జనపథం

Thursday, February 23, 2017 - 10:08

వివిధ వృత్తుల మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా వివిధ వృత్తులవారితో సమావేశమవుతున్నారు. చేనేత కార్మికులు, మత్స్యకారులు, ఎంబిసిలు ఇలా వివిధ వర్గాలతో సమావేశమవుతున్న సిఎం కెసిఆర్ కొత్త ఆలోచనలు ప్రకటిస్తున్నారు. తెలంగాణలో వ్యవసాయం తర్వాత ఎక్కువ శాతం మందికి ఉపాధి చూపిస్తున్న చేనేతరంగంలో ప్రభుత్వం...

Wednesday, February 22, 2017 - 06:58

తెలంగాణ జెఏసి తలపెట్టిన నిరుద్యోగ ర్యాలీకి వివిధ విద్యార్థి యువజన సంఘాలతో పాటు రాజకీయ పార్టీలు కూడా మద్దతు ప్రకటించాయి. నిధులు, నీళ్లు, నియామకాల చుట్టూనే తెలంగాణ ఉద్యమం నడిచింది. తెలంగాణ ఏర్పడి రెండున్నరేళ్లయినా నిరుద్యోగుల ఆశలు ఫలించలేదు. తెలంగాణ రాష్ట్రంలో లక్షకు పైగా పోస్టులు ఖాళీగా వుండగా, ఇప్పటికి భర్తీ చేసినవి నిండా పన్నెండు వేలు కూడా లేవు. సుమారు 35 వేల పోస్టులకు...

Tuesday, February 21, 2017 - 07:20

ఎన్నో పోరాటాల ఫలితంగా వచ్చిన ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం స్పూర్తికే తూట్లు పడుతున్నాయి. 2013 ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని మార్చేందుకు దళిత, గిరిజన ప్రజా ప్రతినిధులతో ముఖ్యమంత్రి కెసిఆర్ కమిటీ ఏర్పాటు చేయడం తీవ్ర వివాదస్పదమైంది. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని రక్షించుకునేందుకు వివిధ దళిత, గిరిజన సంఘాలు ఉద్యమ బాట పడుతున్నాయి. ఈ అంశంపై టెన్ టివి జనపథంలో తెలంగాణ వ్యవసాయ...

Monday, February 20, 2017 - 10:34

ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారించాలని టిఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నేత రాజిరెడ్డి డిమాండ్ చేశారు. ఇందే అంశంపై నిర్వమించిన జనపథం కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం చలో బస్ భవన్ నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది. రేపు  చేపట్టే చలో  బస్ భవన్ కార్యక్రమం గురించి ఇప్పటికే ఈయూ నేతలు విభిన్న రూపాల్లో ప్రచారం నిర్వహించారు....

Friday, February 17, 2017 - 06:40

హైదరాబాద్: నిధులు, నీళ్లు, నియామకాల చుట్టూనే తెలంగాణ ఉద్యమం నడిచింది. తెలంగాణ ఏర్పడి రెండున్నరేళ్లయినా నిరుద్యోగుల ఆశలు ఫలించలేదు. తెలంగాణ రాష్ట్రంలో లక్షకు పైగా పోస్టులు ఖాళీగా వుండగా, ఇప్పటికి భర్తీ చేసినవి నిండా పన్నెండు వేలు కూడా లేవు. సుమారు 31 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్లు వెలువడ్డాయి. అయితే ఈ రెండున్నరేళ్ల కాలంలో 30 వేల మందికి పైగా...

Thursday, February 16, 2017 - 07:03

చిత్తూరు: తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగుల పోరాటాలు ఉధృతమవుతున్నాయి. మొన్న కపిలతీర్థం నుంచి తిరుమల కొండవరకు భారీ ర్యాలీ నిర్వహించేందుకు వేలాది టిటిడి ఉద్యోగులు ప్రయత్నించారు. దాదాపు 150మంది టిటిడి కార్మికులు అరెస్టయ్యారు. గత నెల 9వ తేదీన కూడా టిటిడి కార్మికులు టిటిడి చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి ఇంటిని ముట్టడించారు. టిటిడి కార్మికులు ఇలా...

Wednesday, February 15, 2017 - 06:42

హైదరాబాద్: సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ టీచర్ల భవిష్యత్ అయోమయంగా మారింది. గురుకుల పాఠశాలల్లో 7306 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వడంతో పది పదహారేళ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ టీచర్ల భవిష్యత్ పై బెంగ పెట్టుకున్నారు. గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన విధంగా తమ ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేసి, తమకు అన్యాయం జరగకుండా...

