జనపథం

Wednesday, October 7, 2015 - 07:04

ఒకనాడు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్ట్ గా గుర్తించాలంటూ డిమాండ్ చేసిన టీఆర్ఎస్ ఇప్పుడు అసలు ఆ ప్రాజెక్ట్ డిజైనే మార్చేస్తోంది. పాత డిజైన్ హైదరాబాద్ కు మంచినీటి సరఫరాను వాగ్ధానం చేస్తే, కొత్త డిజైన్ ఆ అంశాన్నే ప్రస్తావించడం లేదు. పాత డిజైన్ ప్రకారం పారిశ్రామిక అవసరాలు కూడా తీరుతాయి. కొత్త డిజైన్ రంగారెడ్డి జిల్లాలోనూ ఆందోళనలకు కారణమవుతోంది....

Tuesday, October 6, 2015 - 06:39

తెలంగాణలో గిరిజనులు పోరుబాట పట్టారు. నేడు గిరిజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో చలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహించబోతున్నారు. వీరి ఆందోళనకు కారణం ఏమిటి ? తెలంగాణలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలేమిటి ? విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాలలో గిరిజనుల సమగ్రాభివృద్ధి జరగాలంటే ఏం చేయాలి ? ఈ అంశంపై టెన్ టివి జనపథంలో గిరిజన సంఘం నేత శ్రీరాంనాయక్‌ విశ్లేషించారు. 

Tuesday, October 6, 2015 - 06:35

ఓ వైపు అడవులు మాయమవుతున్నాయి. ఆధునికాభివృద్ధి అడవి బిడ్డలుగా పేరొందిన గిరజనులను తల్లి ఒడి నుంచే తరిమేస్తోంది. అటు అడవిలో బతికే అవకాశం లేక, ఇటు మైదాన ప్రాంతాల్లో ఉపాధి పొందలేక సతమతమవుతున్న గిరిజనులెందరో. ఇంతకాలమూ అడవులను సంరక్షిస్తూ వచ్చినవారే గిరిజనం. వీరి కష్టాలు వర్ణణాతీతం. గిరిజనుల సమస్యలు పరిష్కరిస్తామంటూ ఎన్నికల ముందు ప్రతి రాజకీయ పార్టీ వాగ్ధానం చేస్తూ వుంటుంది. కానీ...

Monday, October 5, 2015 - 07:08

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, ప్రభుత్వ సొసైటీలు, స్థానిక సంస్థలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, యూనివర్సిటీలలో దాదాపు రెండు లక్షల మంది కాంట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్, టైం స్కేల్, పార్ట్ టైం, డైలీవేజ్, గెస్ట్ ఇలా వివిధ పేర్లతో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వీరులో చాలామంది పది పదిహేనేళ్లుగా పనిచేస్తున్నారు. 20...

Monday, October 5, 2015 - 07:07

హైదరాబాద్ : తెలంగాణలోని కాంట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్, టైం స్కేల్, పార్ట్ టైం, డైలీవేజ్, గెస్ట్ ఉద్యోగులు పోరుబాట పట్టారు. ఎల్లుండి ఏడో తేదీన చలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నారు. దాదాపు రెండు లక్షల మంది ఉద్యోగుల ఆందోళనకు కారణం ఏమిటి? వీరు కోరుతున్నదేమిటి? ఇదే అంశంపై ఇవాళ్టి జనపథంలో చర్చను చేపట్టింది. ఈ చర్చా కార్యక్రమంలో తెలంగాణ స్టేట్...

Friday, October 2, 2015 - 08:39

ఏపీలో పెట్రోల్‌ బంకుల బంద్‌ను యాజమాన్యాలు ఉపసంహరించుకున్నాయి. డీజిల్‌ పన్ను తగ్గింపుపై ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. ఆర్థిక మంత్రి యనమల వచ్చాక నిర్ణయం తీసుకుంటామని రవాణా మంత్రి శిద్దారాఘవరావు హామీ ఇవ్వడంతో బంద్‌ను విరమించారు.
బ్లాక్‌లో యదేచ్ఛగా అమ్మకాలు
ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్‌బంకులు, ట్యాంకర్లు, లారీల యాజమాన్యాల సమ్మెతో వాహనాలు ఒక్కొక్కటే...

