జనపథం

Tuesday, August 4, 2015 - 07:04

తెలంగాణలో మున్సిపల్ కార్మికులు నెల రోజులుగా సమ్మె చేస్తున్నారు. హైదరాబాద్ లో కార్మికుల జీతాలు పెంచుతున్నట్టు ప్రకటించి, సమ్మెను విరమింపచేసిన ప్రభుత్వం తెలంగాణలోని ఇతర ప్రాంతాల సమస్యను పరిష్కరించలేదు. పరిసరాలను పరిశుభ్రంగా వుంచడంలో కీలకపాత్ర పోషిస్తున్న మున్సిపల్ కార్మికులు పోరుడుతూనే వున్నారు. తమకు కనీస వేతనాలు అమలు చేయాలంటూ తెలంగాణలో సమ్మె మొదలుపెట్టి నెల రోజులైంది. వీరి...

Tuesday, August 4, 2015 - 07:01

నెల రోజులుగా సమ్మె చేస్తున్న తెలంగాణ మున్సిపల్‌ కార్మికులు చలో హైదరాబాద్‌ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. మున్సిపల్‌ కార్మికుల సమ్మెకు పరిష్కారం లభించకపోవడానికి కారణం ఏమిటి? అసలు మున్సిపల్‌ కార్మికులు కోరుతున్నదేమిటి? ప్రభుత్వం చెబుతున్న సమాధానం ఏమిటి? కార్మికులు సమ్మె విరమించాలంటే ప్రభుత్వం తక్షణం తీర్చాల్సిన కోరికలేమిటి? ఈ అంశంపై టెన్ టివి జనపథంలో తెలంగాణ మున్సిపల్‌...

Monday, August 3, 2015 - 07:04

యూనివర్సిటీలు గాడి తప్పుతున్నాయా? క్రమశిక్షణ లోపిస్తోందా? యూనివర్సిటీ విద్యార్థులు విషవలయంలో చిక్కుకుంటున్నారా? వివిధ యూనివర్సిటీలలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇలాంటి భయమే కలుగుతోంది. ఈ పరిస్థితికి కారణం ఏమిటి? అసలు యూనివర్సిటీలలో ఏం జరుగుతోంది? యూనివర్సిటీలలో క్రమశిక్షణ పాదుకొల్పాలంటే ఏం చేయాలి? ఈ అంశంపై టెన్ టివి జనపథంలో ఏపీ ఎస్‌ఎఫ్‌ఐ నేత లక్ష్మణ్‌ మాట్లాడారు.

Friday, July 31, 2015 - 06:44

హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్‌లో కల్లుగీత పరిరక్షణ నినాదం ఊపిరిపోసుకుంటోంది. ఈ వృత్తిని పరిరక్షించాలంటూ ఆగస్టు 1 నుంచి కల్లుగీత కార్మికులు ఆందోళన బాటపడుతున్నారు. ఇంతకీ కల్లుగీత వృత్తికి వచ్చిన ప్రమాదమేమిటి? మన ఆర్థిక వ్యవస్థలో ఈ వృత్తికి వున్న ప్రాధాన్యతేమిటి? కల్లుగీత వృత్తిని పరిరక్షించాలంటే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాల్సి వుంటుంది? ఇదే అంశంపై ఇవాళ్టి...

Friday, July 31, 2015 - 06:42

చెట్టు నుంచి తీసిన స్వచ్ఛమైన కల్లుని ఆరోగ్య ప్రదాయినిగా చెబుతుంటారు. విందులు, వినోదాలు, సంబరాలు, ఉత్సవాలలో కల్లును సేవించడం అనేకప్రాంతాలలో అనాదిగా వస్తున్న సంప్రదాయం. కల్లు లేనిదే ఆయా ఉత్సావాలకు పరిపూర్ణత సిద్ధంచదు.
స్వచ్ఛమైన కల్లు దొరకదు.....
తాటి చెట్లు, ఈత చెట్లు ఇవి లేనిదే స్వచ్ఛమైన కల్లు దొరకదు. వీటిని భూలోక కల్పవృక్షాలుగా అభివర్ణిస్తుంటారు...

