డ్వాక్రా మహిళలకు శుభవార్త : వడ్డీలేని రుణాల కోసం రూ.1,140 కోట్లు

Submitted on 12 July 2019
Interest free loans for Dwarkra women in AP budget is 1140 crores

అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాల కోసం బడ్జెట్‌లో రూ.1,140 కోట్లు ప్రకటించారు. పట్టణ స్వయం సహాయక బృందాలకు వైఎస్‌ఆర్‌ వడ్డీలేని రుణం కింద రూ.648 కోట్లు కేటాయించామన్నారు. వడ్డీలేని రుణాల కోసం బడ్జెట్ లో నిధులు కేటాయించటమే కాదు.. మహిళలు లబ్దిపొందే విధంగా, పారదర్శకంగా వాటిని సమీక్షించటం జరుగుతుందన్నారు. అలాగే ఆశా వర్కర్లకు గౌరవ వేతనం కోసం రూ.456 కోట్లు కేటాయించారు.

ఏపీఎస్‌ ఆర్టీసీకి సహాయార్థం రూ.వెయ్యి కోట్లు, రాయితీల కోసం రూ.500 కోట్లు, ఏపీ రహదారుల అభివృద్ధి కార్పొరేషన్‌కు రూ.260 కోట్లు కేటాయించామన్నారు. పౌర సరఫరాల శాఖకు బియ్యం రాయితీ కింద రూ.3వేల కోట్లు, పౌరసరఫరాల కార్పొరేషన్‌కు ఆర్థిక సాయం కింద రూ.384 కోట్లు కేటాయించారు.

గ్రామ వాలంటీర్ల కోసం రూ.720 కోట్లు, గ్రామ సచివాలయం కోసం రూ.700 కోట్లు, మున్సిపల్‌ వార్డు వాలంటీర్ల కోసం రూ.280 కోట్లు, మున్సిపల్‌ వార్డు సచివాలయాల కోసం రూ.180 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు.

 

AP
Budget
Interest free loans
Dwarkra women
1140 crores

మరిన్ని వార్తలు