జనపథం

Monday, April 17, 2017 - 08:42

మిర్చి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతు సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చంద్రారెడ్డి బొంతల చంద్రారెడ్డి డిమాండ్ చేశారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. 'మిర్చి రైతులు తీవ్ర కష్టాల్లో వున్నారు. పండించిన పంటకు సరియైన ధర లభించక నష్టాల పాలవుతున్నారు. ధరలు పడిపోయిన నేపథ్యంలో మిర్చి రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో...

Friday, April 14, 2017 - 10:26

154 రోజుల సిపిఎం మహాజన పాదయాత్ర బృందానికి ఉప నేతగా వ్యవహరించిన జాన్ వెస్లీ, ఆయన సతీమణి భారతి టెన్ టివి జనపథంలో పాల్గొన్నారు. పాత మహబూబ్ నగర్ జిల్లా నేటి వనపర్తి జిల్లా అమరచింత లో జన్మించిన జాన్ వెస్లీ విద్యార్థి దశ నుంచే వామపక్ష రాజకీయాలవైపు ఆకర్షితులయ్యారు. తొలుత రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ లోనూ, ఆ తర్వాత పిడిఎస్ యులోనూ పనిచేసిన జాన్ వెస్లీ 1996 నుంచి సిపిఎంలో చేరారు. కుల...

Thursday, April 13, 2017 - 06:41

హైదరాబాద్: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మిర్చి రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. మిర్చి పండించిన రైతులకు నష్టాలే మిగులుతున్నాయి. మిర్చి ధరలు దారుణంగా పడిపోవడం, కోల్డ్ స్టోరీజీలు అందుబాటులో లేకపోవడంతో రైతులు తల్లడిల్లుతున్నారు. ధరల పతనం, మార్కెట్ల మాయాజాలం నుంచి తమను కాపాడాలంటూ రైతులు కోరుతున్నారు. మిర్చి పండించి తీవ్రంగా నష్టపోయిన రైతులు...

Wednesday, April 12, 2017 - 06:34

హైదరాబాద్: 154 రోజుల మహాజన పాదయాత్రలో పాల్గొన్న నగేష్, ఆయన సతీమణి సరిత ఇవాళ్టి జనపథంలో విశిష్ట అతిథులుగా పాల్గొంటున్నారు. తెలంగాణలో 4200 కిలోమీటర్ల పాదయాత్ర చేసి రికార్డు సృష్టించిన నగేష్ జన్మస్థలం సూర్యాపేట జిల్లా నేరేడ్ చర్ల. హైస్కూలులో చదువుకునే రోజుల్లోనే వామపక్ష విద్యార్థి ఉద్యమాల వైపు ఆకర్షితులయ్యారు. నేరేడ్ చర్ల జూనియర్ కాలేజీ...

Monday, April 10, 2017 - 06:37

హైదరాబాద్ : 154 రోజుల పాదయాత్రలో పాల్గొన్నవారిలో అత్యంత పిన్నవయస్సుడు నైతం రాజు. కేవలం 29 ఏళ్ల వయస్సులోనే 4200 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన తొలి బ్యాచిలర్ గా కూడా నైతం రాజు రికార్డు సృష్టించారు. కొమురంభీం జిల్లా బెజ్జూరు మండలం సోమిని గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించిన నైతం రాజు సిర్పూర్ కాగజ్ నగర్ లో డిగ్రీ పూర్తి చేశారు. తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న...

Friday, April 7, 2017 - 08:20

బాబు వస్తే జాబు వస్తుందన్నది టిడిపి ఎన్నికల స్లోగన్. చూస్తుండగానే కాలం కరిగిపోతోంది. టిడిపి అధికారంలోకి వచ్చే మూడేళ్లయ్యింది. కానీ, నిరుద్యోగులకు జాబ్స్ మాత్రం రాలేదు. వివిధ ప్రభుత్వ శాఖల్లో లక్షా 42వేల ఖాళీలున్నాయి. అవి భర్తీ చేయడం లేదు. స్కూల్స్ లో 4,500 టీచర్ పోస్టులు ఖాళీగా వున్నట్టు ప్రభుత్వమే కోర్టుకి నివేదించింది. అవీ భర్తీ చేయడం లేదు. ఇక నిరుద్యోగులకు నెలకు రెండు...

Thursday, April 6, 2017 - 07:17

154 రోజుల పాటు 4200 కిలోమీటర్ల పాదయాత్రలో రమణ పాల్గొన్న సంగతి తెలిసిందే. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం గొల్లచర్ల గ్రామంలో జన్మించిన రమణ విద్యార్థి దశ నుంచే ఉద్యమాల వైపు, వామపక్ష భావజాలం వైపు ఆకర్షితులయ్యారు. ఎస్ఎఫ్ఐ, ప్రజానాట్యమండలి, కల్లుగీత కార్మిక సంఘాలలో పనిచేసిన రమణ చేతి వృత్తి దారుల సమన్వయ కమిటీ కన్వీనర్ గా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 1989లో ఉద్యమాల్లో...