Wednesday, July 29, 2015 - 07:23

ఆంధ్రప్రదేశ్ లో డ్వాక్రా గ్రూపులు ఆందోళనబాట పడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్త ధర్నాలకు సమాయత్తమవుతున్నారు. వీరి ఆందోళనకు కారణమేంటి ? వీరు ఎదుర్కొంటున్న సమస్యలేమిటి ? వీరికి ప్రభుత్వం చేసిన వాగ్ధానాలేమిటి ? డ్వాక్రా సంఘాలకు ఇసుక రీచ్ లు అప్పగిస్తామన్న ప్రభుత్వ నిర్ణయం క్షేత్ర స్థాయిలో ఎలా అమలవుతోంది ? ఈ అంశంపై టెన్ టివి జనపథంలో డ్వాక్రా సంఘాల నేత స్వరూప మాట్లాడారు. 

Wednesday, July 29, 2015 - 07:22

ఓ వైపు ఇష్టమొచ్చినట్టు ఇసుక తవ్వేస్తున్నారు. మరోవైపు ఇల్లు కట్టుకోవాలంటే ఇసుక దొరకక మధ్య తరగతి అవస్థపడుతోంది. ఇసుక రీచ్ ల నిర్వహణ అమ్మకాల బాధ్యతలు డ్వాక్రా సంఘాలకు అప్పగించాలన్న ప్రభుత్వ విధానాన్ని మాఫియా వెక్కిరిస్తోంది. ఇసుక బంగారమైంది. ఇసుక దిబ్బల చుట్టూ రాజకీయం నడుస్తోంది. ఇసుక వ్యాపారాన్ని మాఫియా శాసిస్తోంది. అది పడగవిప్పి నర్తిస్తోంది. రాజకీయాలను ఇసుక మాఫియా...

Monday, July 27, 2015 - 06:48

గెలాక్సీ గ్రానైట్‌ అంటే ప్రపంచంలో ఎంతో పేరుంది. నల్లని అద్దంలా మెరవడమే కాకుండా.. బంగారు వర్ణంతో నింగిలో నక్షత్ర సమూహాన్ని తలపించేలా ఉండే ఈ గ్రానైట్‌తో వ్యాపారులు కోట్లు సంపాదిస్తున్నారు. అయితే రాయిని అందంగా తీర్చుదిద్దుతున్న కార్మికుల బతుకులు మాత్రం చీకట్లోనే మగ్గుతున్నాయి. యాజమాన్యాలకు తమ మొర ఎన్నిసార్లు చెప్పుకున్నా పట్టించుకోకపోవడంతో కార్మికులు సమ్మెబాట పట్టారు.
...

Monday, July 27, 2015 - 06:43

ప్రకాశం జిల్లాలో గ్రానైట్‌ కార్మికులు సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మెకు కారణం ఏమిటి ? కార్మికులు కోరుతున్నదేమిటి ? గ్రానైట్‌ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలేమిటి ? ఈ అంశంపై టెన్ టివి జనపథంలో సీఐటీయూ నేత కె.శ్రీనివాసరావు మాట్లాడారు. 

Friday, July 24, 2015 - 07:08

సిటీ జీవితంలో నిద్రలేవగానే చాలామంది ఇల్లాల్లు వెళ్లేది గ్యాస్ పొయ్యి దగ్గరకే. ఏ ఒక్కపూట గ్యాస్ అయిపోయినా, ఇక ఆ పూట కుటుంబానికి పస్తే. అయితే, పంపిణీ విషయంలో ఏజెన్సీలు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయి. ఇష్టానుసారం వ్యవహరిస్తున్నాయి. గ్యాస్ బుక్ చేసిన ప్రతిసారీ ఏదో ఒక సందేశం వినిపించి కొత్త కొత్త కొర్రీలు పెడుతున్నాయి. వంటగ్యాస్. ఇప్పుడు ప్రతి ఒక్కరికీ అది జీవితావసరం....

