జనపథం

Thursday, May 18, 2017 - 09:15

హైదరాబాద్ : కార్మికుల నిధులతో తార్నాక ఆసుపత్రి నిర్మించిందని. రూ.30 ఉన్న రోజుల్లో రూ.2 ఆసుపత్రి కోసం సవత్సరాలు తరాబడి ఇచ్చారని తెలంగాణ ఆర్టీసీ స్టాప్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు పీ.ఎస్ రావు అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

Wednesday, May 17, 2017 - 07:29

విత్తనాల నిర్వహన మొత్తం బహుళజాతి కంపెనీల చేతికి వెళ్తున్నాయి. నకిలీ విత్తనాలు అమ్మితే వారిపై కేసుపెట్టకుండా తెలుగు దేశం పార్టీ అడ్డుకుంటుందని జన పథంలో పాల్గొన్న ఏపీ రైతు సంఘం అధ్యక్షుడు కేశవరావు అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

Tuesday, May 16, 2017 - 08:38

ఉద్యోగ భద్రత లేదని ఏపీ కాంట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు బాలకాశి అన్నారు. టెన్ టివి జనపథంలో పాల్గొని మాట్లాడారు. ఆ కారణంగా 120 కాంట్రాక్ట్ , తొలిగించారని ఆయన తెలిపారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

 

 

Monday, May 15, 2017 - 08:54

ప్రజల అభిప్రాయలను ప్రభుత్వాలు పట్టించుకోకుంటే ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉందని న్యూడెమోక్రసీ నేత రంగారావు అన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ధర్నా చౌక్ ద్వారా తెలియజేయాలనికుంటే ప్రభుత్వం మాత్రం ధర్నా చౌక్ లెకుండా చేస్తుందని టెని టివి జనపథంలో పాల్గొన్న ఆయన తెలిపారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

 

Friday, May 12, 2017 - 06:55

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మిషన్ కాకతీయ మూడవ విడత మొదలవుతోంది. ఇప్పటికే రెండు విడతలుగా చెరువుల్లో పూడికతీత, మరమ్మత్తు లాంటి కార్యక్రమాలు చేపట్టారు. తెలంగాణలో 45వేల చెరువులుండగా, ఏడాదికి తొమ్మిదివేల చొప్పున అయిదేళ్లలో అన్ని చెరువుల పూడికతీత పూర్తి చేయాలన్నది తెలంగాణ ప్రభుత్వ సంకల్పం. అయితే, గత...

Thursday, May 11, 2017 - 06:41

హైదరాబాద్: తెలంగాణలో 4637 ప్రభుత్వ స్కూళ్ల మూసివేతకు రంగం సిద్ధమైనట్టు వస్తున్న వార్తలు వస్తుండడంతో విద్యార్థి సంఘాలు భగ్గుమంటున్నాయి. ఇలాంటి ఆలోచనలను విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. తెలంగాణలో 25,966 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. 4137 స్కూళ్లల్లో 20మంది కంటే తక్కువ విద్యార్థులున్నట్టు తెలుస్తోంది. వీటిలో ఆరువేలమందికి పైగా టీచర్లు...

Wednesday, May 10, 2017 - 06:46

హైదరాబాద్: తెలంగాణలో ప్రభుత్వ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు మరోసారి పోరుబాటపట్టేందుకు సమాయత్తమవుతున్నారు. 2016 ఫిబ్రవరిలో కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 16ను హై కోర్టు కొట్టివేసిన నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై దృష్టి సారిస్తున్నారు. 2016 అక్టోబర్ లో...

Tuesday, May 9, 2017 - 06:41

హైదరాబాద్: రాయలసీమ కరవు కష్టాలు చూస్తే గుండె తరక్కుపోతుంది. కరవు నివారణ చర్యలు ఉత్తుత్తి మాటలుగానే మిగిలిపోతున్నాయి. 233 మండలాలున్న రాయలసీమలో 184 మండలాల్లో కరవు వున్నట్టు రాష్ట్ర ప్రభుత్వమే ప్రకటించింది. అనంతపురంలో 345 గ్రామాల్లోనూ, కడపలో 416 గ్రామాల్లోనూ, కర్నూలులో 1200 గ్రామాల్లోనూ నీటి సమస్య తీవ్రంగా వుంది. అసలే కరవు కష్టాలకు తోడు పసుపు...