Tuesday, April 4, 2017 - 08:37

మిర్చి, కందులతోపాలు అన్ని పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని అఖిల భారత కిసాన్ సభ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి డిమాండ్ చేశారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. 'మళ్లీ పాత చరిత్రే వెక్కిరిస్తోంది. మార్కెట్ కు వెళ్లిన రైతులు గుండెలు బాదుకుంటున్నారు. తమ కష్టాన్ని కళ్లెదుటే దళారీలు కొల్లగొడుతున్న ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో రైతులు...

Monday, April 3, 2017 - 07:48

లారీ ఓనర్స్ సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ నాయకులు భాస్కర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. 'దక్షిణాది రాష్ట్రాల లారీ ఓనర్స్ అసోసియేషన్ చేపట్టిన లారీల సమ్మెతో నాలుగు రోజులుగా సరకు రవాణా స్తంభించిపోయింది. ఎక్కడి లారీలు అక్కడే నిలిచిపోయాయి. వివిధ మార్కెట్లకు పూలు, పండ్లు, కూరగాయల సరఫరా...

Friday, March 31, 2017 - 06:45

హైదరాబాద్: 154 రోజులు, 4200 కిలోమీటర్ల పాదయాత్రలో పాల్గొన్న అబ్బాస్ ఇవాళ్టి జనపథంలో విశిష్ట అతిథిగా పాల్గొంటున్నారు. జనగామ జిల్లా జఫర్ ఘడ్ మండలం తమ్మడపల్లి గ్రామంలో జన్మించిన అబ్బాస్ 1999 లోనే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎమ్మెస్సీ మాథ్య్స్ పూర్తి చేశారు. ఆ వెంటనే అబ్బాస్ పూర్తికాలపు డివైఎఫ్ఐ కార్యకర్తగా మారిపోయారు. పాలకుర్తి హాస్టల్ లో...

Thursday, March 30, 2017 - 06:42

హైదరాబాద్: లారీల యజమానులు సమ్మెబాట పట్టారు. ఇవాళ్టి నుంచి ఎక్కడి లారీలే అక్కడే నిలిచిపోతున్నాయి. దక్షిణాది లారీల ఓనర్స్ అసోసియేషన్ తలపెట్టిన ఈ సమ్మె కారణంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరిల్లోని 16 లక్షల లారీల రవాణా స్తంభించిపోతుంది. లారీ యజమానుల సమ్మెకు కారణం ఏమిటి? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ముందు పెడుతున్న...

Wednesday, March 29, 2017 - 06:44

అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి సభ్యుడిగా పదేళ్ల పాటు సేవలందించిన ఎంవిఎస్ శర్మ పదవీ విరమణ చేస్తున్నారు. 2007, 2011 సంవత్సరాలలో ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం నుంచి విజయం సాధించిన ఎంవిఎస్ శర్మ 2017 ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఎమ్మెల్సీగా ఆరేళ్ల పదవీ కాలం ఇవాళ్టితో ముగుస్తోంది. పదేళ్ల పాటు ఎమ్మెల్సీగా పనిచేసిన ఎంవిఎస్ శర్మ సాధించిన...

Tuesday, March 28, 2017 - 08:55

టీ.ప్రభుత్వం చెబుతున్న మాటలకు చేతలకు పొంతన లేదని సీఐటీయూ నాయకురాలు, సీపీఎం మహాజన పాదయాత్ర బృందం ఎస్ రమ అన్నారు. ఇవాళ్టి జనపథం చర్చా కార్యక్రమంలో రమతోపాటు ఆమె వెంకన్న పాల్గొని, మాట్లాడారు. 'తెలంగాణ ఆడబిడ్డ భారతదేశ చరిత్రలోనే కొత్త రికార్డు సృష్టించారు. ఆమె ఎవరో కాదు. వివిధ ప్రజాసమస్యలపై జనపథం కార్యక్రమంలో తన గళం వినిపించిన రమ. సిపిఎం నిర్వహించిన మహాజన పాదయాత్రలో 154 రోజుల...

Monday, March 27, 2017 - 06:38

అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో గ్రామపంచాయతీ కార్మికులు, ఉద్యోగులు పోరుబాటపట్టారు. ఈ నెల 28న రేపు చలో విజయవాడ నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నారు. గ్రామ పంచాయతీ కార్మకులకు 151 జీవో ప్రకారం జీతాలు చెల్లిస్తామంటూ నవంబర్ లో చేసిన ప్రకటనను అమలు చేయకపోవడం, వర్తింపచేయకపోవడం వీరి ఆందోళనకు కారణం. గ్రామ పంచాయతీ ఆదాయంలో జీతాలు ఖర్చులు 30శాతానికి మించకూడదన్న నిబంధన పెట్టి,...

