జనపథం

Wednesday, July 18, 2018 - 07:16

ఎంతో పేరు ప్రఖ్యాతలున్న ఎమ్ఎన్‌జే క్యాన్సర్‌ ఆసుపత్రిని అటానమస్‌ చేసే ప్రభుత్వ ఆలోచనపై అక్కడి డాక్టర్లు, సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రాష్ర్టాలతోపాటు.. చుట్టుపక్కల చాలా రాష్ర్టాల్లోని క్యాన్సర్‌ బాధితులకు గత కొన్ని దశాబ్దాలుగా ఆసరాగా ఉన్న ఈ ఆసుపత్రిని అటానమస్‌ చేయాలని ఆలోచించడం బాధాకరమని, ఇలాంటి ప్రయత్నాలను వెంటనే విరమించుకోవాలని వారు డిమాండ్‌ డిమాండ్‌...

Tuesday, July 17, 2018 - 07:39

తెలంగాణలో చేనేత కార్మికులకు ఎన్నికల నాడు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని చేనేత కార్మికుల పట్ల మాటల్లో ఒకరకంగా చేతల్లో ఒక రకంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని చేనేత కార్మికుల సంఘం ఆందోళన వ్యక్తం చేస్తుంది. చేనేత కార్మికుల సంక్షేమ నిధిని ఏర్పాటు చేస్తానని ఇప్పటికీ చేయలేదని..... చేనేతకు, జౌలికి ప్రత్యేక బడ్జెట్‌కు కేటాయిస్తామని అది కూడా అమలు చేయలేదని.... చేనేత కార్మికుల కోసం ఏర్పాటు...

Monday, July 16, 2018 - 08:40

ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ కార్మికులు ఆందోళనబాట పట్టారు. వేతన ఒప్పందం చేయకుండా.. కేవలం కొద్దిపాటి ఐఆర్‌ ఇవ్వడంపై ఆర్టీసీ యాజమాన్యం మీద దాన్ని కుదుర్చుకున్న గుర్తింపు సంఘం మీద ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ పట్ల యాజమాన్యం, ప్రభుత్వం తీరు మారాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. ఇదే అంశంపై ఆంధ్రప్రదేశ్‌ స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుందరయ్య మాట్లాడారు...

Friday, July 13, 2018 - 11:37

ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయులు ఆందోళన బాట పట్టారు. ప్రభుత్వ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని.. ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న టీచర్‌ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఉపాధ్యాయుల సమస్యలు, వాటి పట్ల ప్రభుత్వ విధానంపై ఉపాధ్యాయుల భవిష్యత్ కర్తవ్యం ఏమిటి? ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయులు గత కొన్ని రోజులుగా...

Thursday, July 12, 2018 - 07:47

ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాల కోసం యువజన సంఘాలు ఆందోళన బాట పట్టాయి. బాబు వస్తే జాబు వస్తుందని, ఇంటికో ఉద్యోగం ఇస్తామని ఎన్నికల నాడు చెప్పి తీరా అధికారంలోకి వచ్చాక ఆ మాట నిలబెట్టుకోలేదని వారు మండిపడుతున్నారు. ఉద్యోగాలు ఇవ్వలేని పక్షంలో ప్రతి యువకునికి 2వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిన చంద్రబాబు నేడు వెయ్యి రూపాయలు ఇస్తామంటున్నారని ఇది యువతను మోసం చేయడమేనని వారు...

Wednesday, July 11, 2018 - 08:21

తెలంగాణలో కాంట్రాక్ట్‌ అండ్‌ ఔట్‌సోర్సింగ్‌ ఎంప్లాయిస్‌ ఆందోళన బాట పట్టారు. ఈ నెల 15వ తేదీన శంఖారావం పేరుతో ఆందోళన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. జులై 1 నుంచి రెగ్యులర్‌ ఎంప్లాయిస్‌కు అమలైనట్లే తమకు కూడా కొత్త పీఆర్‌సీని అమలు చేయాలని.. వారికి పెంచినట్లుగానే తమకూ జీతాలు పెంచాలని.. తమను పర్మినెంట్‌ చేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. వారి డిమాండ్లు వారిపట్ల ప్రభుత్వ విధానాలపై...

