International News

Wednesday, November 21, 2018 - 07:51

అఫ్గనిస్థాన్‌ : పచ్చని పెండ్లి మండపం. కళకళలాడుతు పెండ్లి విందులో ఆనందం అంతా మాదే అన్నట్లుగా వుండే ఆ పెండ్లి మండపం క్షణాల్లో శశ్మానంగా మారిపోయింది. నవ్వులు పూసిన చోట మృత్యువు విలయతాండవం చేసింది. మరో మారణ హోమానికి తెరతీరారు ఆత్మాహుతి దళం. అనారిక ఆలోచనలతో పచ్చని పెండ్లి మండపాన్ని శశ్మానంగా మార్చేశారు నరరూప రాక్షసులు. దేశంలో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు దేశ...

Tuesday, November 20, 2018 - 22:05

కాబూల్‌ : అఫ్ఘనిస్థాన్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఆత్మాహుతి దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో 40 మందికి పైగా మృతి చెందారు. ఇస్లాం మత ప్రవక్త మొహ్మద్‌ జయంతి సందర్భంగా కాబూల్‌లోని విమానాశ్రయం రోడ్డులో ఉన్న ఉర్నాస్‌ వెడ్డింగ్‌హాల్‌లో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అనేకమంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే పేలుడు...

Tuesday, November 20, 2018 - 16:54

ఢిల్లీ : ఆస్ట్రేలియాతో తొలి టీ20 మ్యాచ్‌‌కు భారత తుది జట్టును బీసీసీఐ ఇవాళా ప్రకటించింది. తొలి టీ20 కోసం 12 మంది సభ్యుల బృందాన్ని ఎంపిక చేసినట్లు బీసీసీఐ పేర్కొంది. యువ క్రికెటర్ రిషబ్ పంత్‌ను వికెట్ కీపర్‌గా ఎంపిక చేశారు. సీనియర్ వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ దినేశ్ కార్తీక్‌ను మిడిలార్డర్‌కు తీసుకున్నారు. టీ20ల నుంచి మాజీ...

Tuesday, November 20, 2018 - 16:01

న్యూజెర్సీ (అమెరికా): హిందు దేవతల బొమ్మలను అవమానిస్తూ అనేక సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. అలాగే జాతి వివక్ష జాడ్యం అమెరికన్లను వెంటాడుతూనే ఉంది. తాజాగా న్యూజెర్సీలోని ఓ నైట్‌క్లబ్ వాష్‌రూములో వేలాడదీసిన దేవతా చిత్రాలపై ఓ భారత సంతతి మహిళ తీవ్రంగా స్పందించింది.  ఆ మహిళ  అంకితా మిశ్రా బ్రూక్‌లిన్ లోని ‘...

Tuesday, November 20, 2018 - 15:34

ATM హోంమేడ్ ఉంటుందా.. పొట్ట నుంచి డబ్బులు రావటం ఏంటీ అని అనుకుంటున్నారా..నిజమే..ఇది ఫన్నీ విషయమే. బాగా పొట్ట ఉన్న ఓ పిల్లోడు చేసిన మ్యాజిక్ ఇది. తన ఫ్రెండ్‌తో కలిసి సరదాగా చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. హోం మేడ్ ATM విశేషాలు చూద్దాం..

ఇలా ఎలా :
ఊరు, పేరు...

Monday, November 19, 2018 - 13:02

బీరే కదా అని లైట్ తీసుకోకండి..
పాము విషం ఎంత ప్రమాదమో..ఇది అంతే..
గొంతు కాలిపోయినా ఆశ్చర్యం వద్దు..
ఎంత దమ్మునోళ్లైనా..ఇది డైరెక్టుగా తాగితే..స్వర్గానికి టిక్కేటే..
హాట్ డ్రింక్స్‌లో అబ్సింతేలోనే 60 శాతం అల్కహాల్ కంటెంట్..

ఢిల్లీ :...

Friday, November 16, 2018 - 21:11

హరారే: జింబాబ్వేలో ఒక బస్సులో గ్యాస్ ట్యాంక్ పేలి 42 మంది సజీవ దహనం అయ్యారు. మరో 20మంది తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. వీరిలో కొందరి పరిస్ధితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. జింబాబ్వే రాజధాని హరారేకి 550 కిలోమీటర్ల దూరంలోని గ్వాండా ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. బస్సులోని ప్రయాణికుడు తీసుకు వెళుతున్న గ్యాస్ ట్యాంక్...