Friday, October 2, 2015 - 08:33

పెట్రోల్‌ బంక్‌ల యజమానుల సమస్యలను పరిష్కరించాలని పెట్రోల్‌ బంక్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ నేత చుంచు నరసింహారావుగారు డిమాండ్ చేశారు. ఇందే అంశంపై నిర్వహించన జనపథం చర్చా కర్యాక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. పెంట్రోల్‌ బంక్‌ల నిర్వహణను లాభసాటి వ్యాపారంగా చాలామంది భావిస్తుంటారు. అయితే, బయటకు కనిపించేంత గొప్పగా తమ వ్యాపారం ఉండదనీ ఇందులోనూ చాలా సాధకబాధకాలున్నాయని పెట్రోల్‌ బంక్‌ల...

Thursday, October 1, 2015 - 07:10

గత కొద్ది రోజులుగా తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు రాష్ట్రం ఎటు వైపు పోతోందన్న ఆవేదనను కలిగిస్తున్నాయి. శ్రుతి, సాగర్ ఎన్ కౌంటర్, దానికి నిరసనగా 371 ప్రజా సంఘాలు చేపట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమం పట్ల పోలీసులు అనుసరించిన తీరు తీవ్ర వివాదస్పదమవుతోంది. టెన్ టివి జనపథంలో టీఆర్ఎస్ తో పాటు తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన న్యూడెమోక్రసీ నేత గోవర్ధన్ పాల్గొని విశ్లేషించారు. 

Thursday, October 1, 2015 - 06:46

తెలంగాణ ప్రజాస్వామిక పద్దతుల్లోనే పాలన సాగిస్తోందా? టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజాస్వామిక విలువల పట్ల , ప్రజాస్వామిక హక్కుల పట్ల నిబద్ధత వున్నదా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఈ ప్రశ్నే ఉదయిస్తోంది. 2009లో కేసీఆర్ నిరాహార దీక్షకు దిగడం తెలంగాణ ఉద్యమంలో కీలక మలుపుగా చెబుతుంటారు. కానీ, ఆనాటి రోశయ్య ప్రభుత్వం కేసీఆర్ దీక్ష ప్రారంభించకముందే అరెస్టు చేసి, టీఆర్ ఎస్ నామమాత్రంగా...

Wednesday, September 30, 2015 - 07:15

ఆరోగ్యమే మహాభాగ్యం. అయితే ఇవాళ 30 ఏళ్లయినా నిండకముందే భయంకర వ్యాధులు మనిషిని కుళ్లబొడుస్తున్నాయి. మూడేళ్లయినా నిండని పసిపిల్లలను డయేరియా లాంటివి పొట్టనబెట్టుకుంటుంటే, 30 ఏళ్లయినా రాకముందే బీపీ, షుగర్‌ భయపెడుతున్నాయి. సంపాదనలో అత్యధికభాగం వైద్య ఖర్చులకీ, మందులకీ ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి దాపురించింది. ఒక వైపు వైద్య రంగం విస్తరిస్తోంది. అత్యాధునిక వైద్య పరికరాలు...

Wednesday, September 30, 2015 - 07:12

ప్రజారోగ్యం ఇప్పుడో ప్రధాన టాపిక్‌ గా మారుతోంది. ప్రజారోగ్య పరిరక్షణ కోసం కొన్ని సంస్థలు నడుంబిగిస్తున్నాయి. అక్టోబర్‌లో ఊరూరా సర్వేలు చేసి, నివేదికలు రూపొందించేందుకు స్వస్థా అభియాన్‌ సంస్థ సమాయత్తమవుతోంది. మన తెలుగు రాష్ట్రాల్లో వైద్య ఆరోగ్యరంగం పరిస్థితి ఏమిటి? వైద్య ఆరోగ్య సేవలను అందించడంలో మనం ఎదుర్కొంటున్న సవాళ్లేమిటి? ప్రజలందరికీ ఆరోగ్యం ఒక్క హక్కుగా అందాలంటే...