Monday, May 8, 2017 - 06:34

హైదరాబాద్: ఆశా వర్కర్ల పోరాటం ఫలించింది. ఆలస్యంగానైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్ల డిమాండ్లపై స్పందించింది. ఆశా వర్కర్ల జీతం నాలుగు వేల రూపాయల చొప్పున పెంచుతున్నట్టు ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించారు. దీంతో తెలంగాణలో ఆశా వర్కర్ల జీతం ఆరు రూపాయలకు చేరినట్టయ్యింది. ఆశా వర్కర్లు కనీస వేతనం అమలు చేయాలంటూ 2015 సెప్టెంబర్ లోనే సమ్మెకు...

Friday, May 5, 2017 - 08:40

ప్రయివేట్ డిగ్రీ కాలేజీ యాజమాన్యాలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని ప్రయివేట్ డిగ్రీ కాలేజీ యాజమాన్యాల అసోసియేషన్ నాయకులు రమణారెడ్డి డిమాండ్ చేశారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. 'తెలంగాణలో డిగ్రీ పరీక్షలకు బ్రేక్ పడింది. ఇప్పటికే తెలంగాణ యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీల పరిధిలోని డిగ్రీ పరీక్షలు వాయిదాపడ్డాయి. ఈ నెల 9వ తేదీ నుంచి...

Friday, May 5, 2017 - 08:34

తెలంగాణ యూనివర్సిటీలో డిగ్రీ సెమిస్టర్ పరీక్షలకు బ్రేక్ పడింది. ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చడం లేదంటూ ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు పరీక్షల్ని బహిష్కరించాయి. అధికారులు స్పందించకపోతే ఇకపై ఆన్ లైన్ లో అడ్మిషన్లను సైతం నిర్వహించబోమని తేల్చిచెప్పాయి. 
డిగ్రీ సెమిస్టర్ పరీక్ష వాయిదా
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రెండు లక్షల యాభై వేల మంది...

Thursday, May 4, 2017 - 09:56

మిర్చి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని ఆంధ్రప్రదేశ్‌ కౌలు రైతు సంఘం నాయకులు అజయ్‌ కుమార్‌ డిమాండ్ చేశారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. 'మిర్చి రైతులకు కేంద్ర ప్రభుత్వం కొంత ఊరటనిచ్చింది. క్వింటాకు 5వేల రూపాయల మద్దతు ధర ప్రకటించింది. అదనపు ఖర్చుల కింద మరో 1200 రూపాయలు ప్రకటించింది. ప్రభుత్వ ఏజెన్సీలకు నష్టం వస్తే కేంద్ర రాష్ట్ర...

Wednesday, May 3, 2017 - 07:55

హైదరాబాద్ : 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం కొలిపాక సరిత, గట్ల లావణ్య, పెండ్రూ కొండల్ రెడ్డి, కట్కూర్‌ గోపాల్‌ రెడ్డి, పెండ్రూ హన్మాన్‌ రెడ్డి అన్నారు.  సరిత మాట్లాడుతూ కాళేశ్వరం కింద తమ భూమి కోల్పోతున్నామని తమకు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని అన్నారు. గ్రామంలో 144 సెక్షన్ విధించి భయందోళనతో ఉన్నామని తెలిపారు. లావణ్య మాట్లాడుతూ ఊరు...

Tuesday, May 2, 2017 - 13:23

తెలంగాణలో 4,200కిలోమీటర్లు తిరిగి విభిన్న వర్గాల జీవన శైలిని పరశీలించి వచ్చారు. సీపీఎం నిర్వహించిన మహాజనపాదయాత్రలో కవరేజీకి వెళ్లి మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు ఉన్నారు రిపోర్టర్ భాస్కర్, వీడియో జర్నలిస్టు మురళీఅరుదైన రికార్డు సృష్టించారు. భాస్కర్ మాట్లాడుతూ ఈ రాష్ట్రం మొత్తం తిరిగి ప్రయాణం చాలా గొప్ప అనుభుతిని ఇచ్చిందని, కొత్త రాష్ట్రంలో ఎక్కడ మార్పు రాలేదని అన్నారు....

Monday, May 1, 2017 - 08:41

మేడే స్ఫూర్తిగా కార్మికుల హక్కుల కోసం ఉద్యమించాలని ఐఎఫ్ టియు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి ఎం.శ్రీనివాస్ పిలుపునిచ్చారు. మేడే సందర్భంగా నిర్వహించిన జనపథం చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయని మండిపడ్డారు. కార్మికులు ఐక్యంగా పోరాడి హక్కులను కాపాడుకోవాలన్నారు. 'ఇవాళ మే డే. తమ హక్కుల సాధన కోసం, ఇప్పటికే...