Friday, July 24, 2015 - 06:59

గ్యాస్ వినియోగదారులను రోజుకో సమస్య వెన్నాడుతోంది. డోర్ లాక్ పేరుతో సిలిండర్ వెనక్కి వెళ్లిపోతోంది. మళ్లీ బుక్ చేసుకోవాల్సి వస్తోంది. ఆన్ లైన్ బుకింగ్ లూ తరచూ సమస్యాత్మకంగా మారుతున్నాయి. వీటికి తోడు గ్యాస్ సబ్సిడీ రద్దయ్యే ప్రమాదమూ పొంచి వుంది. ఈ పరిస్థితికి కారణం ఏమిటి ? గ్యాస్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి వున్న మార్గాలేమిటి? ఈ అంశంపై టెన్ టివి జనపథంలో హైదరాబాద్...

Thursday, July 23, 2015 - 07:18

ఓ వైపు కరువు రక్కసి కోరలు చాస్తున్నా పాలకులు తమ కేమి పట్టనట్టున్నారు. మరో వైపు మందుగా మురిపించిన వర్షాలు ముఖం చాటేయడంతో భూగర్భ జలాలు అడుగంటుతుండగా మరో వైపు సాగునీరే కాదు తాగునీటికీ ఎద్దడి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చేయాల్సిందేంటి? చేస్తుందేంటి? రైతాంగం కోరుతున్నదేంటి?
పడిపోయిన భూగర్భ జలాలు..
తెలంగాణలో ఖరీప్ సీజన్ ప్రారంభంలో ఎడతెరిపి లేని...

Thursday, July 23, 2015 - 07:14

తెలుగు నేల మీద కరువు పడగవిప్పుతోంది. ఆగస్టు వస్తున్నా వానలు లేకపోవడంతో అన్నదాత అల్లాడుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఏం చేయాలి? రైతులను, వ్యవసాయ కూలీలను ఆదుకునేందుకు తక్షణం చేయాల్సిన పనులేమిటి? కరువు కాటేస్తున్న వేళ రైతుల ముందున్న ప్రత్యామ్నాయాలేమిటి? ఈ అంశంపై టెన్ టివి జనపథంలో అరిబండి ప్రసాదరావు విశ్లేషించారు.

Wednesday, July 22, 2015 - 07:04

అమరావతి సీడ్ క్యాపిటల్ ప్లాన్ వచ్చింది. అయితే సింగపూర్ సమర్పించిన ఈ ప్లాన్ పై అనేక సందేహాలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సింగపూర్ ఇచ్చిన సీడ్ క్యాపిటల్ ప్లాన్ పై మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు టెన్ టివి జనపథంలో విశ్లేషించారు. 

Wednesday, July 22, 2015 - 07:03

సింగపూర్ చూడముచ్చటైన ప్లానిచ్చింది. ఓ అద్భుత సౌందర్యాన్ని మన కళ్లెదుట నిలిపింది. అయితే, అనేక మంది అనేక ప్రశ్నలు సంధిస్తున్నారు. చక్కటి రాజధాని. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల కోరిక. తెలుగు తటాకంలో సింగపూర్ ను స్రుష్టించాలన్నది చంద్రబాబు స్వప్నం. కానీ డబ్బుల్లేవు. కేంద్రం ఇస్తుందన్న ఆశ లేదు. చంద్రబాబు మాత్రమే తమకో చక్కటి రాజధాని నిర్మించి ఇవ్వగలడన్న నమ్మకం వల్లనో, భ్రమవల్లనో ఓట్లేసి...

Tuesday, July 21, 2015 - 07:03

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పడి ఏడాది దాటింది. రైతులకు రుణమాఫీలాంటి చక్కటి వాగ్దానాలిచ్చి, అధికారంలోకి వచ్చిన పార్టీలు అన్నదాతకు బ్యాంక్‌లో అప్పు పుట్టని పరిస్థితిని సృష్టించాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రెండు చోట్లా అన్నదాత కష్టాలు ఒక్కటే. చుక్క చినుకు లేదు. తొలకరిలో మేఘాలు ఒలకపోసిన నీళ్లను చూసి, విత్తనాలు చల్లినవారికి కన్నీళ్లే మిగిలాయి. చాలాచోట్ల గింజలు...

