వీడియో: ఆవేశంతో నడిరోడ్డుపై యువకుడిని రాడ్డుతో కొట్టిన అమ్మాయి

Submitted on 26 June 2019
Woman attacks man with rod in Chandigarh

నడిరోడ్డుపై ఓ యువతి వీరావేశంతో యువకుడిపై విరుచుకుపడింది. కోపంతో ఇష్టమొచ్చినట్టు రాడ్డుతో కొట్టేసింది. చండీఘర్ లోని ట్రిబ్యున్ చౌక్ లో మంగళవారం(25 జూన్ 2019) సాయంత్రం నితీశ్ అనే యువకుడు ట్రిబ్యూన్ చౌక్‌ మీదుగా కారులో కుటుంబంతో సహా వెళుతున్నాడు. మొహాలీకి చెందిన శీతల్ శర్మ అనే 25ఏళ్ల అమ్మాయి సరిగ్గా అదే సమయంలో తన కారును వెనక్కి తీసుకుంటుంది.

ఈ క్రమంలో వెనక వచ్చే వాహనాలను గమనించలేదు. వేగంగా కారును తీయడంతో.. ఆ వెనకే వస్తున్న నితీశ్ కారుకు తగిలింది. దెంటనే ఇదేంటని ప్రశ్నించగా.. కారును రోడ్డుపై అడ్డంగా నిలిపేసి.. కారులో నుంచి ఇనుపరాడ్డును తీసి..  నితీశ్ పైకి దాడికి తెగబడింది. ఆగ్రహంతో ఊగిపోతూ కారు డోరును రాడ్డుతో కొట్టిన శీతల్ శర్మ.. నితీశ్ చేతిపైన కూడా రాడ్డుతో గాయపరిచింది. దీంతో యువతికి ఎదురుదిగిన నితీశ్.. ఆమె కారుపై రాయి విసిరివేయగా అద్దం పగిలిపోయింది.

స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి రెండు వాహనాలను సీజ్ చేశారు. స్థానికులు ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్‌గా మారింది. యువతిపై 308సెక్షన్ కింద కేసు పెట్టిన పోలీసులు తర్వాత అరెస్ట్ చేశారు.

Woman attacks man
rod
Chandigarh
Tribune Chowk

మరిన్ని వార్తలు