Tuesday, September 29, 2015 - 08:43

లారీ యజమానులు సమ్మె బాట పట్టారు. అక్టోబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా 72 లక్షల లారీలు, ట్రక్కులు ఎక్కడివక్కడే నిలిచిపోనున్నాయి. దీని ప్రభావం పెట్రోల్ బంక్ ల మీద కూడా పడే అవకాశం వుంది.
సరుకులు, నిత్యావసరాల సరఫరాలో లారీ ట్రాన్స్ పోర్ట్ రంగం కీలకం 
మన దేశంలో సరుకులు, నిత్యావసరాల సరఫరాలో కీలకపాత్ర పోషిస్తున్నది లారీ ట్రాన్స్ పోర్ట్ రంగం. మన దేశంలో సరుకుల...

Tuesday, September 29, 2015 - 07:48

లారీల యజమానుల సమస్యలను పరిష్కరించాలని లారీ ట్రాన్స్ పోర్ట్ యజమానుల సంఘం కార్యదర్శి వైవి.ఈశ్వరరావు డిమాండ్ చేశారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. అక్టోబర్ 1 నుంచి లారీల యజమానులకు సమ్మెకు దిగబోతున్నారు. సరుకు రవాణా రంగంలో కీలకపాత్ర పోషిస్తున్న లారీల ఓనర్స్ సమ్మెకు కారణం ఏమిటి? లారీ యజమానులు ఎదుర్కొంటున్న సమస్య లేమిటి? వీరు ప్రభుత్వం...

Friday, September 25, 2015 - 06:44

హైదరాబాద్ : 108 ఇప్పుడు హాట్‌ టాపిక్‌ గా మారింది. 108 నిర్వహణ లోపాల మీద ప్రతిరోజూ వార్తలు వస్తూనే వున్నాయి. వీటి నిర్వహణ బాధ్యతలు చూస్తున్న జీవికె వ్యవహారశైలి మీద కూడా విమర్శలొస్తున్నాయి. మరోవైపు పదేళ్లుగా పనిచేస్తున్న తమ సమస్యలు పరిష్కరించాలంటూ సిబ్బంది ఆక్రందిస్తున్నారు. ఇంతకీ 108 ఎదుర్కొంటున్న సమస్యలేమిటి? 108 సిబ్బంది కోరికలేమిటి? పూర్తిగా ప్రభుత్వ...

Friday, September 25, 2015 - 06:42

హైదరాబాద్ : 108 ... అదొక ఆపద్భందువు. ఆపదలో చిక్కుకుని, అత్యవసర వైద్య సేవల కోసం ఎదురుచూస్తున్నవారికి 108 ఆపద్బంధువుగా మారిందనండంలో ఏమాత్రం సందేహం లేదు. 108 సర్వీసుల సిబ్బంది ప్రదర్శించిన వృత్తి నిబద్దత, ఎండనక, వాననక, చలి అనక రేయింబవళ్లు ఎంతో సహనంతో అందించిన సేవలు...

Thursday, September 24, 2015 - 06:47

హైదరాబాద్ : తాము నిర్వహిస్తున్న సాంఘిక సంక్షేమ హాస్టల్స్‌ను చాలా చక్కగా నిర్వహిస్తున్నామని ఏ ఒక్క ప్రభుత్వమూ చెప్పుకోలేని దౌర్భాగ్యం మనదేశంలో నెలకొంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు వివిధ హాస్టల్స్‌ను సందర్శించినప్పుడు అక్కడి పరిస్థితులను చూసి వారే విస్మయం వ్యక్తం చేసిన సందర్భాలు అనేకం. ఆహారంలో నాణ్యత లేక, ఎముకలు కొరికే చలిలో సైతం...

Thursday, September 24, 2015 - 06:46

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో హాస్టల్‌ విద్యార్థులు పోరుబాట పట్టారు. తమ సమస్యలను ఏకరువు పెడుతూ ప్రతిరోజూ విద్యార్థులు ఎక్కడో ఒకచోట ఆందోళన చేస్తూనే వున్నారు. ఒక్కొక్కసారి కలెక్టర్ల దగ్గర ధర్నాలు ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. లాఠీచార్జీలూ జరుగుతున్నాయి. కొన్ని చోట్ల అసలు ధర్నాలకు అనుమతులే ఇవ్వని పరిస్థితి. హాస్టల్‌ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలేమిటి?...