Friday, November 16, 2018 - 12:26

వాషింగ్‌టన్ : ఎంత తెలివితేటలు ఉన్నా ఒక్కోసారి ఓ చిన్న తొందరపాటు చర్య అసలుకే మోసం తెస్తుంది అన్నది అక్షరాలా నిజమైంది నవోమీ అనే మహిళ విషయంలో. నవోమీ పేరుతో ట్వట్టర్‌లో నమోదు చేసుకున్న ఈ మహిళ అశ్లీలంగా కామెంట్ చేసి వచ్చిన ఉద్యోగాన్నే పోగొట్టుకుంది. నవోమీ నాసాలో ఉద్యోగం వచ్చినట్టు పోస్టు పెట్టి అందరినుంచి...

Thursday, November 15, 2018 - 17:24

సింగపూర్: ‘‘పగలు కొద్దిసేపు కునుకు తీస్తే ఆ ఫీలింగే వేరబ్బా’’ అంటున్నాడు ఫిలిప్పీన్స్ అధ్యక్షులు రోడ్రిగో డ్యూటెర్టే.. పవర్ న్యాప్‌ (కునుకు తీయడం) కోసం ఎన్నోసార్లు కీలక మీటింగ్‌లకే డుమ్మా కొట్టిన సందర్భాలు అనేకం అంటున్నాడు డ్యూటెర్టే. 
ఆగ్నేయ ఆసియా దేశాల అసోసియేషన్ సమ్మిట్ కోసం ఇతర దేశాల అధినేతలతో...

Thursday, November 15, 2018 - 15:12

కాలిఫోర్నియా (అమెరికా): ఇప్పటిదాకా గూగుల్ మ్యాప్స్‌ను దారి చూపించే మార్గదర్శిగానే ఉపయోగిస్తున్నాం. దీనికి అదనంగా మరోకొత్త ఫీచర్‌ను గూగుల్ కలిపింది. ఇకపై రెస్టారెంట్‌కు దారితోపాటు అక్కడ ఉన్న మేనేజర్‌తో మాట్లాడి టేబుల్ బుక్ చేసుకొనే సౌకర్యాన్ని కూడా గూగుల్ కల్పిస్తోంది. 
గూగుల్ తన బ్లాగు ద్వారా ఈ...

Thursday, November 15, 2018 - 13:51

ఐర్లాండ్: మన దేశంలో జరుగుతున్నట్టే మహిళలపై అత్యాచారాలు అన్ని దేశాల్లో చోటుచేసుకుంటున్నాయి. దోషులకు శిక్షపడేదాకా మహిళా సంఘాలు ఉద్యమాలు చేస్తూనే ఉంటాయి. ఇటీవల ఓ 17 ఏళ్ల బాలికపై 27 ఏళ్ల యువకుడు జరిపిన అత్యాచారం ఐర్లండ్‌లో సంచలనం సృష్టించింది. ఈ కేసు కోర్టులో విచారణ జరుగుతుండగా.. సదరు లాయర్ బాధితురాలు ధరించిన అండర్‌వేర్‌ను...

Thursday, November 15, 2018 - 12:20

సియోల్ : దక్షిణ కొరియా దేశం ఒక్కసారిగా స్థంభించిపోయింది. విమానాలను నిలిపేశారు. వ్యాపార సంస్థలు పనిచేయడం ఆగిపోయాయి. స్టాక్ మార్కెట్ లావాదేవీలను వాయిదా వేశారు. ట్రాఫిక్ అంతరాయాలు లేకుండా యావత్ దేశం కృషి చేసింది. ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా.. ఆశ్చర్యం కలగక మానదు. స్కూలు తర్వాత కాలేజీలో చేరేందుకు...

Wednesday, November 14, 2018 - 18:23

అమెరికా :  అమెరికాలో సెనేటర్స్ గా భారత సంతతి వ్యక్తులు వుండటం జరుగుతుంటుంది. కానీ ఇప్పటి వరకూ భారత సంతతికి చెందిన వారు అధ్యక్షపదవిని అలంకరించలేదు. ఈ నేపథ్యంలో రానున్న 2020లో ఎన్నికల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేయాలని భారత సంతతి సెనెటర్‌ కమలా హ్యారిస్‌ అనే 54ఏళ్ల  మహిళ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. నెల రోజుల క్రితం...

Wednesday, November 14, 2018 - 17:23

న్యూఢిల్లీ: ‘‘పాకిస్థాన్‌కు కాశ్మీర్ అవసరం లేదు... పాకిస్థాన్ ఉన్న నాలుగు రాష్ట్రాలనే మేనేజ్ చేయలేకపోతోంది. ఇక కాశ్మీర్‌ను ఏంచేసుకుంటుంది...’’ ఈ వ్యాఖ్యలు ఎవరో భారతీయుడు చేయలేదు.. ఈ వ్యాఖ్యలు చేసింది సాక్షాత్తూ పాకిస్థాన్ మాజీ క్రికెట్ మాజీ కేప్టన్ షాహిద్ ఆఫ్రిదీ.. అదీకూడా లండన్‌లో ఈ వ్యాఖ్యలు చేసి ...

