HSTDVను విజయవంతంగా పరీక్షించిన భారత్

Submitted on 12 June 2019
India's Hypersonic Technology Demonstrator Vehicle Test Successful by DRDO

స్వదేశీ పరిజ్ణానంతో అభివృద్ధి చేసిన హైపర్‌ సోనిక్ టెక్నాలజీ డిమాన్‌ స్ట్రేటర్ వెహికిల్‌(HSTDV)ను రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) బుధవారం(జూన్-12,2019)విజయవంతంగా పరీక్షించింది.ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలోని  డాక్టర్ అబ్దుల్ కలాం ఐలాండ్ నుంచి బుధవారం(జూన్-12,2019)ఉదయం 11:25గంటలకు ఈ పరీక్షను నిర్వహించారు. దీంతో అమెరికా, రష్యా, చైనా తర్వాత ఈ సాంకేతిక పరిజ్ఞానం కలిగిన నాలుగో దేశంగా భారత దేశం నిలిచింది.  


అత్యాధునిక వ్యవస్థలకు కీలకమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు ఉపయోగపడే హైపర్‌సోనిక్ టెక్నాలజీ డిమాన్‌స్ట్రేటర్ వెహికిల్‌ను ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్‌లోని లాంచ్ ప్యాడ్ నంబర్-4 నుంచి ప్రయోగించినట్లు డీఆర్‌డీవో తెలిపింది. దీనిని రాడార్లు, టెలిమెట్రీ స్టేషన్లు, ఎలక్ట్రో ఆప్టికల్ ట్రాకింగ్ సెన్సర్లు నిరంతరం పరిశీలించాయని తెలిపింది. కీలక సాంకేతిక పరిజ్ఞానాన్ని మదింపు చేసేందుకు ఈ వెహికిల్ సేకరించిన సమాచారాన్ని డీఆర్‌డీవో శాస్త్రవేత్తలు విశ్లేషిస్తారని తెలిపింది.హైపర్‌ సోనిక్ మిసైల్స్ తయారీకి ఈ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగపడుతుంది. హైపర్‌ సోనిక్ టెక్నాలజీ డిమాన్‌ స్ట్రేటర్ వెహికిల్‌ ‌లో స్క్రామ్‌ జెట్ ఇంజిన్‌ ను అమర్చారు. ఇది శబ్ద వేగం కన్నా ఆరు రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణించగలదు. ఈ ఇంజిన్ తయారీ చాలా కీలకమైనదని డీఆర్‌డీవో తెలిపింది.
 

DRDO
successful
Test
ODISA
DR ABDUL KALAM ISLAND
HSTDV
missile
INDIGENOUSLY
Technology
DEVELOPED
Vehicle

మరిన్ని వార్తలు