Wednesday, September 23, 2015 - 06:45

హైదరాబాద్ : సెప్టెంబర్‌ 2న ప్రారంభమైన ఆశా వర్కర్ల సమ్మె రోజురోజుకీ ఉధృతరూపం దాలుస్తోంది. చెవిలో పువ్వులు పెట్టుకోవడం లాంటి రూపాల్లో ప్రారంభమైన ఆశాల నిరసన కార్యక్రమాల ఎమ్మెల్యేల, మంత్రుల ఇళ్ల ముట్టడి లాంటి రూపంలోకి మారుతున్నాయి. గ్రామీణ ఆరోగ్య సేవల్లో అత్యంత కీలకపాత్ర పోషించే ఆశా వర్కర్ల సమ్మె విషయంలో ప్రభుత్వం ఎందుకంత ఉదాసీనంగా వ్యవహరిస్తోంది? ఈ అంశంపై...

Wednesday, September 23, 2015 - 06:43

హైదరాబాద్ : గ్రామీణ భారతంలో వైద్య ఆరోగ్య సేవల్లో ఆశా వర్కర్లు పోషిస్తున్న పాత్ర ఎందరెందరో ప్రశంసలందుకుంది. వీరు ఇళ్లిళ్లూ తిరిగి అందిస్తున్న సేవల కారణంగా మాతా శిశు మరణాల సంఖ్యను తగ్గించగలిగినట్టు కేంద్ర ప్రభుత్వమే ఘనంగా ప్రకటించిన సందర్భాలనేకం. ఇంజక్షన్‌ అంటేనే భయపడే రోజుల్లో , దేవుడిచ్చే బిడ్డలను కనకుండా ఆపకూడదనే సెంటిమెంట్స్‌ ప్రబలంగా వున్న రోజుల్లో...

Tuesday, September 22, 2015 - 06:43

హైదరాబాద్: తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదు. ప్రతి రోజూ ప్రతి జిల్లాలలో ఏదో ఒక గ్రామంలో రైతులు చనిపోతూనే వున్నారు. ఆయా కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయి గుండెలవిసేలా రోదిస్తున్నాయి. అసలే అప్పుల్లో వున్న కుటుంబాలు కుటుంబ పెద్దను కూడా కోల్పోవడంతో మరిన్ని కష్టాల్లో కూరుకుపోతున్నాయి. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు ఇస్తున్న ఎక్స్ గ్రేషియాను ఆరు లక్షల...

Monday, September 21, 2015 - 06:51

హైదరాబాద్ : తెలంగాణలో రైతన్నల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. కళ్ల ముందే పంటలు ఎండిపోతుంటే తట్టుకోలేక రైతుల గుండెలాగిపోతున్నాయి. ఈసారైనా కాలం కలిసి రాకపోతుందా అని ఎదురు చూసిన రైతుల ఆశలన్నీఅడియాశలయ్యాయి. చేసిన అప్పులు తీర్చే దారి కనిపించక ఎండిపోయిన చేనులోనే బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఆదివారం ఒక్కరోజే రాష్ట్రంలో 11 మంది రైతన్నలు ఆత్మహత్య...

Friday, September 18, 2015 - 08:40

ప్రభుత్వం.. జానపద కళాకారులను ఆదుకోవాలని జానపద వృత్తి కళాకారుల సంఘం నేత యాదగిరి డిమాండ్ చేశారు. 'తిరుమల బ్రహ్మోత్సవాలు.. జానపద కళాకారులు' అనే అంశంపై నిర్వహించిన జనపథం చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. ఓ వైపు తిరుమలలో శ్రీవారికి వైభవంగా బ్రహ్మోత్సవాలు సాగుతున్నాయి. మరోవైపు ఆ బ్రహ్మోత్సవాలలో తమ కళను ప్రదర్శించే అవకాశం కల్పించండంటూ కొన్ని వేల మంది జానపద కళాకారులు తమ...

