జనపథం

Thursday, June 15, 2017 - 08:54

నేటి నుంచి జరుగనున్న సింగరేణి సమ్మే రాష్ట్ర ప్రభుత్వం కారణంతోనే మేం సమ్మే చేస్తున్నామని, టీఆర్ఎస్ ఎన్నికల హామీలో డిపెండెంట్ ఉద్యోగులు ఇస్తామని ప్రకటించిందని, సింగరేణి కార్మికులతో ప్రభుత్వం చలగటం అడుతోందని తెలంగాణ సీఐటీయూ అధ్యక్షుడు సాయిబాబా గారు అన్నారు. అధికార గుర్తింపు యూనియన్‌ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం మాత్రం సమ్మెకు దూరంగా ఉంది. పూర్తి వివరాలకు వీడియో చూడండి.  ...

Wednesday, June 14, 2017 - 09:19

విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల విషయంలో బిజెపి ఎంపి హరిబాబు చేసిన వ్యాఖ్యలపై కార్మిక సంఘాలు భగ్గుమంటున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాలకు యాజమాన్యం అసమర్ధతే కారణమంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను పలువురు తప్పుపడుతున్నారు. మరి ఇంతకీ విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాలకు కారణమెవరు? బాధ్యులెవరు? ఎంపి హరిబాబు వ్యాఖ్యల వెనక వ్యూహమేమిటి? విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల నుంచి గట్టెక్కాలంటే కేంద్ర...

Tuesday, June 13, 2017 - 07:08

పెట్రోల్, డీజిల్ ధరలు ఇక ఏ రోజుకారోజే నిర్ణయిస్తారు. 15 రోజుల కొకసారి పెట్రోల్, డీజిల్ ధరలను సమీక్షించే విధానానికి ఇక స్వస్తి చెబుతున్నారు. ఈ నెల 16 నుంచి కొత్త విధానం అమలులోకి తెస్తున్నట్టు ఇప్పటికే ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి. అయితే, ఏ రోజుకారోజు ధరలను నిర్ణయించే విధానంపై పెట్రోల్ బంక్ ల యజమానులు తీవ్ర అసంతృప్తిని వ్యతిరేకిస్తున్నారు. రోజువారీ ధరల సమీక్షకు వ్యతిరేకంగా ఈ...

Monday, June 12, 2017 - 07:55

విద్యసవంత్సరం ప్రారంభమనగానే విద్యార్థులకు అనేక సమస్యల ఎదురౌతున్నాయి. టీఆర్ఎస్ తన ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానలు అమలు చేయడంలో విఫలం చెందింది. సమస్యల వలయంలో ప్రభుత్వ విద్యరంగము ఉన్నదని, మరో పక్క ప్రైవేట్ స్కూల్స్ దొపిడీ ఉందని తెలంగాణ ఎస్ఎఫ్ఐ కార్యదర్శి రమేష్ అన్నారు పూర్తి వివరాలు వీడియో చూడండి.

 

Wednesday, June 7, 2017 - 06:59

టీఎస్ పీఎస్పీ విడుదల చేసిన గ్రూప్ 2 ఫలితాల్లో అనుమానాలు ఉన్నాయిని జనపథంలో పాల్గొన్న డీవైఎష్ రాష్ట్ర కార్యదర్శి విజయ్ అన్నారు. సిద్దిపేటలో ఒకే కేంద్రం నుంచి 100 సెలక్ట్ చేయడం, 1:2 చెప్పిన టీఎస్ పీఎస్సీ ఇప్పుడు 1:3 ప్రకటించడం వెనుక అవినీతి జరిగిందని ఆయన అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.  

Monday, June 5, 2017 - 08:55

రాష్ట్రంలో పాఠశాల విద్యను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది. విద్య శాఖలో రేషనలైజెషన్, బదిలీలు తప్ప మరో విషయం లేకుండా చేస్తున్నారని ఏపీయూటీఎఫ్ నాయకులు బాబు రెడ్డి గారు అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి. 