Tuesday, February 14, 2017 - 06:39

హైదరాబాద్:తెలంగాణలోని వివిధ యూనివర్సిటీలలోని కాంట్రాక్ట్ లెక్చరర్స్ పోరుబాట పట్టారు. ఇప్పటికే విభిన్న రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టిన కాంట్రాక్ట్ లెక్చరర్స్ రేపటి నుంచి నిరవధిక సమ్మెకు సిద్ధమవుతున్నారు. నిన్న ఉస్మానియా యూనివర్సిటీలో భారీ ర్యాలీ నిర్వహించిన కాంట్రాక్ట్ లెక్చరర్స్ తమ సమస్య పరిష్కారం అయ్యేవరకు పోరాడాతామంటూ స్పష్టం చేశారు...

Monday, February 13, 2017 - 06:48

హైదరాబాద్: తెలంగాణలో గురుకుల పాఠశాలల ఉద్యోగ నోటిఫికేషన్ వివాదం ఇంకా రాజుకుంటోంది. గత వారం ఇదే అంశంపై జనపథం నిర్వహించిన రోజే ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా విద్యార్థుల సమస్యలపై ఒకింత సానుకూల దృక్పథంతో స్పందించారు. గురుకుల టీచర్ పోస్టుల భర్తీ విషయంలో డిగ్రీలో 60శాతం మార్కుల నిబంధనను సిఎం కూడా వ్యతిరేకించారు. అయితే, పాత నోటిఫికేషన్ ను సవరిస్తూ మరో...

Friday, February 10, 2017 - 11:02

ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు మహిళా పార్లమెంటేరియన్ల సదస్సు జరుగుతోంది. ఈ సదస్సుకు ఆంధ్రప్రదేశ్ ఆతిథ్యమిస్తోంది.  లోక్ సభలోని 62 మంది మహిళా ఎంపిలు, రాజ్యసభలోని 20 మంది మహిళా ఎంపిలతో పాటు  వివిధ రాష్ట్రాలకు చెందిన 405 మంది  మహిళా ఎమ్మెల్యేలు ఈ సదస్సులో పాల్గొంటారని సమాచారం. దాదాపు 1200మంది దేశ విదేశీ ప్రతినిధులను ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్ లో మహిళా పార్లమెంటేరియన్ల సదస్సు...

Wednesday, February 8, 2017 - 06:38

హైదరాబాద్: రవాణారంగంలో భారీగా పెంచిన ఫీజులు, జరిమానాలకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ లో ఆటోలు, లారీలు, కారు, జీవు, ట్రాక్టర్ ,అంబులెన్స్ డ్రైవర్లు, యజమానులు బంద్ పాటించాయి. సిఐటియు, ఏఐసిటియు, ఐఎఫ్ టియు, వైఎస్ఆర్ టియుసి మొదలైన యూనియన్ లు ఈ బంద్ లో పాల్గొన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ట్రాన్స్ పోర్ట్ రంగం కార్మికులు బంద్ పాటించడానికి కారణం ఏమిటి?...

Monday, February 6, 2017 - 12:07

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు పోరుబాట పట్టారు. జనవరి 19, 29, 30 తేదీలలో వివిధ రకాల ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన ఆర్టీసీ కార్మికులు పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తున్నారు. రేపు హైదరాబాద్ ఇందిరాపార్క్ దగ్గర మహాదీక్ష చేపడుతున్నారు. ఈ దీక్షలో తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి ఆర్టీసీ కార్మికులు పాల్గొనబోతున్నారు. కేంద్రం విడుదల చేసిన టాక్సీ పాలసీ, ఎంవి యాక్ట్ సవరణ బిల్లు, రాష్ట్ర...

Friday, February 3, 2017 - 07:07

ఈసారి బడ్జెట్ లో వ్యవసాయానికి రైతులకు అగ్రప్రాధాన్యత ఇచ్చినట్టు కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. 10 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు, వ్యవసాయం దాని అనుబంధ రంగాలకు 58,663 కోట్లు కేటాయించిన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రాబోయే అయిదేళ్లలో రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే లక్ష్యమని ప్రకటించారు. అయితే, నిజంగా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే విధంగా ఈ బడ్జెట్ వుందా? తాజా బడ్జెట్ వ్యవసాయ రంగానికి...

