భారత్ మూవీ చూసిన భారత జట్టు

Submitted on 12 June 2019
Indian Cricket Team Enjoys Bharat in England

వరల్డ్ కప్ టోర్నీ ఆడేందుకు ఇంగ్లాండ్ వెళ్లిన భారత జట్టు భారత్ మూవీ చూసింది. గురువారం న్యూజిలాండ్ జట్టుతో మూడో మ్యాచ్‌ను ఆడనున్న టీమిండియా.. బిజీ షెడ్యూల్‌లో కాస్త విరామం కోసం బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన భారత్ మూవీని లండన్‌లోని నాటింగ్‌హామ్‌లో చూశారు. 

ఎంఎస్ ధోనీ, హార్దిక్ పాండ్యా, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్‌లతో కలిసి సినిమా చూసినట్లు కేదర్ జాదవ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఆ ట్వీట్‌పై సల్లూ భాయ్ స్పందించాడు. 

'భారత్ మూవీని ఇష్టపడి చూసినందుకు భారత్ టీమ్‌కు థ్యాంక్యూ. ఇంగ్లాండ్‌లో భారత్ మూవీని చూసినందుకు కృతజ్ఞతలు. రాబోయే మ్యాచ్‌లలో రాణించాలని ఆశిస్తున్నా. భారతదేశం మొత్తం మీ వెంట ఉంది' అని సల్మాన్ ట్విట్టర్ ద్వారా స్పందించాడు. 

సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 4క్యారెక్టర్లలో కనిపించిన భారత్ మూవీ.. కొరియన్ మూవీ 'యాన్ ఓడ్ టు మై ఫాదర్' మాతృక నుంచి తీసుకున్నారు. అలీ అబ్బాస్ జాఫ్ దర్శకత్వంలో కత్రినా కైఫ్, దిశా పటాణీ హీరోయిన్లతో సినిమా తెరకెక్కింది. కాగా, ఈ సినిమా 4రోజుల్లోనే రూ.100కోట్ల బాక్స్ ఆఫీస్‌ రికార్డు సొంతం చేసుకుంది.

Kedar Jadav
Team India
bharath
india
2019 icc world cup
world cup 2019

మరిన్ని వార్తలు