Tuesday, July 10, 2018 - 07:59

తెలంగాణలో అంగన్ వాడిలు ఆందోళన బాట పట్టారు. తమ సమస్యల సాధన కోసం 36 గంటల ధర్నా చేపట్టారు. తమకు కనీస వేతనం ఇవ్వాలని.. తమకు పీఎఫ్‌, ఈఎస్‌ఐల సదుపాయం కల్పించాలని.. పెన్షన్‌ ఇవ్వాలని.. ఐసీడీఎస్‌ను రక్షించాలని డిమాండ్‌ చేస్తూ వారు ఆందోళన బాట పట్టారు. వారు ఆందోళనకు గల కారణాలు, వారి పట్ల ప్రభుత్వ విధానాలపై ఇవాళ్టి జనపథంలో అంగనీవాడీ వర్కర్స్‌ యూనియన్‌ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి...

Monday, July 9, 2018 - 07:07

యూనివర్సిటీ గ్రాంట్‌ కమిషన్‌ స్థానంలో భారత ఉన్నత విద్యా కమిషన్‌ తీసుకురావాలని కేంద్రం ఆలోచనను విద్యార్థి సంఘాలు, యూనివర్సిటీ ఫ్రొఫెసర్లు, విద్యారంగ నిపుణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వ యూనివర్సిటీలకు ఇబ్బంది కలిగే ప్రమాదం ఉందని... విద్యావ్యవస్థకు ఉన్న స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసేదిగా ఉందని వారు పేర్కొంటున్నారు. ఈ ఆలోచనను కేంద్రం వెంటనే వెనక్కి...

Saturday, July 7, 2018 - 06:39

ఢిల్లీ : వివాదాస్పద ఇస్లాం మత బోధకుడు జకీర్ నాయక్‌ను ఇండియాకు అప్పగించేది లేదని మలేషియా ప్రధాని మహతిర్ మొహమ్మద్ స్పష్టం చేశారు. జకీర్‌కు మలేషియా పౌరసత్వం ఇచ్చామని...ఆయన వల్ల దేశంలో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కానంతవరకు అప్పగించే ప్రసక్తే లేదన్నారు. జకీర్‌పై రెచ్చగొట్టే ప్రసంగాలు, మతోన్మాదం నూరిపోయడం, మనీ లాండరింగ్ సహా పలు కేసులున్నాయి. జకీర్ 2016లో మలేషియాకు...

Friday, July 6, 2018 - 08:11

గుంటూరులో భజరంగ్ జూట్ మిల్ తెరిపించాలని కార్మికుల ఆందోళన బాటపట్టారు. ఈ సంస్థను మూసివేసి 3 సంవత్సరాలు అవుతున్న,.. 2500 మంది రోడ్డున పడిన కార్మికుల ఆవేదనని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కలుగుజేసుకొని దీన్ని తెరిపించి కార్మికులకు ఉపాధి కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై టెన్ టివి జనపథంలో భజరంగ్ జూట్...

Thursday, July 5, 2018 - 06:35

బీసీలను ఏబీసీడీలుగా వర్గీకరించి వారికి బీసీ రిజర్వేషన్లు పంచి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ ఎంబీసీ సంఘం డిమాండ్‌ చేస్తోంది. ఈ అంశాన్ని కోర్టు వరకూ తీసుకెళ్లింది. ఇప్పటికీ స్థానిక సంస్థల్లో అధికారాన్ని అందుకోలేని బీసీ కులాలు చాలా ఉన్నాయని వారికి కూడా అధికారంలో సమాన అవకాశాలు దక్కాలని వారు కోరుతున్నారు. ఇదే డిమాండ్‌తో ఎంబీసీ సంఘం ఆందోళన చేస్తోంది. ఈ అంశంపై టెన్...