Thursday, February 2, 2017 - 06:57

హైదరాబాద్: మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ లు రేపు దేశవ్యాప్తంగా సమ్మె చేపట్టబోతున్నారు. ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఈ సమ్మెకు పిలుపునిచ్చింది. ఈ సమ్మెకు కార్మిక సంఘాలు కూడా సంఘీభావం ప్రకటిస్తున్నాయి. ఇంతకీ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ దేశ వ్యాప్త సమ్మెకు కారణం ఏమిటి? ఈ సమ్మె సందర్భంగా...

Tuesday, January 31, 2017 - 06:40

హైదరాబాద్: రేపు కేంద్ర బడ్జెట్ రాబోతోంది. అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టే కొత్త బడ్జెట్ కోసం దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. విద్యారంగం అభివృద్ధికి బడ్జెట్ లో చేసే ప్రతిపాదనలే కీలకం. దురదృష్టవశాత్తు మన దేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగానికి తక్కువ నిధులు కేటాయిస్తుండడం విద్యార్థుల పాలిట శాపంగా మారుతోంది. కేంద్ర బడ్జెట్ లో 10 శాతం, రాష్ట్ర...

Monday, January 30, 2017 - 06:41

హైదరాబాద్: మరో రెండు రోజుల్లో కేంద్ర బడ్జెట్ రాబోతోంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత వస్తున్న బడ్జెట్ కావడంతో విభిన్న వర్గాలు ఆసక్తిగా చూస్తున్నాయి. ఈసారి బడ్జెట్లో అనేక మార్పులు జరుగుతున్నాయి. ఫిబ్రవరి నెలాఖరులో బడ్జెట్ పెట్టడం సంప్రదాయం కాగా, ఈ సారి ఫిబ్రవరి ఫస్టనే బడ్జెట్ పెడుతున్నారు. ఈ సారి రైల్వే బడ్జెట్ విడిగా పెట్టడం లేదు. ప్రణాళిక,...

Friday, January 27, 2017 - 11:27

పశ్చిమగోదావరిలో కాలుష్యం పడగ విప్పిందని సీపీఎం జిల్లా కార్యదర్శి బలరామ్ అన్నారు. ఇవాళ్టి జనపథం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కాలుష్య కాసారంగా మారుతోంది. పారిశ్రామిక వ్యర్థాలు, మున్సిపాల్టీల నిర్లక్ష్యం వెరసి సాగు, తాగునీటి వనరులను కాలకూటవిషంగా మార్చేస్తున్నాయి. గోస్తనీ నది, కొల్లేరు, మొగల్తూరు కాలువ, యనమదుర్రు డ్రెయిన్ అనేక జలవనరులు కలుషితమవుతున్నాయి...

Thursday, January 26, 2017 - 12:50

కొత్త జిల్లాల్లోని సమీప మండలాల్లో ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు బి.ప్రసాద్ డిమాండ్ చేశారు. ఇదే అంశంపై నిర్వహించిన ఇవాళ్టి జనపథం చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. 'కొత్త జిల్లాల ఏర్పాటు ఉపాధి హామీ పథకం కూలీలకు కొత్త కష్టాలు తెచ్చిపెట్టింది. సమీప మండలాల్లో ఉపాధి హామీ అమలు చేయొద్దంటూ ప్రభుత్వం నిర్ణయించడం కూలీల పాలిట శాపంగా...

Wednesday, January 25, 2017 - 10:55

తెలంగాణ యూనివర్సిటీలు సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాతున్నాయని ఏఐఎస్ ఎఫ్ నేత శివరామకృష్ణ అన్నారు. ఇదే అంశంపై నిర్వహించని జనపథం చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. 'ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలకు ముస్తాబవుతోంది. యూనివర్సిటీ విద్యను ప్రక్షాళన చేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా చెబుతున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు...

Tuesday, January 24, 2017 - 09:34

మందుల ధరలను ఇష్టానుసారంగా పెంచుతున్నారని.. ప్రభుత్వ నియంత్రణ ఉండాలని తెలంగాణ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్ నాయకులు రాజు భట్ అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ లు ఫిబ్రవరి 3న దేశవ్యాప్తంగా సమ్మె చేపట్టబోతున్నారు. ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్...