Friday, June 2, 2017 - 06:47

తెలంగాణ రాష్ట్రం నాలుగో వసంతంలోకి అడుగుపెట్టింది. తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కెసిఆర్ కూడా ముఖ్యమంత్రిగా మూడేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకున్నారు. గత మూడేళ్లలో సాధించిన విజయాలేమిటి? వేసిన తప్పటడుగులేమిటి? సాఫల్య వైఫల్యాలేమిటి? ఈ మూడేళ్లలో టిఆర్ఎస్ పాలన లో ఎదురైన అనుభవాలేమిటి? ఈ అంశంపై టెన్ టివి జనపథంలో తెలంగాణ ఉద్యమంలో యాక్టివ్ గా పాల్గొన్న న్యూడెమోక్రసీ నేత...

Thursday, June 1, 2017 - 07:11

తెలంగాణలో మున్సిపల్ కార్మికులు మరోసారి పోరుబాట పడుతున్నారు. జిహెచ్ఎంసి పరిధిలో పనిచేస్తున్నవారి వేతనాలు పెంచినట్టే తమ వేతనాలూ పెంచాలంటూ జిల్లాల్లో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులు ఇవాళ ధర్నాలు చేసేందుకు సమాయత్తమవుతున్నారు. తెలంగాణలోని మున్సిపల్ కార్మికులు ఇవాళ ధర్నాలు చేపట్టడానికి కారణం ఏమిటి? ప్రభుత్వం ముందు పెడుతున్న ప్రధానమైన డిమాండ్ ఏమిటి? . జిహెచ్ఎంసి కార్మికులతో...

Wednesday, May 31, 2017 - 06:48

రవాణా రంగంలో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ ప్రభుత్వం రవాణారంగంలో సంస్కరణల పర్వాన్ని వేగవంతం చేసింది. బడా సంస్థలకు లాభాలు ఓనర్ కమ్ డ్రైవర్లకు నష్టాలు తెచ్చేలా ఈ సంస్కరణలున్నాయన్న టాక్ వినిపిస్తోంది. రవాణారంగంలో మునుపెన్నడూ లేని అలజడి, ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే జూన్ 4, 5 తేదీలలో విశాఖపట్టణంలో ఆలిండియా రోడ్డు...

Tuesday, May 30, 2017 - 10:47

మరో వారం పది రోజుల్లో వేసవి సెలవులు ముగుస్తున్నాయి. ఇప్పటికే ప్రయివేట్ కార్పొరేట్ స్కూళ్లలో అడ్మిషన్ల పర్వం నడుస్తోంది. అయితే, ప్రయివేట్ కార్పొరేట్ స్కూళ్ల ఫీజుల దందాకు కళ్లెం పడలేదు. గత రెండు మూడేళ్లుగా విద్యార్థుల తల్లితండ్రులు ఎన్నిరకాలుగా ఆందోళనలు చేస్తున్నా కొన్ని ప్రయివేట్, కార్పొరేట్ స్కూళ్ల బుద్ధి మారడం లేదు. ఫీజుల దాహం తీరడం లేదు. ఫీజుల నియంత్రణ కోసం పోరాడుతున్న...

Friday, May 26, 2017 - 06:56

హైదరాబాద్: రాబోయే అయిదేళ్లలో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తాం. ఇది అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వాగ్ధానం. సంపూర్ణ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం మూడేళ్ల పాలన పూర్తి చేసుకుంది. ఈ మూడేళ్లలో నరేంద్రమోడీ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ఇచ్చిన కానుకలేమిటి? వ్యవసాయ రంగం పట్ల మోడీ ప్రభుత్వ విధానాలు ఎలా...

Thursday, May 25, 2017 - 06:52

హైదరాబాద్: గతంలో కేంద్ర ప్రభుత్వాలు దాదాపు 66కు పైగా సంక్షేమ, ఉపాధి కల్పన పథకాలకు రూపకల్పన చేశాయి. వివిధ ప్రజా ఉద్యమాలు, కోర్టు తీర్పుల కారణంగా వీటిలో కొన్ని పథకాలు పురుడు పోసుకున్నాయి. ఆయా పథకాల నిర్వహణలో కొన్ని లోపాలున్నా, సత్ఫలితాలు సాధించిన మాట వాస్తవం. అయితే, కేంద్రంలో నరేంద్రమోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ సంక్షేమ...

