ఐపీఎల్ 2019 అవార్డు విన్నర్లు వీరే..

Submitted on 13 May 2019
IPL 2019 Award Winners

భారీ అంచనాలతో మొదలైన ఐపీఎల్ 2019 వినోదాత్మకంగా ఉత్కంఠభరితంగా ముగిసింది. బౌండరీలను శాసించే భారీ హిట్టర్లు, మ్యాచ్‌ను తిప్పేసే బౌలర్లు, ఆకాశాన్ని తాకిని బంతిని ఒడిసి పట్టుకునే క్యాచ్‌లు అభిమానులకు వినోదాన్ని పంచి ముగించాయి.

ఈ సీజన్‌లో అవార్డులు గెలుచుకున్న ప్లేయర్లను ఓ సారి పరిశీలిస్తే..

ఐపీఎల్ 2019 ట్రోఫీ విన్నర్: ముంబై మరోసారి టైటిల్ గెలుచుకుంది. 2013, 2015, 2017, 2019 సీజన్లలో ముంబై టైటిల్ గెలుచుకుని కాలర్ ఎగరేసింది.

ఫైనల్ మ్యాచ్.. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా: జస్పిత్ర బుమ్రా

ఎమర్జెంగ్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్ : శుభ్‌మాన్ గిల్ 
124.30 స్ట్రైక్ రేట్‌తో సీజన్‌ను ముగించిన గిల్.. అవార్డు గెలుచుకుని రూ.10లక్షలు గెలుచుకున్నాడు. 

పర్‌ఫెక్ట్ క్యాచ్ ఆఫ్ ద సీజన్ : కీరన్ పొలార్డ్
సీజన్ మొత్తానికి పొలార్డ్ పట్టిన క్యాచ్‌యే పర్‌ఫెక్ట్ క్యాచ్. దీనికి గాను రూ.లక్ష తీసుకువెళ్లనున్నాడు. 

స్టైలిష్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్ : కేఎల్ రాహుల్
కేఎల్ రాహుల్ స్టైలిష్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్ అవార్డును గెలుచుకోగా, ఆ అవార్డును అతని స్నేహితుడైన హార్దిక్ పాండ్యా చేతుల మీదుగా అందుకున్నాడు. 

పర్పుల్ క్యాప్ హోల్టర్ : ఇమ్రాన్ తాహిర్
సీజన్ మొత్తంలో 26వికెట్లు పడగొట్టిన తాహిర్ పర్పుల్ క్యాచ్ అవార్డు అందుకున్నాడు. 2012 సీజన్లో హర్భజన్ సింగ్ అందుకోగా, 2013సీజన్లో సునీల్ నరైన్ సొంతం చేసుకున్నాడు. 

ఆరెంజ్ క్యాప్ హోల్డర్ : డేవిడ్ వార్నర్


మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ : ఆండ్రీ రస్సెల్
ఆండ్రీ రస్సెల్.. కోల్‌కతా నైట్ రైడర్స్ ప్రధాన ఆయుధంగా మారాడు. ఆ జట్టు ప్లే ఆఫ్ వరకూ రాగలిగిందంటే రస్సెల్ హిట్టింగ్ ఓ బలమైన కారణం. ఈ అవార్డుకు రస్సెల్ రూ.లక్ష రివార్డు అందుకున్నాడు. 

సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ద సీజన్ : ఆండ్రీ రస్సెల్
ఆండ్రీ రస్సెల్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డుతో పాటు సూపర్ స్ట్రైకర్ అవార్డును సొంతం చేసుకున్నాడు. దీనికి మరో రూ. లక్ష అందడమే కాక, కారును కూడా బహుకరించారు. 

ఫెయిర్ ప్లే అవార్డు : సన్‌రైజర్స్ హైదరాబాద్  
2019 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఫెయర్ ప్లే అవార్డు దక్కింది. ఈ అవార్డును వీవీఎస్ లక్ష్మణ్ అందుకుంటారు. ఈ విభాగానికి ఏ రకమైన రివార్డులు లేవు. 


పిచ్ అండ్ గ్రౌండ్ అవార్డు : పంజాబ్ క్రికెట్ అసోసియేషన్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్
 

IPL 2019
IPL 12
IPL AWARDS

మరిన్ని వార్తలు