Wednesday, July 4, 2018 - 06:52

ఆంధ్రప్రదేశ్‌లో ఆయూష్‌ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. ఒకవైపు దేశీయ వైద్యాన్ని ప్రోత్సహిస్తామని మాటలు చెబుతూ.. యోగా డే లు ఘనంగా నిర్వహిస్తున్న పాలకులు ఆచరణలో మాత్రం ఆ వైద్యాన్ని అసలు పట్టించుకోవడం లేదని వారు మండిపడుతున్నారు. హోమియో, ఆయుర్వేద, యునాని డిస్పెన్సరీల్లో పనిచేస్తున్న తమకు గత 15 నెలలుగా జీతాలు ఇవ్వకుండా పెండింగ్‌లో పెట్టారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు....

Tuesday, July 3, 2018 - 11:15

తెలంగాణలో రెండవ విడత గొర్రెల పంపిణీని నిన్న మంత్రి కేటీఆర్ ఘనంగా ప్రారంభించారు. కానీ ఈ పథకం అమలు తీరుపై గొర్రెల, మేకల పెంపకం దారుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. మొదటి విడతలో అనుకున్న లక్ష్యాన్ని ఈ పథకం చేరలేదని గొర్రెల పంపిణీ తరువాత ఆ గొర్రెల పెంపకానికి కావాల్సిన మేత, ఆరోగ్యం విషయాలను సర్కార్‌ పట్టించుకోవడం లేదని వారు విమర్షిస్తున్నారు. మొదటి విడతలో జరిగిన లోపాలను వచ్చిన...

Monday, July 2, 2018 - 06:57

తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు మరోసారి ఆందోళన బాటపట్టారు. కో-ఆపరేటివ్‌ సొసైటీకి ఆర్టీసీ యాజమాన్యం చెల్లించాల్సిన డబ్బును వెంటనే చెల్లించాలని.. ఆర్టీసీలో ఉన్న స్కీమ్‌లను అమలు చేయాలని.. మొన్న సమ్మె చేపట్టకుండా ఉండటం కోసం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. అలాగే సకల జనుల సమ్మెనాటి వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నారు. వారి డిమాండ్‌లను...

Friday, June 29, 2018 - 08:39

మైనార్టీల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు నడిపిస్తోంది.. ఇది మన తెలంగాణ ముఖ్యమత్రి కేసీఆర్‌ పదేపదే చెప్పేమాట. కానీ మైనార్టీ సంక్షేమం విషంయంలో తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆవాజ్‌ విమర్శిస్తోంది. మైనార్టీలకు రుణాలిస్తామని చెప్పి... దరఖాస్తు పెట్టుకున్నాక ఇంతవరకూ చాలా మందికి రుణాలివ్వలేదని, ఇప్పుడు మళ్ళీ దరఖాస్తు...

Thursday, June 28, 2018 - 09:36

తిరుపతిలో టీటీడీ పాలకమండలి తీసుకుంటన్న నిర్ణయాలపై అక్కడి ఉద్యోగ, కార్మిక సంఘాలనుంచి నిరసన వ్యక్తం అవుతోంది. సలహా మండళ్ళకు అధికారాలివ్వడం, ప్రైవేైటు ఆలయాలకు టీటీడీ నిధులను కేటాయించడం, కళ్యాణమండపాల నిషయంలో అనుసరిస్తున్న వైఖరి తదితర నిర్ణయాలపై వారు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. టీటీడీకి భక్తుల ద్వారా వచ్చే ఆదాయాన్ని సరైన మార్గంలో ఖర్చు పెట్టాలని వారు డిమాండ్‌...

