అదిరిపోయే ఫీచర్లు : మోటరోలా One Vision వచ్చేసింది.. ధర ఎంతంటే?

Submitted on 20 June 2019
India Motorola One Vision smartphone with 48MP camera launched at Rs 19,999

లెనొవో సొంత కంపెనీ మోటరోలా నుంచి కొత్త మోడల్ స్మార్ట్ ఫోన్ వచ్చేసింది. లేటెస్ట్ ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్ ఫోన్.. మోటరోలా వన్ విజన్. ఇండియాలో మిడ్ రేంజ్ సిగ్మంట్లలో వన్ విజన్ మార్కెట్లోకి రిలీజ్ అయింది. ఇండియాలో దీని ధర ఎంతో తెలుసా? రూ.19వేల 999గా కంపెనీ నిర్ణయించింది.

సాప్పహైర్ బ్లూ, బ్రౌన్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ ఈ కామర్స్ వెబ్ సైట్ ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉంది. ఒప్పో F11 Pro, చైనీస్ స్మార్ట్ ఫోన్ మేకర్ హువావే P30 లైట్ పోటీగా మోటరోలా నుంచి ఈ సరికొత్త ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. 

ఈ రెండు మోడల్ ఫోన్ల ధరలు రూ.24వేల 990గా ఉంటే, రెండొవది రూ.19వేల 990గా నిర్ణయించారు. స్టోరేజీ ఆప్షన్లలో 48 మెగా ఫిక్సల్ కెమెరాతో వచ్చిన మోటరోలా వన్ విజన్ లో ఇంటర్నల్ స్టోరేజీ 512GB వరకు ఎక్స్ ప్యాండ్ చేసుకోవచ్చు.

ఆండ్రాయిడ్ 9పై ఆపరేటింగ్ సిస్టమ్ రన్ అవుతుంది. 6.3 అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్, డిస్ ప్లే 21:9తో వచ్చింది. హోం సైడ్ లో 25MP సెల్ఫీలు తీసుకునే అవకాశం ఉంది. 3,500 బ్యాటరీ సామర్థ్యంతో పాటు 15W టర్బో పవర్, ఫాస్ట్ రీఛార్జింగ్ చేసుకోవచ్చు. మోటరోలా వన్ విజన్ లాంచ్ తర్వాత మూడేళ్ల వరకు సెక్యూరిటీ అప్ డేట్స్ చేసుకోవచ్చు. 

స్పెషిఫికేషన్లు- ఫీచర్లు ఇవే :
* 6.3 అంగుళాల Full HD+ డిస్ ప్లే, 21:9 అస్పెక్ట్ రేషియో
*  4GB ర్యామ్; 128 GB ఇంటర్నల్ స్టోరేజే, 512GB వరకు విస్తరింస్తుంది.
* మైక్రో SD కార్లు ఆప్షన్,  డ్యుయల్ కెమెరా సెటప్
* స్పోర్ట్స్ డ్యుయల్ కెమెరా సెటప్, f/1.7 అప్రెచర్ 5MP సెకండరీ సెన్సార్
* స్మార్ట్ ఫోన్ హోం సైడ్ ను 25MP సెల్ఫీతో పాటు f/2.2 అప్రెచర్
* 48MP మెయిన్ సెన్సార్, నైట్ విజన్
* కోటింగ్ ఆఫ్ స్ర్కాచ్-రీసిస్టెంట్ గ్లాస్
* క్వాడ్ పిక్సల్ టెక్నాలజ, డ్యుయల్ LED ఫ్లాష్, f/1.0 అప్రెచర్
* 2.2GHz అక్టా కోర్ శాంసంగ్ ఎక్సినస్ 9609 ప్రాసెసర్
* ఆండ్రాయిడ్ 9.0 పై ఆపరేటింగ్ సిస్టమ్
* ఆండ్రాయిడ్ Q, ఆండ్రాయిడ్ R అప్ డేట్స్
* డ్యుయల్ SIM స్మా్ర్ట్ ఫోన్.. ఫింగర్ ఫ్రింట్ సెన్సార్ ఉంది.
* ఆండ్రాయిడ్ 160.1x7.7mm సైజుతో నిండి ఉంటుంది.
* 3,500 బ్యాటరీ సామర్థ్యంతో పాటు 15W టర్బో పవర్, ఫాస్ట్ రీఛార్జింగ్
* కనెక్టవిటీ ప్రంట్ ద్వారా డ్యుయల్ NFC, USB టైప్-C

india
Motorola One Vision
 smartphone
48MP camera launch
Lenovo-owned
specifications 

మరిన్ని వార్తలు