Monday, May 1, 2017 - 08:34

హైదరాబాద్ : ఇవాళ మే డే. తమ హక్కుల సాధన కోసం, సాధించుకున్నవాటిని నిలుపుకోవడం కోసం కార్మికవర్గం కదం తొక్కుతోంది. కార్మికవాడలు అరుణ పతాకాలతో రెపరెపలాడుతున్నాయి. ఎర్రఎర్రని జెండాలు చేబూనిన కార్మికులు   గత కాలపు పోరాటాలను స్మరించుకుంటూ, కార్మికవర్గ అమరవీరులకు జోహార్లప్పిస్తూ, తమను తాము పోరాటానికి సన్నద్దం చేసుకుంటున్నారు. 
130ఏళ్ల క్రితం నాటి...

Friday, April 28, 2017 - 07:51

రైతుల సమస్యలపై రైతు సంఘం అధ్యక్షులు సాగర్ జనపథం చర్చలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ రైతులందరు ఆవేదనతో ఉన్నారని, మూడు సంవత్సరాల కాలంలో వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న రైతులకు రూ. 6లక్షల నష్టపరిహారం ఇవ్వలేదని అన్నారు. రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయండంలో ప్రభుత్వం విఫలం అయిందని తెలిపారు. వచ్చే సంత్సరం రైతులకు ఎరాకు రూ.4వేల ఇస్తామని...

Thursday, April 27, 2017 - 06:47

అమరావతి: ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల ఉద్యమంలో మరో కీలక పరిణామం జరుగుతోంది. గవర్నమెంట్ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగ సంఘాల జెఏసి ఆవిర్భవించబోతోంది. ఈ నెల 30వ తేదీన విజయవాడలో ఆవిర్భావ సదస్సు నిర్వహిస్తున్నారు. రాఘవయ్యపార్కు దగ్గర వున్న యం.బి. విజ్ఞాన కేంద్రంలో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో, సంస్థల్లో...

Wednesday, April 26, 2017 - 06:41

హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ వందేళ్ల ఉత్సవాలు ఇవాళ్టి నుంచే మొదలవుతున్నాయి. యూనివర్సిటీ చాన్స్ లర్, గవర్నర్ నరసింహన్ అధ్యక్షతన జరుగుతున్న ఈ ఉత్సవాలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ముఖ్యమంత్రి కెసిఆర్ తో పాటు దాదాపు పదిహేనువేల మంది ప్రముఖులు ఉస్మానియా యూనివర్సిటీ ఉత్సవాల్లో పాల్గొంటారని అంచనా. భారతదేశానికే ఒక ప్రధానిని అందించిన ఘనత వున్న...

Tuesday, April 25, 2017 - 06:45

అమరావతి: తొలిసారిగా ఆన్ లైన్ లో నిర్వహిస్తున్న ఏపి ఎంసెట్ నిన్న మొదలైంది. దాదాపు 2 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, నిన్న దాదాపు 60వేల మంది పరీక్ష రాశారు. మిగిలిన అభ్యర్ధులు ఇవాళ, రేపు, ఎల్లుండి పరీక్ష రాయబోతున్నారు. ఏపి ఎంసెట్ పరీక్షకు హాజరవుతున్న విద్యార్థులు చివరి క్షణాల్లో మ్యాథ్స్ పేపర్ ను ఎలా ప్రిపేరవ్వాలి. ఇదే అంశంపై...

Monday, April 24, 2017 - 06:36

హైదరాబాద్: డాక్టర్లు జెనెరిక్ మందుల పేర్లే రాయాలంటూ కొంతకాలంగా పోరాడుతున్న వ్యక్తులు, సంస్థలు తొలి విజయం సాధించాయి. వీరు సాగిస్తున్న ఉద్యమానికి కేంద్ర ప్రభుత్వం, ఎంసిఐ స్పందించాయి. డాక్టర్లు పేషెంట్లకు కచ్చితంగా జెనెరిక్ మందులనే రాయాలని, అలారాయకపోతే కఠిన చర్యలు తప్పవంటూ భారతీయ వైద్య మండలి ఎంసిఐ హెచ్చరించింది. పేషెంట్లకు బ్రాండెడ్ మందులను...