Wednesday, May 24, 2017 - 06:50

హైదరాబాద్: రాయలసీమ కరువు సమస్యను పరిష్కరించాలంటూ వామపక్షాల ఇవాళ రాయలసీమ బంద్‌ కు పిలుపునిచ్చాయి. కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో రాయలసీమ బంద్‌ జరుగుతోంది. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి....

Tuesday, May 23, 2017 - 09:06

హైదరాబాద్: ప్రధానిగా నరేంద్రమోడీ వెయ్యిరోజుల పాలన పూర్తి చేసుకున్నారు. ఈ నెల 26వ తేదీకి ఆయన అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తవుతుంది. రెండేళ్లలో మళ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. గడిచిన మూడేళ్ల కాలంలో నరేంద్రమోడీ ప్రభుత్వ పాలనలో జరిగిన మంచి చెడులపై విశ్లేషించుకోవాల్సిన సమయమిది. నరేంద్రమోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమ మీద దాడులు...

Monday, May 22, 2017 - 06:52

ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ వర్కర్లు, ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు. 279, 159, 160 జీవోలను రద్దు చేయాలన్నది మున్సిపల్ వర్కర్ల, ఉద్యోగుల ప్రధాన డిమాండ్. సిఐటియు, ఏఐటియుసి, ఐఎన్ టియుసితో పాటు మరికొన్ని సంఘాలు ఇవాళ్టి సమ్మెలో పాల్గొంటున్నాయి. మున్సిపల్ కార్మికుల సమ్మెపై మాట్లాడేందుకు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు డేవిడ్ విశ్లేషించారు. పూర్తి...

Friday, May 19, 2017 - 06:53

ఇచ్చిన హామీల అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని, అలాగే డబుల్ బెడ్ రూంలు ఇస్తామని చెప్పిన ఇవ్వలేదని, తక్షణమే వీఆర్ఏల జీవో విడుదల చేయాలని తెలంగాణ వీఆర్ఏలు అధ్యక్షడు వంగూలు రాములు అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి. 

 

Thursday, May 18, 2017 - 09:15

హైదరాబాద్ : కార్మికుల నిధులతో తార్నాక ఆసుపత్రి నిర్మించిందని. రూ.30 ఉన్న రోజుల్లో రూ.2 ఆసుపత్రి కోసం సవత్సరాలు తరాబడి ఇచ్చారని తెలంగాణ ఆర్టీసీ స్టాప్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు పీ.ఎస్ రావు అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

Wednesday, May 17, 2017 - 07:29

విత్తనాల నిర్వహన మొత్తం బహుళజాతి కంపెనీల చేతికి వెళ్తున్నాయి. నకిలీ విత్తనాలు అమ్మితే వారిపై కేసుపెట్టకుండా తెలుగు దేశం పార్టీ అడ్డుకుంటుందని జన పథంలో పాల్గొన్న ఏపీ రైతు సంఘం అధ్యక్షుడు కేశవరావు అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

Tuesday, May 16, 2017 - 08:38

ఉద్యోగ భద్రత లేదని ఏపీ కాంట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు బాలకాశి అన్నారు. టెన్ టివి జనపథంలో పాల్గొని మాట్లాడారు. ఆ కారణంగా 120 కాంట్రాక్ట్ , తొలిగించారని ఆయన తెలిపారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

 

 

Monday, May 15, 2017 - 08:54

ప్రజల అభిప్రాయలను ప్రభుత్వాలు పట్టించుకోకుంటే ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉందని న్యూడెమోక్రసీ నేత రంగారావు అన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ధర్నా చౌక్ ద్వారా తెలియజేయాలనికుంటే ప్రభుత్వం మాత్రం ధర్నా చౌక్ లెకుండా చేస్తుందని టెని టివి జనపథంలో పాల్గొన్న ఆయన తెలిపారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

 

Friday, May 12, 2017 - 06:55

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మిషన్ కాకతీయ మూడవ విడత మొదలవుతోంది. ఇప్పటికే రెండు విడతలుగా చెరువుల్లో పూడికతీత, మరమ్మత్తు లాంటి కార్యక్రమాలు చేపట్టారు. తెలంగాణలో 45వేల చెరువులుండగా, ఏడాదికి తొమ్మిదివేల చొప్పున అయిదేళ్లలో అన్ని చెరువుల పూడికతీత పూర్తి చేయాలన్నది తెలంగాణ ప్రభుత్వ సంకల్పం. అయితే, గత...