Friday, March 24, 2017 - 08:33

సామాజిక తెలంగాణ కావాలని ఎంబిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆశయ్య అన్నారు. సామాజిక తెలంగాణ ఏర్పడితేనే పేదల బతుకులు బాగుపడుతాయని తెలిపారు. జనపథం చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. ఆయన సతీమణి విజయ పాల్గొన్నారు. '154 రోజులు, 4200 కిలోమీటర్ల పాదయాత్రను దిగ్విజయంగా పూర్తి చేసిన సిపిఎం బృందంలోని సభ్యుడు ఆశయ్యగారు ఇవాళ్టి జనపథంలో విశిష్ట అతిథిగా పాల్గొంటున్నారు. వారి సతీమణి...

Thursday, March 23, 2017 - 08:41

ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ అసోసియేషన్ తిరుమలరావు డిమాండ్ చేశారు. ఇదే అంశంపై ఇవాళ్టి జనపథంలో ఆయన మాట్లాడారు. 'అగ్రిగోల్డ్ బాధితులు మరోసారి పోరుబాట పట్టారు. రెండు రోజుల క్రితం అగ్రిగోల్డ్ బాధితులు విజయవాడలో భారీ ర్యాలీ నిర్వహించారు.  మార్చి 3 నుంచి నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. 32 లక్షల మంది వున్న బాధితులకు సత్వర...

Wednesday, March 22, 2017 - 11:02

ప్రజల అభివృద్ధే తెలంగాణ అభివృద్ధి అని ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ నేత, పాదయాత్ర బృందం సభ్యుడు శోభన్ నాయక్ అన్నారు. ఇవాళ్టి జనపథంలో శోభన్ తో పాటు ఆయన సతీమణి విజయకుమారి పాల్గొని, మాట్లాడారు. తెలంగాణ ప్రజల సమస్యలను అధ్యయనం చేయడానికి పాదయాత్ర నిర్వహించామని చెప్పారు. 'ఇవాళ్టి 10టీవీ జనపథానికి ఒక విశిష్ట అతిథి హాజరయ్యారు. చిన్న వయస్సుల్లోనే పెద్ద రికార్డు సృష్టించిన పాదయాత్రికుడు...

Tuesday, March 21, 2017 - 12:00

విఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ గ్రామ సహాయకుల సంఘం నాయకులు బాలకాశి డిమాండ్ చేశారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. 'ఆంధ్రప్రదేశ్ లో విఆర్ఏలు మరోసారి పోరుబాట పట్టారు. తెలంగాణ కంటే ఆంధప్రదేశ్ లో విఆర్ఏల వేతనాలు తక్కువగా వున్నాయి. తెలంగాణలో  విఆర్ఏలకు పది వేల ఏడు వందల రూపాయల వేతనం ఇస్తుండగా, ఆంధ్రప్రదేశ్ లో ఆరు వేల నాలుగు...

Monday, March 20, 2017 - 07:12

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ లో కౌలు రైతులకు నిరాశే మిగిలింది. 32 లక్షల మంది వున్న కౌలు రైతుల సమస్యలకు ఈ బడ్జెట్ పరిష్కారం చూపించలేకపోయింది. లక్షా 56వేల కోట్ల రూపాయలతో యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టిన ఏపి రాష్ట్ర బడ్జెట్ పై కౌలు రైతు సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. సవరణలు ప్రతిపాదిస్తున్నాయి. ఈ అంశంపై టెన్ టివి జనపథంలో ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం నేత జమలయ్య మాట్లాడారు....

Friday, March 17, 2017 - 08:44

ఏపీ రాష్ట్ర బడ్జెట్ కరువు ప్రాంతాలకు ఉపశమనం కలిగించలేదని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నేత పెద్దిరెడ్డి అన్నారు. బడ్జెట్ కరువు సమస్యకు పరిష్కారం చూపలేకపోయిందని పేర్కొన్నారు. కౌలు రైతులు అసంతృప్తిగా ఉన్నారని తెలిపారు. 'లక్షా 66 వేల 999 కోట్ల రూపాయలతో ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ కరువు సమస్యకు పరిష్కారం చూపలేకపోయిందంటూ రైతు...

Thursday, March 16, 2017 - 06:49

ఎస్సీ ఉపకులాలు మరోసారి పోరుబాటపడుతున్నాయి. బేడ బుడగ జంగాలు తమ హక్కుల కోసం నినదిస్తున్నారు. ఏప్రిల్‌ 13న చలో హైలో హైదరాబాద్‌ కార్యక్రమం నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నారు. ఎస్సీ ఉపకులాలు ఎదుర్కొంటున్న సమస్యలేమిటి? బేడ బుడగ జంగాల జీవన స్థితిగతులు ఎలా వున్నాయి? ప్రభుత్వ పథకాలు వీరికి ఎలా అందుతున్నాయి? ప్రభుత్వం నుంచి ఆశిస్తున్నదేమిటి? ఈ అంశంపై టెన్ టివి జనపథంలో తెలంగాణ బేడ...