Friday, September 18, 2015 - 08:34

తిరుమలకు వచ్చే విభిన్న రంగాల సెలబ్రిటీలకు టీటీడీ రాచమర్యాదలు చేస్తుంది. సినీ స్టార్ లు వస్తే టీటీడీ అధికారులు వారిని మహామురిపెంగా చూస్తారు. కానీ, స్వామివారి కీర్తనలను నలుదశలా వ్యాపింపచేసే జానపద కళాకారులను మాత్రం పెద్దగా ఆదరించదు. టీటీడీ లాంటి ధార్మిక సంస్థలే బ్రహ్మోత్సవాల వేళ జానపద కళాకారుల గుండు చప్పుడు వినకపోతే, ఇక అంతరించిపోతున్న ఈ కళలను కాపాడేదెవరు?
జానపద...

Wednesday, September 16, 2015 - 07:13

తెలంగాణలో ఇప్పుడు ఏ ఇంటికి వెళ్లినా గ్రూప్స్ గురించే ముచ్చటించుకుంటున్నారు. నాలుగు పదులు నిండిన వారు సైతం గ్రూప్స్ రాయాలన్న పట్టుదలతో వున్నారు. కానీ ఇలాంటి వారికి కొత్త సిలబస్ కి అనుగుణంగా ప్రామాణిక పుస్తకాలు దొరకడం లేదు. ప్రభుత్వం కోచింగ్ సెంటర్లు నిర్వహించడం లేదు. దీంతో గ్రూప్స్ కి ప్రిపేరవుతున్నవారికి అష్టకష్టాలు తప్పడం లేదు. ఈ అంశంపై జనపథంలో ఎస్ఎఫ్ఐ యూనివర్సిటీల కమిటీ...

Wednesday, September 16, 2015 - 07:11

గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్ లకు కొత్త సిలబస్ ప్రకటించిన టీఎస్ పీ ఎస్సీ ప్రామాణిక పుస్తకాల సంగతి మాట్లాడడం లేదు. మెటీరియల్ సమకూర్చిపెట్టడం తమ బాధ్యత కాదంటూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ చెబుతున్నారు. మరోవైపు ప్రభుత్వం ఎక్కడా కోచింగ్ సెంటర్లు నిర్వహించడం లేదు. తెలంగాణలో గ్రూప్స్ ఫీవర్ పెరుగుతోంది. లక్షల సంఖ్యలో నిరుద్యోగులు, విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు....

Tuesday, September 15, 2015 - 09:30

దేశంలో సబ్సిడీలను రక్షించుకోవాలని రైతు సంఘం నేత సారంపల్లి మల్లారెడ్డి పిలుపినిచ్చారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. దేశంలోని పేదల అభివృద్ధికి సబ్సిడీలు ఉండాలని.. వాటికి కోసం పోరాటాల చేయాలని పిలుపునిచ్చారు. కొంత మంది ఉపయోగార్థం... పెద్ద మొత్తంగా ఉన్న ప్రజలకు నష్టం కలిగించే విధానాలకు స్వస్తి పలకాలని హితవు పలికారు. కేంద్ర ప్రభుత్వం...

Tuesday, September 15, 2015 - 09:16

కేంద్ర ప్రభుత్వ విధానాలు అన్నదాతకు శాపంగా మారుతున్నాయి. లెవీ సేకరణ విధానం ఎత్తివేసి, సబ్సిడీలకు మంగళం పాడుతుండడంతో ఇటు రైతులు, అటు రెక్కాడితేనే డొక్కాడని నిరుపేదలు అష్టకష్టాలు అనుభవించాల్సిన దుస్థితి దాపురిస్తోంది.
అన్నదాతకు అన్నీ కష్టాలే
అన్నదాతకు అన్నీ కష్టాలే. ఇప్పటికే కరువు కోరల్లో విలవిలలాడుతున్న అన్నదాతకు పులిమీద పుట్రలా మరో కష్టం...

Pages

Don't Miss