Thursday, May 11, 2017 - 06:41

హైదరాబాద్: తెలంగాణలో 4637 ప్రభుత్వ స్కూళ్ల మూసివేతకు రంగం సిద్ధమైనట్టు వస్తున్న వార్తలు వస్తుండడంతో విద్యార్థి సంఘాలు భగ్గుమంటున్నాయి. ఇలాంటి ఆలోచనలను విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. తెలంగాణలో 25,966 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. 4137 స్కూళ్లల్లో 20మంది కంటే తక్కువ విద్యార్థులున్నట్టు తెలుస్తోంది. వీటిలో ఆరువేలమందికి పైగా టీచర్లు...

Wednesday, May 10, 2017 - 06:46

హైదరాబాద్: తెలంగాణలో ప్రభుత్వ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు మరోసారి పోరుబాటపట్టేందుకు సమాయత్తమవుతున్నారు. 2016 ఫిబ్రవరిలో కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 16ను హై కోర్టు కొట్టివేసిన నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై దృష్టి సారిస్తున్నారు. 2016 అక్టోబర్ లో...

Tuesday, May 9, 2017 - 06:41

హైదరాబాద్: రాయలసీమ కరవు కష్టాలు చూస్తే గుండె తరక్కుపోతుంది. కరవు నివారణ చర్యలు ఉత్తుత్తి మాటలుగానే మిగిలిపోతున్నాయి. 233 మండలాలున్న రాయలసీమలో 184 మండలాల్లో కరవు వున్నట్టు రాష్ట్ర ప్రభుత్వమే ప్రకటించింది. అనంతపురంలో 345 గ్రామాల్లోనూ, కడపలో 416 గ్రామాల్లోనూ, కర్నూలులో 1200 గ్రామాల్లోనూ నీటి సమస్య తీవ్రంగా వుంది. అసలే కరవు కష్టాలకు తోడు పసుపు...

Monday, May 8, 2017 - 06:34

హైదరాబాద్: ఆశా వర్కర్ల పోరాటం ఫలించింది. ఆలస్యంగానైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్ల డిమాండ్లపై స్పందించింది. ఆశా వర్కర్ల జీతం నాలుగు వేల రూపాయల చొప్పున పెంచుతున్నట్టు ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించారు. దీంతో తెలంగాణలో ఆశా వర్కర్ల జీతం ఆరు రూపాయలకు చేరినట్టయ్యింది. ఆశా వర్కర్లు కనీస వేతనం అమలు చేయాలంటూ 2015 సెప్టెంబర్ లోనే సమ్మెకు...

Friday, May 5, 2017 - 08:40

ప్రయివేట్ డిగ్రీ కాలేజీ యాజమాన్యాలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని ప్రయివేట్ డిగ్రీ కాలేజీ యాజమాన్యాల అసోసియేషన్ నాయకులు రమణారెడ్డి డిమాండ్ చేశారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. 'తెలంగాణలో డిగ్రీ పరీక్షలకు బ్రేక్ పడింది. ఇప్పటికే తెలంగాణ యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీల పరిధిలోని డిగ్రీ పరీక్షలు వాయిదాపడ్డాయి. ఈ నెల 9వ తేదీ నుంచి...

Friday, May 5, 2017 - 08:34

తెలంగాణ యూనివర్సిటీలో డిగ్రీ సెమిస్టర్ పరీక్షలకు బ్రేక్ పడింది. ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చడం లేదంటూ ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు పరీక్షల్ని బహిష్కరించాయి. అధికారులు స్పందించకపోతే ఇకపై ఆన్ లైన్ లో అడ్మిషన్లను సైతం నిర్వహించబోమని తేల్చిచెప్పాయి. 
డిగ్రీ సెమిస్టర్ పరీక్ష వాయిదా
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రెండు లక్షల యాభై వేల మంది...

Pages

Don't Miss