జగన్ దాడి కేసు...శ్రీనివాసరావు కస్టడీ పొడిగిస్తారా ?

09:14 - November 2, 2018

విశాఖపట్టణం : వైసీపీ అధ్యక్షుడు జగన్ దాడికి సంబంధించి శ్రీనివాసరావు పోలీసు కస్టడీ నేటితో ముగియనుంది. దీనితో కోర్టు ఎదుట అతడిని హాజరు పరుచనున్నారు. విచారణ జరుగుతోందని..అతని కస్టడీ కొనసాగించాలని సిట్ అధికారులు రిట్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. కోర్టు కస్టడీ పొడిగిస్తుందా ? లేదా ? అనే ఉత్కంఠ నెలకొంది. మరోవైపు విచారణలో శ్రీనివాసరావు ఎలాంటి కీలక అంశాలు వెల్లడించారనేది తెలియడం లేదు. మొత్తం ఈ కేసులో 40మందిని విచారించారు. ఇందులో 30 మంది అమ్మాయిలు ఉండడంతో విచారణ మందకొడిగా సాగిందని తెలుస్తోంది. దాడికి ముందు శ్రీనివాసరావు పదివేల కాల్స్ చేశారని గుర్తించిన కాప్స్ 300 పైచిలుకు కాల్స్ పై దర్యాప్తు చేపట్టారు. ఇందులో గంటల వ్యవధిలో మాట్లాడడం..అధికంగా ఏ వ్యక్తులతో మాట్లాడారో వారిని పోలీసులు గుర్తించారు. వీరిని కూడా సిట్ అధికారులు విచారించినట్లు సమాచారం. శ్రీనివాసరావు కస్టడీకి కోర్టు అనుమతినిస్తుందా ? లేదా ? అనేది కాసేపట్లో తెలియనుంది. 

Don't Miss