జియోలో ఫస్ట్ డే.. ఫస్ట్ షో వస్తే.. ధియేటర్లు, మల్టీఫ్లెక్స్ ల పరిస్థితి ఏంటీ?

Submitted on 12 August 2019
Jio First Day, First Show How Mukesh Ambani aims to disrupt entertainment industry with this plan

ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీస్తుంటారు. థియేటర్లలో కొత్త సినిమా రిలీజ్ చేస్తుంటారు. ఫస్ట్ డే.. ఫస్ట్ షో చూసేందుకు ముందుగానే వేల టిక్కెట్లు బుకింగ్ అవుతుంటాయి. మొదటి రెండు వారాలు హౌస్ ఫుల్ బోర్డులు కన్పిస్తుంటాయి. బడా హీరోలయితే చెప్పన్కక్లరేదు. టిక్కెట్లు దొరికే పరిస్థితి ఉండదు. టిక్కెట్ల విక్రయంతోనే సినిమా కలెక్షన్స్ రాబడుతుంటాయి. 

ఇలాంటి పరిస్థితుల్లో మూవీ థియేటర్ కు వెళ్లాల్సిన పనిలేకుండానే ఇంట్లోనే కొత్త మూవీ ఫస్ట్ షో చూసే అవకాశం ఉంటే ప్రతిఒక్కరికి సంతోషమే. హాయిగా ఇంట్లోనే కూర్చొని ఫ్యామిలీతో కలిసి మూవీ వీక్షించవచ్చు. కొత్త మూవీ థియేటర్లలో రిలీజ్ అయిన రోజే ఫస్ట్ షో ఇంట్లో కూడా వీక్షించే అవకాశం జియో కల్పించనుంది. కానీ, ఎంటర్ టైన్ ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? మల్టీ ఫ్లెక్స్‌లు మూగబోవాల్సిందేనా? థియేటర్లు మూసుకోవాల్సిందేనా? ఇలాంటి ఎన్నో సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

మల్టీఫ్లెక్స్‌లు.. మూగబోవాల్సిందేనా?
సినిమా థియేటర్ కు వెళ్లి సినిమా చూడాలంటే ప్రతి ఒక్కరూ టికెట్ కొనాల్సి ఉంటుంది. అదే ఈ సర్వీసు ద్వారా అయితే ఒక్క సబ్ స్ర్కిప్షన్ తీసుకుంటే ఫ్యామిలీ మొత్తం సినిమా ఇంట్లో కూర్చొని చూడొచ్చు. జియో ఫైబర్ సర్వీసు ద్వారా లేటెస్ట్ మూవీలను టీవీల్లోనే వీక్షించగల పరిస్థితి ఉంటే సినిమా థియేటర్లకు వెళ్లేందుకు ఎవరూ ఇష్టపడతారు అనే ప్రశ్న తలెత్తుతోంది.
Read Also : నెలకు రూ.700 మాత్రమే : జియో GigaFiber ఆఫర్లు ఇవే

జియోగిగాఫైబర్ బ్రాడ్ బ్యాండ్ సర్వీసును ఆగస్టు 12న రిలయన్స్ 42వ యానివల్ జనరల్ మీటింగ్ (AGM) సందర్భంగా సంస్థ చైర్మన్ ముఖేశ్ అంబానీ కమర్షియల్ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. జియోగిగాఫైబర్ సర్వీసు ద్వారా ఫస్ట్ డే.. ఫస్ట్ షో చూడొచ్చు. కొత్త మూవీ థియేటర్లలో రిలీజ్ అయిన రోజే ఫస్ట్ షో ఇంట్లో కూడా వీక్షించే అవకాశం జియో కల్పిస్తోంది. ఈ కాన్సెప్ట్... ప్రకటించడం వెనుక ముఖేశ్ అంబానీ అసలు వ్యూహాం ఏంటి? అనేది ఆసక్తికరంగా మారింది. ఇది ఎంతవరకూ సాధ్యపడుతుంది? అనేది కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కొత్త మూవీ చూడాలంటే.. ఆంక్షలు ఉంటాయా? 
కొత్త మూవీ రిలీజ్ కాగానే.. ఎన్ని థియేటర్లు.. కలెక్షన్స్ ఎన్నీ.. సినిమా హిట్టా.. పట్టా అని అంచనాలు వేస్తుంటారు. సినిమా థియేటర్లలో టికెట్ల విక్రయం ఆధారంగా కలెక్షన్లు ఎన్నో ప్రకటిస్తుంటారు. సినిమా హిట్ టాక్ కూడా చెప్పేస్తుంటారు. కొత్త సినిమాలు ఇంట్లోనే కూర్చొని ఫ్యామిలీతో కలిసి చూస్తే అవకాశం కల్పిస్తే వీక్షకులకు సమయం డబ్బు కూడా ఆదా అవుతుంది. ఒక సబ్ స్ర్కిప్సన్ తీసుకుంటారు. ఇంటిల్లాది కూర్చొని వీక్షించే సదుపాయం కల్పించినట్టే కదా.