Monday, June 25, 2018 - 07:22

ఆంధ్రప్రదేశ్‌లో విద్యా సంవత్సరం ప్రారంభమై నడుస్తున్న ప్రభుత్వ విధానాల ఫలితంగా సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయని విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జూన్‌ నెల ముగుస్తున్నా ఇప్పటికీ ప్రభుత్వ పాఠశాలల్లో నలభై శాతం పాఠ్య పుస్తకాలు మాత్రమే అందాయని, ప్రభుత్వ పాఠశాలలో ప్రతి ముప్పై మంది విద్యార్థులకు ఒక టీచర్‌ అనే నిబంధన అమలు చేయడంలేదని, మౌళిక వసతులు కూడా కల్పించడం లేదని,...

Friday, June 22, 2018 - 09:34

తెలంగాణలో రేషన్ డీలర్లు ఆందోళన బాట పట్టారు. గౌరవ వేతనం ఇవ్వాలని.. తమను ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలని.. ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ.. వారు ఆందోళన బాట పట్టారు. అవసరమైతే తమ సమస్యల పరిష్కారం కోసం జూలై 1 నుంచి సమ్మె చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ సమ్మెకు గల కారణాలు.. వారి డిమాండ్లపై టెన్ టివి జనపథంలో వ్యవసాయ కార్మిక సంఘం తెలంగాణ...

Monday, June 18, 2018 - 07:32

తెలంగాణలో యువజనుల సమస్యల పరిష్కారం కోరుతూ... అఖిలభారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (DYFI) ఆధ్వర్యంలో స్తూర్పి యాత్ర పేరుతో మోటర్‌ సైకిల్‌ యాత్రను నిర్వహించారు. ఈ యాత్రలో అనేక మంది యువతను కలిసి వారితో మాట్లాడి వారు సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. మరి తెలంగాణలో యువత కోరుకుంటుందేంటి ? తెలంగాణ ప్రభుత్వ విధానాల పట్ల వారి వైఖరి ఎలా ఉంది ? ఈ యాత్రలో పాల్గొన్న DYFI తెలంగాణ రాష్ట్ర...

Friday, June 15, 2018 - 10:53

కేంద్రం ప్రభుత్వం ఆశ పథకాన్ని మూసివేయ్యాలని చూస్తుందా ? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ సామాజిక బాధ్యత నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారా? ఇదే అనుమానాన్ని ఆశ వర్కర్స్‌ వ్యక్తం చేస్తున్నారు. 10సంవత్సరాలు పనిచేసిన ఆశ వర్కర్లు తమ విధులోనుంచి తప్పుకుంటే 20వేలు ఇస్తామని కేంద్రం నిర్ణయం తీసుకోవటం, దానినే ఇక్కడి తెలంగాణ ప్రభుత్వం ఆచరణలో పెట్టే పని చేయ్యటం వారిలో ఈ అనుమానానికి...

Thursday, June 14, 2018 - 08:17

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ నగరంలో పేదలు ఇండ్లు, ఇళ్ల స్థలాలకోసం ఆందోళన బాటపట్టారు. ఎన్నికల ముందు అర్హులైన ప్రతిఒక్కరికీ ఇళ్లు ఇస్తామని అందరి సొంతింటి కళ నిజం చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన బీజేపీ, టీడీపీ నాయకులు ఇప్పుడు తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత హామీ నిలబెట్టుకోకపోవడంపై అక్కడి ప్రజలు చాలా ఆగ్రహంగా ఉన్నారు. తాము అద్దెలు భరించలేక పోతున్నామని ఎన్నికల మ్యానిఫెట్సొలో...

Wednesday, June 13, 2018 - 08:37

తెలంగాణలో గ్రామ పంచాయితీ ఉద్యోగులు కార్మికులు ఆందోళన బాటపట్టారు. కాంట్రక్టు ఎంప్లాయీస్‌ అందరిని పర్మినెంట్‌ చేయాలని, మున్సిపల్‌ ఉద్యోగుల మాదిరిగా జీతాలు పెంచాలని, జీతాలను ప్రభుత్వమే చెల్లించాలనే డిమాండ్‌లతో వారు పోరుకు సిద్దమైయ్యారు. తమ సమస్యలను పరిష్కరించని పక్షంలో సమ్మెకైన సిద్దమని వారు హెచ్చరిస్తున్నారు. ఇదే అంశంపై గ్రామ పంచాయితీ ఉద్యోగ కార్మిక సంఘాల నాయకులు పాలడుగు...