Tuesday, July 21, 2015 - 07:02

కాలం కరిగిపోతోంది. ఆగస్టు నెల వస్తున్నా ఒక్క గట్టివర్షమైనా కురవలేదు. మరోవైపు రైతులకు బ్యాంక్‌లో అప్పులు పుట్టడం లేదు. రైతుల ఆత్మహత్యలూ ఆగడం లేదు. అన్నదాతను కష్టాలు చుట్టుముట్టాయి. ఈ పరిస్థితికి కారణం ఏమిటి? రైతుల బాధలు తొలగాలంటే ప్రభుత్వాలు తక్షణం ఏం చేయాలి? ఈ అంశంపై టెన్ టివి జనపథంలో రైతు సంఘం నేత విశ్వేశ్వరరావు మాట్లాడారు. 

Monday, July 20, 2015 - 06:48

ర్యాగింగ్‌ తట్టుకోలేక నాగార్జున యూనివర్సిటీలో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నతీరు ఆందోళన కలిగిస్తోంది. ర్యాగింగ్‌ వ్యతిరేకంగా కఠిన చట్టాలున్నా ఈ జాఢ్యం ఆగడం లేదు. ప్రతి రోజూ ఏదో ఒక కాలేజీ ర్యాగింగ్‌ వికృతంగా వికటాట్టహాసం చేస్తోంది. మన విద్యాలయాల్లో ఈ అమానవీయ సంస్కృతి ఎందుకు ప్రబలుతోంది? ర్యాగింగ్‌ విషయంలో మన చట్టాలు, కోర్టులు ఏం చెబుతున్నాయి? ర్యాగింగ్‌ ను నిరోధించాలంటే...

Monday, July 20, 2015 - 06:45

ఇది కొందరికి సరదా. మరికొందరికి నరకం. ర్యాగింగ్‌ను కొంతమంది చాలా తేలిగా తీసుకుంటారు. మరికొందరు ఆ పదం వింటేనే గజగజ వణికిపోతారు. డైనమిక్‌ క్రికెటర్‌ సురేష్‌ రైనా, బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌, అనురాగ్‌ కాశ్యప్‌, అర్జున్‌ రాంపాల్‌, ఇంతియాజ్‌ ఆలీ, మనీష్‌ గుప్తా లాంటి సినీ ప్రముఖులు కూడా ర్యాగింగ్‌ దుఃఖాన్ని అనుభవించినవారే. తన సోదరుడు తనకు ధైర్యం చెప్పి వుండకపోతే సురేష్‌ రైనా లాంటి...

Thursday, July 16, 2015 - 06:42

హైదరాబాద్: ఉభయ రాష్ట్రాల్లోనూ మున్సిపల్ కార్మికుల సమ్మె ఉధ్రుతం అవుతోంది. మరోవైపు ప్రభుత్వానికీ, కార్మికులకీ జరుగుతున్న చర్చల్లో ఇంకా పరిష్కారం లభించలేదు. ఉభయ రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో కార్మిక నేతల, కార్మికుల అరెస్టులు సాగుతున్నాయి. ఇంతకీ కార్మికులు ఎందుకు సమ్మె చేస్తున్నారు? వారి డిమాండ్స్ ఏమిటి? చర్చల్లో ప్రభుత్వం ఏం చెబుతోంది? ప్రభుత్వం నుంచి...

Thursday, July 16, 2015 - 06:40

హైదరాబాద్: మన పట్టణాలు, నగరాలలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తున్నదెవరో తేలిపోయింది. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ నినాదాలిస్తున్న ప్రభుత్వాలకు ఆ కార్యక్రమం పట్ల ఎంత చిత్తశుద్ధి వున్నదో అర్ధమవుతున్నది. స్వచ్ఛ, స్వచ్ఛ, స్వచ్ఛ అంటూ చీపుర్లు పట్టుకుని, మీడియా ఫోటోలకు ఫోజులిచ్చిన రాజకీయ నాయకుల, సినీస్టార్ల, ఇతర సెలబ్రిటీల...

