సిరీస్ కైవసం చేసుకున్న కోహ్లీసేన

Submitted on 15 August 2019
India vs West Indies 3rd ODI Highlights

వెస్టిండీస్‌తో తలపడిన రెండు సిరీస్‌లలోనూ టీమిండియాదే పైచేయిగా నిలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్ దూకుడుగా ఆడుతున్న సమయంలో వర్షం ఆటకు బ్రేక్‌లు వేసింది. 32.3 ఓవర్ల పాటు ఆడిన కరేబియన్ వీరులు 7వికెట్ల నష్టానికి 240పరుగులు మాత్రమే చేయగలిగింది. డక్ వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం 32.3ఓవర్లకు 4వికెట్లు నష్టానికి 256పరుగులు చేసిన టీమిండియానే గెలిచినట్లు అంపైర్లు ప్రకటించారు. 

మూడో వన్డేలోనూ సెంచరీతో అదరగొట్టిన కెప్టెన్ విరాట్ కోహ్లీ(114; 99బంతుల్లో 14ఫోర్లు)తో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌తో పాటు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ కూడా సొంతం చేసుకున్నాడు. ఓపెనర్లు రోహిత్(10), ధావన్(36)చెప్పుకోదగ్గ స్కోరు నమోదు చేయలేనప్పటికీ  వన్ డౌన్‌లో వచ్చిన కోహ్లీ అంతా సెట్ చేశాడు. ఇన్నింగ్స్‌ను చక్కదిద్దడమే కాక క్రీజులో పాతుకుపోయాడు. 

విండీస్ బౌలర్ల ధాటికి రిషబ్ పంత్(0) డకౌట్ గా వెనుదిరిగాడు. శ్రేయాస్ అయ్యర్(65; 41బంతుల్లో 3ఫోర్లు, 5సిక్సులు)తో మెరిసినప్పటికీ కీమర్ రోచ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. భారత బౌలర్లు కరేబియన్ బ్యాట్స్‌మెన్‌కు కళ్లెం వేశారు. ఖలీల్ అహ్మద్ 3వికెట్లు పడగొట్టగా, మొహమ్మద్ షమీ 2వికెట్లు తీశాడు. స్పిన్నర్లు చాహల్, జడేజా చెరో 1వికెట్ దక్కించుకొన్నారు. 

తర్వాత ఆడనున్న 2టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా ఆగష్టు 22నుంచి సెప్టెంబర్ 4వరకూ ఆడనుంది. 

india
west indies
3rd odi

మరిన్ని వార్తలు