Tuesday, June 12, 2018 - 07:40

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎంతో పేరు ప్రాఖ్యాతాలు ఉన్నా ప్రభుత్వ రంగ సంస్థ, అత్యంత క్వాలీటీతో స్టీల్ అందించే పరిశ్రమ. కానీ దీనికి సొంత గనులు లేవు. దీని వల్ల ఎంతో భారం ఈ ప్రభుత్వరంగ సంస్థపైన పడుతోంది. దీనికి సొంత గనులు కేటాయించాలని వామపక్ష కార్మిక సంఘాలు ఉద్యమాలు చేస్తున్న...పాలకుల్లో ఆశించే స్పందన రావడం లేదు. ఇదే అంశంపై సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శవర్గసభ్యులు సీహెచ్ నర్సింగ్...

Monday, June 11, 2018 - 07:00

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రకటనపై ప్రభుత్వం ఎట్టకేలకు కొంతమేర స్పందించింది. 16 శాతం ఐఆర్‌ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. కానీ మంత్రులు చేసిన ప్రకటనపై ఆర్టీసీ కార్మికుల్లో భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తాము న్యాయబద్ధమైన కోరికలు అడిగిన ప్రతిసారి.. ప్రభుత్వం ఆర్టీసీ నష్టాల గురించి చెప్పటం ఏంటి? అని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. గత సమ్మెనాడు ఇచ్చిన హామీలనే...

Friday, June 8, 2018 - 07:12

ఆంధ్రప్రదేశ్‌లో సీపీఎస్‌ రద్దు చేయాలని, అలాగే కాంట్రక్టు ఔట్‌ సోర్సింగ్‌ విధానం పర్మినెంట్‌గా తీసివేయాలని డిమాండ్‌ చేస్తూ... ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘలు ఫ్యాప్టో ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రల్లో ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ సమస్యల పట్ల సానుకూలంగా స్పందించాలని, లేకుంటే భవిష్యత్‌లో తీవ్ర ఆందోళనలు ఎదురుకోక తప్పదని వారు హెచ్చరిస్తున్నారు. ఈ ఆందోళలనకు...

Tuesday, June 5, 2018 - 07:03

నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం... మనకు శ్వాస నందింస్తున్న పర్యావరణం నేడు ప్రమాద కోరల్లో చిక్కుకుంది. మన స్వయం కృత అపరాధాలు పాలకుల విధానాలు నయాఅభివృద్ధి నమూనా పర్యావరణాన్ని ప్రమాదంలోకి నెట్టివేస్తున్నాయి. ప్రపంచంలో పర్యావరణ కాలుష్య కోర్రల్లో చిక్కుకున్న నగరాల్లో మన హైదరాబాద్‌ కూడా ఒకటి పర్యావరణ పరిరక్షణకోసం ఎన్ని పాలసీలు తీసుకున్న ఎన్ని ప్రతిజ్ఞలు తీసుకున్న అవి ఆచరణలో మాత్రం...

Monday, June 4, 2018 - 11:43

ఉపాధి హామీ పథకం.. ఎంతో మందికి ఉపాధి కల్పించింది .కార్మికులతో పాటు.. రైతులకూ ఈ పథకం జీవనాధారం. కానీ.. పాలకుల నిర్లక్ష్యం వల్ల ఈ పథకం నీరుగారిపోతోందని, ఈ పథకం యొక్క నిధులు దారి మల్లుతున్నాయని, ప్రజా సంఘాలు  ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఈ పథకం నిధులను గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణానికి దారి మళ్ళిస్తూ.. తీసుకొచ్చిన జీవోపై ప్రజా సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి....

Pages

Don't Miss