Wednesday, July 15, 2015 - 07:00

విజయవాడ: గోదావరి పుష్కరాలు ప్రారంభమైన తొలి గంటల్లోనే అంతులేని విషాదం జరిగింది. రాజమండ్రిలో జరిగిన తొక్కిసలాటలో 29మంది చనిపోయారు. ఈ మహా విషాదం ప్రతి ఒక్కరినీ కలచివేస్తోంది. సామూహిక కార్యక్రమాల నిర్వహణలో మనమెంత అప్రమత్తంగా వుండాలో హెచ్చరిస్తోంది. ఇంతకీ లోపం ఎక్కడ జరిగింది? దీనికి బాధ్యులెవరు? మళ్లీ మళ్లీ ఇలాంటి విషాదాలు జరగకుండా వుండాలంటే ఏమి చేయాలి? ఈ విషాద...

Monday, July 13, 2015 - 07:42

గోదావరి నదికి పన్నెండేళ్లకొకసారి వచ్చే పుష్కరాల సందడి జోరందుకుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. కొన్ని కోట్ల మంది భక్తులు పుష్కర స్నానాలు చేస్తారన్న అంచనాలతో ప్రభుత్వాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. గోదావరి నది ప్రవహించే ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం, ఉభయగోదావరి జిల్లాల్లో ఈ పన్నెండు రోజుల్లో కొన్ని కోట్ల మంది భక్తులు...

Monday, July 13, 2015 - 07:16

రేపటి నుంచి గోదావరి పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. ఈ పన్నెండు రోజులూ భారీ సంఖ్యలో భక్తులు ఒక చోట చేరబోతున్నారు. అయితే, ఇలాంటి సమయంలో యాత్రికులు తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి? పుష్కరాలకీ, మానవ జీవితాలకీ ఉన్న సంబంధం ఏమిటి? మానవ నాగరికతా వికాసంలో నదుల పాత్ర ఏమిటి? ఇలాంటి అంశాలపై టెన్ టివి జనపథంలో జనవిజ్ఞాన వేదిక నేత శంకరయ్య విశ్లేషించారు. 

Friday, July 10, 2015 - 06:59

హైదరాబాద్: ఉభయ రాష్ట్రాల్లో బాహుబలి మేనియా ఆవహించింది. కొంతకాలంగా ఈ సినిమా చుట్టూ సాగిన ప్రచారం సినీ ప్రేక్షకుల్లో అంతులేని ఉత్సుకతను పెంచింది. మరోవైపు టిక్కెట్ల అమ్మకాలు సాగిస్తున్న తీరుపై తీవ్ర విమర్శలొస్తున్నాయి. అడ్డగోలు ధరలకు అమ్ముతున్నారన్నది బహిరంగ రహస్యం. బాహుబలి సినిమా విడుదల సందర్భంగా జరుగుతున్న తంతుపై ఇవాళ్టి జనపథం చర్చను చేపట్టింది. ఈ చర్చలో...

Friday, July 10, 2015 - 06:56

బాహుబలి సినిమా టిక్కెట్ల అమ్మకాలు తీవ్ర వివాదస్పదమవుతున్నాయి. మునుపెన్నడూ లేనిరీతిలో ఈ సినిమా టిక్కెట్లను బ్లాక్‌్ లో విక్రయిస్తున్నతీరుపై తీవ్ర చర్చే జరుగుతోంది. ఇష్టమొచ్చినట్టు నిబంధనలు ఉల్లంఘించి, టిక్కెట్లు బ్లాక్‌్ చేస్తుంటే ప్రభుత్వం ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తోంది?
సినీ రంగం ట్రెండ్‌్ మారుతోందా!
సినీ రంగం ట్రెండ్‌్ మారుతోంది. నేటి సినిమాలు...

Thursday, July 9, 2015 - 10:40

నెల్లూరు: జిల్లా రైతులకు కొత్త కష్టం వచ్చింది. ఇప్పుడు యూరియా కొనుక్కోవాలంటే చుక్కలు కనిపిస్తున్నాయి. ఈ కష్టాలు భవిష్యత్‌లో ఒక్క నెల్లూరు జిల్లాకే పరిమితం కాకపోవచ్చు.
నెల్లూరు జిల్లాలో కొత్త విధానం
ఓ వైపు కాలం నెత్తి మీద కొచ్చినా తగినన్ని వర్షాలు కురవక రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు అధికారులు కొత్త కొత్త విధానాలు తీసుకొచ్చి...

Pages

Don't Miss