భారత్ వెస్టిండీస్ మ్యాచ్ కి వర్షం అంతరాయం

Submitted on 14 August 2019
India vs West Indies 3rd ODI Match, Rain Stops Play

పోర్ట్ ఆఫ్ స్పెయిన్ : భారత్ వెస్టిండీస్ మూడో వన్డే మ్యాచ్ కి వరుణుడు అడ్డుపడ్డాడు. వర్షం పడటంతో ఆటను నిలిపేశారు. ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్ 22 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. క్రిస్ గేల్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. ధాటిగా బ్యాటింగ్ చేశాడు. 41 బంతుల్లో 72 పరుగులు చేసి ఔటయ్యాడు. గేల్ ఇన్నింగ్స్ లో 8 ఫోర్లు, 5 సిక్సులు ఉన్నాయి. విండీస్ మరో ఓపెనర్ లెవిస్ 29 బంతుల్లో 43 పరుగులతో రాణించాడు. అతడి ఇన్నింగ్స్ లో 3 సిక్సులు, 5 ఫోర్లు ఉన్నాయి. క్రీజ్ లో హోప్, హెట్ మెయిర్ ఉన్నారు. భారత బౌలర్లలో ఖలీల్ అహ్మద్, చాహల్ తలో వికెట్ తీశారు. 

టాస్ గెలిచిన విండీస్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. 3 వన్డేల సిరీస్‌లో 0-1తో వెనకబడిన విండీస్.. ఆఖరి మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ఉంది. సిరీస్‌ సమం చేయాలని భావిస్తోంది. మరోవైపు భారత్‌ గెలుపుపై ఆత్మవిశ్వాసంతో ఉంది. ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని చూస్తోంది. కుల్‌దీప్‌ యాదవ్‌ స్థానంలో యుజువేంద్ర చాహల్‌ జట్టులోకి వచ్చాడు.

india
west indies
3rd ODI Match
rain
Stops Play

మరిన్ని వార్తలు