Wednesday, November 14, 2018 - 16:49

పాకిస్థాన్ : భారత్, పాక్ ల మధ్య వివాదాస్పం కేంద్రంగా వున్న కశ్మీర్ పై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్నేషనల్ మీడియా సమావేశంలో మాట్లాడుతున్న సందర్భంగా షాహిద్ అఫ్రిద్ ఈ వ్యాఖ్యలు చేయటం సంచలనంగా మారింది. కశ్మీర్ పై పాకిస్థాన్ భారతదేశాలమధ్య వైరం రోజు రోజుకూ ముదురుతున్న నేపథ్యంలో అఫ్రిద్ వ్యాఖ్యలు...

Wednesday, November 14, 2018 - 13:51

కొలంబో: శ్రీలంక పార్లమెంట్ లో ప్రధాని మహింద రాజపక్స పై పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని పార్లమెంట్ ఆమోదించింది. అంతకు ముందున్న ప్రధాని విక్రమ రాజసింఘెను దించి, రాజపక్సను ప్రధానిని చేస్తూ శ్రీలంక అధ్యక్షుడు మైత్రీపాల సిరిసేన ఇచ్చిన ఆదేశాలపై శ్రీలంక సుప్రీం కోర్టు స్టే విధించింది. వచ్చే ఏడాది జనవరి 5న ముందస్తు ఎన్నికలు ...

Wednesday, November 14, 2018 - 13:28

అమెరికా : వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. వరుసగా రెండో ఏడాది అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి అమెరికాలోని హిందువులు హాజరయ్యారు. విశ్వాసాలు, నమ్మకాలకు విలువనిచ్చే దేశం అమెరికా అని...అలాంటి అద్భుతమైన సంప్రదాయాలను మన జీవనంలో భాగం చేసుకుంటున్నామని ట్రంప్ చెప్పారు....

Wednesday, November 14, 2018 - 12:21

జెనీవా: అత్యంత అరుదైన, నిఖార్సైన ‘పింక్ లీగసీ’  అనే గులాబీ వజ్రం మంగళవారం (నవంబర్ 13) జెనీవాలో జరిగిన ఆక్షన్‌లో దిమ్మతిరిగే ధర పలికింది. భారత కరెన్సీ ప్రకారం రూ 360 కోట్లకు పైగా ధర పలికడంతో ఆక్షన్ హాల్ చప్పట్లతో మారుమోగిపోయింది. ప్రమఖ జువెలర్ హ్యారీ విన్‌స్టన్ ఈ పింక్ డైమండ్‌ను 50 మిలియన్ల అమెరికన్...

Wednesday, November 14, 2018 - 11:42

కొలంబో: ఇద్దరు ప్రధాన మంత్రులు పవర్ కోసం పోటీపడటంతో శ్రీలంకలో రాజకీయ కల్లోలం ప్రారంభమైంది. ప్రధాని మహీంద్ర రాజపక్సేకు వ్యతిరేకంగా పార్లమెంటులో బుధవారం (నవంబర్ 14) అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. రాష్ట్రపతి మైత్రీపాల సిరిసేనను తొలగించడాన్ని మంగళవారం తప్పుపట్టిన శ్రీలంక సుప్రీంకోర్టు అకస్మిక ఎన్నికల...

Tuesday, November 13, 2018 - 14:44

వాషింగ్టన్‌ : అమెరికా జైళ్లలో 2400 మంది భారతీయులు ఉన్నారు. అక్రమంగా సరిహద్దులు దాటి అమెరికాలోకి ప్రవేశించారనే కారణంతో దాదాపు 2,400 మంది భారతీయులు అమెరికా జైళ్లలో మగ్గుతున్నారని ఓ నివేదిక వెల్లడించింది. వారు అమెరికాలో ఆశ్రయం కోరుతూ అక్రమంగా సరిహద్దులు దాటినట్లు తెలిపింది. వీరిలో ఎక్కువ మంది భారత్‌లోని పంజాబ్‌ రాష్ట్రం నుంచి...

