సెమీ ఫైనల్లో ఇరగదీసిన రాయ్‌కు 30% జరిమానా

Submitted on 12 July 2019
Jason Roy fined after explodes being given out

వరల్డ్ కప్ సెమీ ఫైనల్ 2019టోర్నీలో ఇంగ్లాండ్ అద్భుత ప్రదర్శన చేసింది. ఇంగ్లాండ్ ఓపెనర్ జాసన్ రాయ్(85; 65బంతుల్లో 9ఫోర్లు, 5సిక్సులు)తో దూకుడుగా రాణించడంతో జట్టు భారీ తేడాతో గెలుపొందింది. ఫైనల్‌కు చేరిన ఇంగ్లాండ్ సంతోషానికి పట్టపగ్గాలు లేని సమయంలో ఆ జట్టు ఓపెనర్ రాయ్‌కు ఐసీసీ షాక్ ఇచ్చింది. అతని ఫీజులో 30శాతం కోతను విధిస్తున్నట్లు తెలియజేసింది. 

224 పరుగుల లక్ష్య చేధనలో భాగంగా బరిలోకి దిగింది  ఇంగ్లాండ్. ఇన్నింగ్స్‌లో 20వ ఓవర్‌ను కమిన్స్ బౌలింగ్ చేస్తున్నాడు. 3వ బంతిని ఎదుర్కొన్న జాసన్ రాయ్ బ్యాట్‌కు తగలకుండానే కీపర్ చేతిలోకి వెళ్లింది. ఆ విషయం రీ ప్లేలో స్పష్టంగా కనిపించింది. కానీ, అంపైర్ అవుట్‌గా భావించి తప్పుడు నిర్ణయాన్ని ప్రకటించేశాడు. 

దాంతో కాసేపు అంపైర్‌తో వాగ్వాదానికి దిగిన రాయ్.. తప్పని పరిస్థితుల్లో పెవిలియన్ చేరుకున్నాడు. దీనిపై మ్యాచ్ చూసే ప్రేక్షకులతో పాటు నెటిజన్లు సైతం రాయ్‌కు అనుకూలంగా ఉన్నా.. ఐసీసీ ఇది తీవ్రమైన నేరంగా పరిగణించింది. మ్యాచ్ జరుగుతుండగా అంపైర్‌తో ప్రవర్తించిని తీరు ఐసీసీ నియమావళికి విరుద్ధంగా ఉందంటూ తీర్పునిచ్చింది. 

Jason Roy
england
Australia
2019 icc world cup
world cup 2019


మరిన్ని వార్తలు