Monday, January 23, 2017 - 07:03

తెలంగాణలోని సాంఘిక సంక్షేమ హాస్టల్ విద్యార్థులు చలికి గజగజ వణికిపోతున్నారు. కిటికీలు, తలుపులేని గదుల్లో నేల మీదే పడుకుంటున్న దృశ్యాలు అనేక హాస్టళ్లలో కనిపిస్తున్నాయి. ప్రభుత్వం చద్దర్లు, రగ్గులు సరఫరా చేయకపోవడం, ఒకవేళ సరఫరా చేసినా నాణ్యతలేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. విద్యా సంవత్సరం పూర్తి కావొస్తున్నా ఇంతవరకు యూనిఫాం పంపిణీ చేయలేదు. తెలంగాణలో...

Friday, January 20, 2017 - 06:58

హైదరాబాద్: జనరల్ ఇన్స్యూరెన్స్ రంగంలో సంస్కరణలకు కేంద్ర ప్రభుత్వం తెరలేపింది. కేంద్ర కేబినెట్ సమావేశాలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వరంగంలోని 5 జనరల్ ఇన్స్యూరెన్స్ కంపెనీలలో 25శాతం వాటాలను విక్రయిస్తామంటూ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ, యునైటెడ్ ఇండియా ఇన్స్యూరెన్స్, ఓరియెంటల్ ఇన్స్యూరెన్స్...

Thursday, January 19, 2017 - 09:08

స్కీమ్ వర్కర్లు రేపు దేశవ్యాప్త సమ్మె చేయబోతున్నారు. అంగన్ వాడీ వర్కర్లు, మధ్యాహ్న భోజనం వర్కర్లు, ఆశా వర్కర్లు, సాక్షర భారత్, సర్వశిక్షా అభియాన్, ఉపాధి హామీ పథకం సిబ్బంది ఇలా 60 రకాల స్కీమ్ లలో పనిచేస్తున్నవారే స్కీమ్ వర్కర్లు. ఉద్యోగ భద్రత లేకపోవడం, సమాన పనికి సమాన వేతనం లభించకపోవడం లాంటి సమస్యలు వీరిని వెన్నాడుతున్నాయి. రేపు స్కీమ్ వర్కర్లు దేశ వ్యాప్త సమ్మె చేపట్టడానికి...

Wednesday, January 18, 2017 - 10:17

హైదరాబాద్: మోటారు వాహన నిబంధనల్లో మార్పులు, రవాణాశాఖ ఫీజుల పెంపు, ట్రాఫిక్ ఉల్లంఘన పెనాల్టీలు వంటి చర్యలు ఆర్టీసీ పాలిట శాపంగా మారుతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. కేంద్రం విడుదల చేసిన గెజిట్ ను వెనక్కి తీసుకోవాలంటూ కార్మికసంఘాలు పట్టుబడుతున్నాయి. రేపు అన్ని ఆర్టీసీ డివిజనల్ మేనేజర్ కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహించేందుకు కార్మికులు...

Tuesday, January 17, 2017 - 06:45

హైదరాబాద్ : గొర్రెల పెంపకాన్ని భారీ పరిశ్రమలా అభివృద్ధి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ చెబుతున్నారు. తెలంగాణలో గొర్రెల పెంపకం అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలను సూచించేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణలో గొర్రెల పెంపకానికి వున్న అవకాశాలేమిటి? అవరోధాలేమిటి? గొర్రెల పెంపకందారులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలేమిటి? వీరి...

Monday, January 16, 2017 - 07:09

హైదరాబాద్ : చేనేతకు తానే బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తానంటూ మంత్రి కెటిఆర్ ప్రకటించి, కొత్త సంవత్సరంలో ఆశావహ దృక్పథం కలిగించారు. అసెంబ్లీ, శాసనమండలి ఆవరణలో చేనేత స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ స్టాల్స్ ఎంపి కవిత కూడా వస్త్రాలు కొనుగోలు చేయడం మరో విశేషం. చేనేత వస్త్రాలను ఆన్ లైన్ లో విక్రయించేందుకు టెస్కో ప్రయత్నిస్తోంది. ఇలా చేనేతరంగంలో కొత్త...

Thursday, January 12, 2017 - 09:38

తెలంగాణ రాష్ట్రంలో కళాకారుల జీవితాలు దుర్భరంగా ఉన్నాయని సామాజిక తెలంగాణ గుండె చప్పుడు సంస్థ అధ్యక్షులు ఏపూరి సోమన్న అన్నారు. ఇవాళ్టి జనపథం చర్చా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 'తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన కళాకారులెందరో వున్నారు. చిందుబాగోతం, యక్షగానం, మందెచ్చుల, కాకిపడగల, శారద, ఒగ్గు, బైండ్ల ఇలా అనేకరకాల కళాకారులు తెలంగాణలో వున్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డ...

Pages

Don't Miss