకు సాక్షాత్కరిస్తుంది. ఎటువంటి స్వార్థం లేకుండా శ్రీరాముడి సేవలతో తరించిపోయిన వాయునందనుడు పసిడి హనుమగా భక్తులకు దర్శినమివ్వనున్నాడు. 

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ సమీపంలో ఉన్న  పితృ పర్వతంపై హనుమంతుడి అత్యంత భారీ విగ్రహం కొలువుదీరనుంది. రాష్ట్రంలోనే అత్యంత పెద్దదైన 66 అడుగుల హనుమాన్ విగ్రహాన్ని సిద్ధం చేశారు. బంగారం, వెండి, రాగి, సీనం, కాడ్మియం వంటి అష్ట థాతువులను ఈ భారీ  ప్రతిమ తయారీకి వినియోగించారు. ఈ విగ్రహం తయారీకి  రూ. 11 కోట్లు ఖర్చు అయ్యాయి.
108 టన్నులు భారీ హనుమ విగ్రహం మరింత కనువిందుగా కనిపించేందుకు విగ్రహానికి సమీపంలో ఎల్ఈడీ బల్బులను అమర్చనున్నారు నిర్వాహకులు. కాగా అతి త్వరలోనే భారీ హనుమంతుడి విగ్రహం ఆవిష్కరించనున్నారు.

హనుమ శిరస్సుపై ఉండే ఛత్రం (గొడుగు)3 టన్నుల బరువు ఉండే ఈ గొడుగుపై 108 సార్లు శ్రీ రామ్ పేరును చెక్కారు. శ్రీరాముడుకి ఆంజనేయుడు వీర భక్తుడు. అందుకే పద్మాసనం వేసుకుని రెండు చేతుల్లో చిడతలతో  శ్రీ రామ నామాన్ని జపిస్తున్నట్లుగా ఉండే బంగారు అంజనీపుత్రుడు పితృ పర్వతంపై కొలుదీరనున్నాడు. 

Golden Hanuman
statue
pitru mountain
Indore
Madhya Pradesh

మరిన్ని వార్తలు