Friday, April 21, 2017 - 08:10

అవగాహనతో ఎంసెట్ ఎగ్జామ్ రాసేందుకు వెళ్లాలని శారదా ఎడ్యుకేషనల్‌ ఇనిస్టిట్యూషన్స్‌ ఎండి వై.శారదాదేవి అన్నారు. విద్యార్థులు ఆన్ లైన్ పరీక్ష తొలిసారిగా రాస్తున్నారు కాబట్టి ముందుగా ఆన్ లైన్ మాక్ టెస్ట్ లు రాయలని సూచించారు. 'ఎంసెంట్ ఎగ్జామ్ కు ఎలా ప్రిపేర్ కావాలి' ? అనే అంశంపై నిర్వహించిన జనపథం చర్చా కార్యక్రమంలో ఆమె పాల్గొని, మాట్లాడారు. విద్యార్థులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు...

Thursday, April 20, 2017 - 07:46

పుడిమడకలో వివిధ కంపెనీల నుంచి విష వ్యర్థాలను సముద్రంలోకి మోసుకొచ్చే పైప్ లైన్ ను నిర్మించొద్దని ఆంధ్రప్రదేశ్ మత్స్యకారుల సంఘం నాయకులు అప్పలరాజు అన్నారు. ఇవాళ్టి జనపథంలో కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. మత్య్యకారులు చేస్తున్న ఆందోళన పై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని అన్నారు. పైప్ లైన్ నిర్మించి మత్స్యకారుల పొట్టకొట్టద్దన్నారు. పైపు లైన్ వేయడం వెంటనే ఆపివేయాలని డిమాండ్...

Wednesday, April 19, 2017 - 08:56

ఎంసెట్ కు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు శారద విద్యా సంస్థల జనరల్‌ మేనేజర్‌, ప్రముఖ మ్యాథ్స్‌ లెక్చరర్‌ జివిరావు లెక్చరర్‌ జివిరావు పలు సూచనలు, సలహీలు ఇచ్చారు. ఎంసెట్ కు ఎలా ప్రిపేర్ కావాలి అనే అంశంపై జనపథంలో నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ కు తేదీ సమీపిస్తోంది. తొలిసారి ఆన్ లైన్ లో ఏపి ఎంసెట్ నిర్వహిస్తున్నారు. ఇంజనీరింగ్ ప్రవేశ...

Tuesday, April 18, 2017 - 08:32

అంగన్ వాడీలకు కనీస వేతనాలు ఇవ్వాలని ఏపీ అంగన్ వాడీ వర్కర్స్ హెల్పర్స్ అసోసియేషన్ నాయకులు సుబ్బరావమ్మ డిమాండ్ చేశారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం కార్యక్రమంలో ఆమె పాల్గొని, మాట్లాడారు. అంగాన్ వాడీలు అనేక సమస్యలతో సతమవుతున్నారని... వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు. 'ఆంధ్రప్రదేశ్ అంగన్ వాడీ వర్కర్లు, హెల్పర్లు మరోసారి పోరుబాటపట్టారు. ఈ నెల 20న అంటే ఎల్లుండి అన్ని కలెక్టర్...

Monday, April 17, 2017 - 08:42

మిర్చి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతు సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చంద్రారెడ్డి బొంతల చంద్రారెడ్డి డిమాండ్ చేశారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. 'మిర్చి రైతులు తీవ్ర కష్టాల్లో వున్నారు. పండించిన పంటకు సరియైన ధర లభించక నష్టాల పాలవుతున్నారు. ధరలు పడిపోయిన నేపథ్యంలో మిర్చి రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో...

Friday, April 14, 2017 - 10:26

154 రోజుల సిపిఎం మహాజన పాదయాత్ర బృందానికి ఉప నేతగా వ్యవహరించిన జాన్ వెస్లీ, ఆయన సతీమణి భారతి టెన్ టివి జనపథంలో పాల్గొన్నారు. పాత మహబూబ్ నగర్ జిల్లా నేటి వనపర్తి జిల్లా అమరచింత లో జన్మించిన జాన్ వెస్లీ విద్యార్థి దశ నుంచే వామపక్ష రాజకీయాలవైపు ఆకర్షితులయ్యారు. తొలుత రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ లోనూ, ఆ తర్వాత పిడిఎస్ యులోనూ పనిచేసిన జాన్ వెస్లీ 1996 నుంచి సిపిఎంలో చేరారు. కుల...

Pages

Don't Miss