Tuesday, November 13, 2018 - 14:21

ఢిల్లీ : మైక్రో బ్లాగింగ్‌ సైట్‌ ట్విటర్‌లో ఎడిట్ ఫీచర్ రానుంది. ట్విటర్‌లో త్వరలోనే ఎడిట్‌ ఆప్షన్‌ను చేర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. యూజర్లు తాము చేసే పోస్టుల్లో అక్షర దోషాలను నిరోధించేందుకు ఈ ఫీచర్‌పై కసరత్తు చేస్తున్నట్లు ట్విటర్‌ సీఈవో జాక్‌ డోర్సే తెలిపారు. డోర్సే భారత పర్యటన సందర్భంగా నిన్న ఐఐటీ ఢిల్లీలోని టౌన్‌...

Tuesday, November 13, 2018 - 12:48

  కాలిఫోర్నియా (అమెరికా): ఉత్తర కాలిఫోర్నియాలో రగులుతున్న అగ్నికీలలు వారం రోజులు గడిచినా ఆగిపోవడంలేదు. ఇప్పటి వరకూ 42 మంది అగ్నికి ఆహుతి అయ్యారు.  తాజాగా కాలిన 13 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఇది అత్యంత భయంకరమైన కార్చిచ్చుగా అమెరికా ప్రభుత్వం భావిస్తోంది. 
నవంబర్ 12న అమెరికా అధ్యక్షులు...

Monday, November 12, 2018 - 19:12

అమెరికా : దేశ  అధ్యక్ష పదవి ఎందరికో కల. ఆ కలను సాకారం చేసుకోవటం మాటలు కాదు. కానీ కొందరు ఆ కలను నెరవేర్చుకున్నారు. అమెరికా సెనేట్ లో భారతీయులు కూడా మెరిసారు. కానీ ఇప్పుడు మరొక అరుదైన పేరు వినబడుతోంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే అమెరికా అధ్యక్షపదవికి ఓ హిందువు పేరు వినిపిస్తోంది. ఆమే తులసి గబార్డ్. తులసి గబార్డ్...

Monday, November 12, 2018 - 18:45

అమెరికా : మరణానంతరం జీవితం కూడా లేదు. అద్భుతమైన ఈ విశ్వ రహస్యాల్ని తెలుసుకోవాలంటే మనకు ఉన్నది ఒక్క జీవితం మాత్రమే!'' అని అంత బలంగా చెప్పిన డాక్టర్‌ స్టీఫెన్‌ హాకింగ్‌కు ఆ ఒక్క జీవితం కూడా ఎంతో దారుణంగా గడపాల్సి వచ్చిందని చాలామందికి తెలిసి ఉండక పోవచ్చు. ఆయన తన గురించి ఇలా చెప్పుకున్నారు. ''నా శరీరం నిస్సత్తువగా కుర్చీలో...

Monday, November 12, 2018 - 16:40

అమెరికా: నార్త్ కొరియాకు చెందిన లాజరస్ అనే హ్యాకింగ్ గ్రూపు ఆసియా, ఆఫ్రికా దేశాలనుంచి లక్షల డాలర్ల సొమ్మును బ్యాంకు ఏటీఎమ్‌ల నుంచి దోపిడీ చేసిందని సైబర్ భధ్రతా సంస్థ సిమాంటిక్ ఒక నివేదికలో పేర్కొంది. సిమాంటిక్ పరిశోధనా సంస్థకు చెందిన సభ్యులు ఆర్థిక దాడులకు సంబంధించిన ఒక కొత్త కోణాన్ని కనుగొన్నారు. ‘...

Monday, November 12, 2018 - 14:10

యెమెన్‌ : హొదైడా నగరంలో ప్రభుత్వ వర్గాలకు, తిరుగుబాటుదారులకు మధ్య జరిగిన అల్లర్లలో తీవ్ర ప్రాణనష్టం జరిగింది. కేవలం 24 గంటల్లో 149 మంది ప్రాణాలు కోల్పోయారని ఇవాళా వైద్యులు, మిలిటరీ వర్గాలు వెల్లడించాయి. మృతి చెందిన వారిలో ఏడుగురు సాధారణ పౌరులు ఉన్నారని సైనిక ప్రతినిధులు తెలిపారు. అయితే ఘటనకు సంబంధించి అధికారులు పూర్తి...

Monday, November 12, 2018 - 12:58

అమెరికా: అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియా కార్చిచ్చు 31 మంది ప్రాణాలను బలితీసుకుంది. దాదాపు 83,275 ఎకరాలను విస్తరించిన ఈ మంటలను ఆర్పేందుకు 8 వేల మంది అగ్నిమాపక సిబ్బంది అహొరాత్రులు శ్రమిస్తున్నా ఆదివారం నాటికి కేవలం 10 శాతం మంటలను మాత్రమే అదుపు చేయగలిగారు. గాలుల ప్రభావంతో మంటలు తీవ్రంగా ఎగసిపడి ఇతర...

Pages

Don't Miss