మీ డేటా స్లోనా.. నో ప్రాబ్లమ్ : ఇన్ స్టాగ్రామ్ లో కొత్త ఫీచర్ 

Submitted on 10 June 2019
Instagram Now Has A Data Saver Feature, Which Will Help Load Images Even In Bad Network

ప్రపంచవ్యాప్తంగా ఎన్నో టెక్ కంపెనీలకు ఇండియా పెద్ద మార్కెట్ లా మారింది. టెక్ దిగ్గజ కంపెనీలు తమ ప్రొడక్టులను ఇండియా లక్ష్యంగా రిలీజ్ చేస్తున్నాయి. ప్రత్యేకించి రిమోట్ ఏరియాలో యూజర్లకు కూడా తమ సర్వీసు అందించేందుకు టెక్ కంపెనీలు పోటీ పడుతున్నాయి.

డేటా నెట్ వర్క్ తక్కువగా ఉండే ప్రాంతాల్లోని యూజర్లకూ తమ సర్వీసు ఈజీగా ఉండేందుకు వీలుగా రోజుకో కొత్త ఫీచర్ ను రిలీజ్ చేస్తున్నాయి. ప్రముఖ సోషల్ మీడియా సొంత ఫొటో యాప్ ఇన్ స్టాగ్రామ్ లో కొత్త డేటా ఫీచర్ వచ్చేసింది.అదే.. Data Saver ఫీచర్. ఫోన్లో నెట్ స్లోగా ఉన్నా పర్వాలేదు. ఇన్ స్టాగ్రామ్ ఫొటోలు ఈజీగా లోడ్ అవుతాయి. ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ఇన్ స్టాగ్రామ్ ఈ కొత్త డేటా సేవర్ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

లో నెట్ వర్క్ ఉన్న ప్రాంతాల్లో యాప్ డేటా వాడకాన్ని తగ్గించాలనే ఆలోచనతో ఈ కొత్త ఫీచర్ ప్రవేశపెట్టింది. గ్లోబల్ వారీగా ఆండ్రాయిడ్ యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చేసింది. ఐఓఎస్ యూజర్లకు కూడా త్వరలో అందుబాటులోకి రానుంది.

సాధారణంగా యూజర్లు తమ నెలవారీ డేటా బిల్లు తక్కువగా ఉండాలని, డేటా నెట్ ఫాస్ట్ లోడింగ్ స్పీడ్ ఉండాలని కోరుకుంటారు. ఈ తరహా యూజర్ల కోసం ఇన్ స్టాగ్రామ్ కొత్త డేటా సేవర్ ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో ఈ డేటా సేవర్ ఫీచర్.. ఎనేబుల్ చేస్తే చాలు.. యాప్ లో ప్రీ లోడింగ్ వీడియోలు ఆగిపోతాయి.

హై రెజ్యులుషన్ ఇమేజ్ లు డౌన్ లోడ్ కావు. స్టో నెట్ వర్కింగ్ ఉన్న ప్రాంతాల్లోని యూజర్లకు ఈ ఫీచర్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తున్నట్టు ఫేస్ బుక్ ఇండియా డైరెక్టర్ అండ్ ఎడ్ ఆఫ్ పార్టనర్ షిప్స్ మనీష్ చోప్రా తెలిపారు.

డేటా సేవర్ ఫీచర్ కోసం : 
* డేటా సేవర్ ఫీచర్ టర్న్ ఆన్ చేయాలి. 
* ఇన్ స్టాగ్రామ్ యాప్ ఓపెన్ చేసి.. సెట్టింగ్స్ బటన్ పై క్లిక్ చేయాలి.
* అకౌంట్ ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి. 
* సెల్యులర్ డేటా యూజ్ బటన్ పై క్లిక్ చేయాలి. 

instagram
 Data Saver Feature
Help Load Images
Bad Network

మరిన్ని వార్తలు