అసాంజేను అమెరికాకు అప్పగించేందుకు బ్రిటన్ ఆమోదం

Submitted on 13 June 2019
UK signs Julian Assange's US extradition papers

వికీలీక్స్ వ్యవస్థాపకుడు జులియన్ అసాంజేను అప్పగించాలన్న అమెరికా అభ్యర్థనకు బ్రిటన్ ఆమొదం తెలిపింది.అమెరికా రక్షణ శాఖ కంప్యూటర్ల హ్యాకింగ్ కుట్రతో సంబంధం ఉందనే ఆరోపణలతో అసాంజేను తమ దేశానికి తిరిగి అప్పగించాలని అమెరికా కోరడంతో...అసాంజేను అమెరికాకు అప్పగించే పేపర్లపై బుధవారం(జూన్-12,2019)యూకే హోం సెక్రటరీ సంతకం చేశారు. మిలటరీ అండ్ డిప్లొమాటిక్ డాక్యుమెంట్లు, యూఎస్ వార్స్, ఇరాక్, అఫ్ఘనిస్థాన్ కు సంబంధించిన పలు విలువైన సమాచారాన్ని వికీలీక్స్ 2010లో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.

లైంగిక వేధింపుల ఆరోపణల విషయంలో అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు,స్వీడన్ కు అప్పగించబడకుండా ఉండేందుకు 2012 నుంచి అసాంజే లండన్ లోని ఈక్వేడార్ రాయబార కార్యాలయంలో ఆశ్రయం పొందుతున్న విషయం తెలిసిందే.అయితే INA పేపర్స్ లీక్ చేసి ఆఫ్షోర్ కుంభకోణం బయటపెట్టాడన్న  కారణంతో ఈక్వేడార్ ప్రభుత్వం అసాంజేకు రాజకీయ ఆశ్రయాన్ని ఉపసంహరించుకుంది. అవినీతి కుంభకోణంలో ఈక్వేడార్ ప్రెసిడెంట్ లెనిన్ మొరానో పాత్ర ఉన్నదానికి సంబంధించిన ఐఎన్ ఏ పేపర్లు వికీలీక్స్ లీక్ చేయడమే దీనికి కారణం.దీంతో అసాంజేను ఏప్రిల్-11, 2019న బ్రిటన్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

Julian Assange
EXTRADITION
papers
SIGNED
UK
HOME SECRATARY
ESPIONAGE ACT
CHARGES
usa
COMPUTER HACKING
SAJID JAVID

మరిన్ని వార్తలు