Wednesday, March 15, 2017 - 06:38

హైదరాబాద్: దాదాపు లక్షన్నర కోట్ల రూపాయలతో తెలంగాణ ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ ఫస్ట్ లుక్ ఫీల్ గుడ్ భావన కలిగించినా, లోతుల్లోకి వెళ్లి విశ్లేషిస్తే చివరకు నిరాశే మిగులుతోంది. ఇంతింతై వటుడింతై అన్నట్టు పెరుగుతున్న అప్పులు కలవరపెడుతున్నాయి. మూడేళ్లలోనే రాష్ట్ర అప్పులు రెండింతలవ్వడం ఆందోళన కలిగిస్తోంది. దీనికి తోడు...

Monday, March 13, 2017 - 09:38

మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నేత పాలడుగు భాస్కర్ డిమాండ్ చేశారు. ఇవాళ్లి జనపథం చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. తెలంగాణలోని గ్రామ పంచాయతీ, మున్సిపల్ కార్మికులు మరోసారి పోరుబాట పడుతున్నారు. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్ లో సమావేశమైన తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్, వర్కర్స్ యూనియన్, తెలంగాణ మున్సిపల్ వర్కర్స్...

Friday, March 10, 2017 - 09:40

పద్ధతి ప్రకారం చదివితే పరీక్షలు రాయడం చాలా ఈజీ అని టీచర్ నెహ్రూ అన్నారు. ఇవాళ్టి జనపథం కార్యక్రమంలో పాల్గొని, మాట్లాడారు. 'పదో తరగతి పరీక్షల్లో ఇంగ్లీష్, మ్యాథ్స్ తో పాటు కీలకమైన మరో సబ్జక్టు సైన్స్. ఈ పేపరులో కూడా మంచి మార్కులు సాధించడానికి అకాశాలు పుష్కలం. అయితే, టెంత్ సైన్స్ పేపర్ ప్రిపరేషన్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి? సైన్స్ సబ్జక్టును పక్కాగా గుర్తుపెట్టుకోవడానికి...

Thursday, March 9, 2017 - 08:52

ఎలాంటి ఆందోళన, హడావిడి లేకుండా ప్రశాంతంగా ఎగ్జామ్స్ కు వెళ్లాలని మ్యాథ్స్ టీచర్ టివి.నాగేశ్వర్ రావు తెలిపారు. మ్యాథ్స్ లో అత్యధిక మార్కులు స్కోర్ చేయడంల ఎలా అనే అంశంపై ఇవాళ్టి జనపథం చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. పదో తరగతి పరీక్షల తేదీ సమీపిస్తోంది. పదో తరగతి విద్యార్థులకు అత్యంత కీలకమైన పేపర్ మ్యాథ్స్. అత్యధిక మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం వున్న పేపర్ ఇది...

Wednesday, March 8, 2017 - 07:59

నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఇవాళ మహిళలకు ప్రత్యేక సెలవు దినంగా ప్రకటిస్తూ ప్రభుత్వం ఇప్పటికే జీవో జారీ చేసింది. మహిళా దినోత్సవానికి రెండు రోజుల ముందు విడుదలైన మోన్ స్టర్ సర్వే గణాంకాలు కొన్ని కీలకమైన ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి. మన దేశంలో స్త్రీలు పురుషుల మధ్య ఇప్పటికీ వేతన వ్యత్యాసాలు కొనసాగుతున్న వైనాన్ని కళ్లకు కట్టింది మోన్ స్టర్ సర్వే. ఒకవైపు వేతనాల్లో అన్యాయానికి...

Tuesday, March 7, 2017 - 06:49

పదో తరగతి పరీక్షల్లో గ్రామీణ విద్యార్థులు ముఖ్యంగా భయపడే సబ్జక్ట్ ఇంగ్లీష్. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ మంది ఫెయిలయ్యే సబ్జక్ట్ కూడా ఇదే. కాబట్టి, ఇంగ్లీష్ పేపర్ అనగానే చాలామంది విద్యార్థులు భయపడుతుంటారు. ఈ పరిస్థితికి కారణం ఏమిటి ? పదో తరగతి విద్యార్థులు ఇంగ్లీష్ పేపర్ ప్రిపరేషన్ లో పాటించాల్సిన సూత్రాలేమిటి? ఇంగ్లీష్ లో మంచి మార్కులు సాధించాలంటే ఎలాంటి జాగ్రత్తలు...

Pages

Don't Miss