టీవీల్లో కొత్త సినిమా చూస్తే.. అవకాశం కల్పిస్తే.. ఎలాంటి ఆంక్షలు ఉంటాయో అంబానీ వెల్లడించలేదు. మిర్రరింగ్ సదుపాయం ఉంటుందా? మొబైల్ నుంచి టీవీకి కనెక్ట్ చేసుకోవచ్చా? సెట్ టాప్ బాక్స్ ల్లో సాధారణంగా రికార్డింగ్ ఆప్షన్ ఉంటుంది. ఒకవేళ జియో అందించే బాక్సులో ఉంటే.. కొత్త మూవీ రికార్డింగ్ చేసుకోవచ్చు. ఇలా ఒక సబ్ స్ర్కిప్షన్ తో మూవీ అందరూ చూసే అవకాశం ఉంది? కొత్త సినిమాలను మొదటిరోజే ఇంట్లో కూర్చొని వీక్షించడం నిజానికి సగటు ప్రేక్షకుడికి ఎంతో సులభంగా ఉంటుంది. 

ఎంటర్ టైన్ మెంట్ ఇండస్ట్రీపై ఎఫెక్ట్ ? :
ప్రేక్షకులకు సమయం, డబ్బు ఆదా అవుతుంది. కానీ, ఎంటర్ టైన్ మెంట్ ఇండస్ట్రీ‌పై ఎఫెక్ట్ పడుతుంది కదా? అనే ప్రశ్న తలెత్తుతోంది. విశ్లేషకుల అంచనా ప్రకారం.. ఫస్ట్ డే.. ఫస్ట్ షో కాన్సెప్ట్ లో ఏదైనా ఆంక్షలు ఉండి ఉండే అవకాశం లేకపోలేదు. ఒకసారి మాత్రమే.. ఫస్ట్ డేనే కొత్త మూవీ వీక్షించే అవకాశం ఉంటుందా? చూడాలనుకున్న ప్రతిసారీ మూవీ ఎన్నిసార్లు అయినా చూడొచ్చా? అలా చూడటానికి ఇంకా ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఉంటాయా? తెలియాల్సి ఉంది.

జియో ఫైబర్ యాక్టివేషన్ ఉన్న ప్రతి యూజర్.. కొత్త మూవీ చూడాలంటే.. థియేటర్లలో టికెట్ కొన్నట్టుగానే ఫస్ట్ డే షోకు కూడా పేమెంట్ చేయాల్సి ఉంటుందా? చూసిన ప్రతిసారి పేమెంట్ చేసి మూవీ చూడాలా? లేదా ఒకసారి పే చేస్తే ఎన్నిసార్లు అయినా చూడొచ్చా? ఈ సందేహాలన్నింటికి సమాధానం దొరకాలన్నా.. జియో ఫైబర్ ఫ్రీమియం కస్టమర్లు నేరుగా ఇంట్లోనే కొత్త మూవీలు రిలీజ్ డే రోజు వీక్షించాలన్నా 2020 వరకు వేచి చూడాల్సిందే. 

జియో అందించబోయే కొత్త టారిఫ్స్‌కు సంబంధించి పూర్తి వివరాలు సెప్టెంబర్ 5, 2019 నుంచి అందుబాటులో ఉండనున్నాయి. jio.com, Myjio అప్లికేషన్ ద్వారా డేటా టారిఫ్‌ల వివరాలు తెలుసుకోవచ్చునని RIL ఒక ప్రకటనలో తెలిపింది. 
Read Also : ఫస్ట్ డే.. ఫస్ట్ షో.. సినిమా ఇంట్లోనే చూడవచ్చు : జియో సంచలన ఆఫర్

Mukesh Ambani
Ambani aim
disrupt entertainment industry
Data plan
Jio Fiber users
Jio First Day First Show
Jio GigaFiber 

మరిన్ని వార్తలు