ప్రత్యేక హోదా ఇవ్వండి, ప్రమాణస్వీకారానికి రండి : ప్రధాని మోడీతో జగన్

Submitted on 26 May 2019
Jagan meeting with Prime Minister Modi in Delhi

ఢిల్లీలో ప్రధాని మోడీతో.. వైసీపీ చీఫ్ జగన్ భేటీ అయ్యారు. ఏపీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన జగన్ కి మోడీ అభినందనలు తెలిపారు. ఈ భేటీలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని జగన్ కోరారు. ఏపీని ఆర్థికంగా ఆదుకోవాలన్నారు. విభజన హామీలను అమలు చేయాలని కోరారు. జగన్ తోపాటు తొమ్మిది మందికి ప్రధాని అపాయింట్ మెంట్ ఇచ్చారు. జగన్, సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం, విజయసాయిరెడ్డి, ఎంపీలు మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి, సురేష్, బాలశౌరి, భరత్ లు మోడీని కలిశారు. 

ఏపీలో వైసీపీ ఘన విజయం సాధించింది. 175 అసెంబ్లీ స్థానాలకు గానూ 151 స్థానాల్లో విజయం సాధించింది. 22 లోక్ సభ స్థానాలను కైవసం చేసుకుంది. భారీ మెజారిటీతో కేంద్రంలో రెండోసారి  అధికారంలోకి రావడంతో జగన్ కూడా మోడీకి అభినందనలు తెలిపారు.

కేంద్ర నుంచి ఏపీకి రావాల్సిన నిధులు, పెండింగ్ బిల్లులకు సంబంధించి అధికారులు ప్రాథమికంగా నివేదిక తయారు చేసినట్లు తెలుస్తోంది. వెనుకబడిన జిల్లాలకు నిధులు అందించడం, శాఖల వారిగా పెండింగ్ లో ఉన్న బిల్లులకు సంబంధించి అధికారులు రిపోర్టు తయారు చేశారు. పోలవరం ప్రాజెక్టు పనులు 60 శాతం పూర్తి అయ్యాయి. మిగిలిన పనుల పూర్తికి నిధులు కావాల్సివుంది. రాష్ట్రంలో పెండింగ్ అంశాలపై దృష్టి సారించాలని మోడీని జగన్ కోరారు. మే 30న జగన్ ఏపీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. తన ప్రమాణస్వీకారోత్సవానికి తప్పుకుండా రావాలని ప్రధాని మోడీని జగన్ ఆహ్వానించారు. ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ ని కూడా జగన్ ఆహ్వానించారు.

Jagan
meeting
Prime Minister Modi
Delhi

మరిన్ని వార్తలు