స్తంభించిన ఇన్ స్టాగ్రామ్ : లాగిన్ ఇష్యూతో యూజర్ల పాట్లు

Submitted on 6 June 2019
Instagram suffers another global outage, users unable to log-in

శాన్ ఫ్రాన్సిస్కో : ఫేస్ బుక్ సొంత ఫొటో మెసేజింగ్ యాప్ ఇన్ స్టాగ్రామ్ మరోసారి స్తంభించిపోయింది. ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో లాగిన్ ఇష్యూ తలెత్తింది. ఇండియా, అమెరికా, యూకే, సౌతాఫ్రికా, జపాన్, ఆస్ట్రేలియా సహా 6 ప్రపంచదేశాల్లోని ఇన్ స్టాగ్రామ్ యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

లాగిన్ ఇష్యూ, పేజ్ రీప్రెస్, పోస్టులపై కామెంట్స్, అప్ లోడింగ్ కంటెంట్ ఇష్యూలు ఎదుర్కొన్నట్టు ఓ నివేదిక వెల్లడించింది. యాప్ స్తంభించిపోవడంపై ఇన్ స్టాగ్రామ్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

లాగిన్ ఇష్యూపై ఎలాంటి చర్యలు చేపట్టారో క్లారిటీ లేదు.  అందిన రిపోర్ట్ ప్రకారం.. ఉదయం 9 గంటల ప్రాంతంలో ఇన్ స్టాగ్రామ్ స్తంభించినట్టు తెలిపింది. అయితే  కొన్ని గంటల తర్వాత ఇన్ స్టాగ్రామ్ తిరిగి పనిచేయడం ప్రారంభించినట్టు నివేదిక తెలిపింది.

ఇటీవల అమెరికా, యూకేలో స్తంభించిన గూగుల్ యాప్స్, స్నాప్ చాట్ రికవరీ అయిన తర్వాత వెంటనే ఇన్ స్టాగ్రామ్ స్తంభించడంతో యూజర్లు అసహనానికి గురయ్యారు. 2019 మార్చిలో ఇన్ స్టాగ్రామ్ సహా ఫేస్ బుక్ ఫ్యామిలీ యాప్స్ ప్రపంచవ్యాప్తంగా 24 గంటల పాటు స్తంభించిపోయాయి. 
Also Read : తమిళనాడులో 24 గంటలూ షాపులు తెరిచే ఉంటాయి

instagram
 global outage
unable log-in
Instagram outage

మరిన్ని వార్తలు