అంబానీ ఆఫర్.. లైట్ తీసుకున్న PVR, INOX

Submitted on 13 August 2019
Jio First Day First Show movie plan: What PVR, Inox have to say

రిలయన్స్ జియో గిగాఫైబర్ సర్వీసు ద్వారా 'ఫస్ట్ డే ఫస్ట్ షో' ప్రీమియం ఆఫర్ ప్రకటించింది. 2020 నుంచి కొత్త సినిమాలు ఇంట్లోనే కూర్చొని చూడొచ్చునని రిలయన్స్ ఇండస్ట్రీస్ 42 వ AGMలో చైర్మన్ ముఖేష్ అంబానీ సంచలన ప్రకటన చేశారు. అందరూ ఇంట్లోనే కూర్చొని కొత్త మూవీ చూస్తే.. థియేటర్లకు వెళ్లేదెవరు.. మల్టీఫెక్స్‌ల పరిస్థితి ఏంటి? థియేటర్లపై ప్రభావం పడుతుంది కదా? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. ప్రేక్షకులకు ఇదో ఎంతో సంతోషం కలిగించే విషయం అయినప్పటికీ.. ఎంటర్ టైన్ మెంట్ ఇండస్ట్రీపై ప్రభావం పడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. జియో ప్రకటన‌పై మల్టీప్లెక్స్ ప్లేయర్లు మాత్రం విశ్వాసంతో ఉన్నాయి. 
Read Also : జియోలో ఫస్ట్ డే.. ఫస్ట్ షో వస్తే.. ధియేటర్లు, మల్టీఫ్లెక్స్ ల పరిస్థితి ఏంటీ?

జియో అందించే disruptive concept ఆఫర్‌ను దేశ దిగ్గజ మల్టీప్లెక్స్‌ ఆపరేటర్లు PVR, INOX మాత్రం లైట్ తీసుకున్నాయి. దేశవ్యాప్తంగా PVR దాదాపు 800 స్రీన్లు రన్ చేస్తోంది. కస్టమర్లను కూడగట్టుకునేందుకు జియో అమలు చేస్తోన్న కొత్త వ్యూహంపై PVR, INOX స్పందించాయి. దేశంలో అతిపెద్ద మల్టీప్లెక్స్ ఆపరేటర్ పీవీఆర్ స్పందిస్తూ.. థియేట్రికల్, హోమ్ రెండు పూర్తిగా భిన్నమైన విషయాలుగా పేర్కొంది. ప్రతి ఒక్కటి తమ సొంత స్థలాలను అనుసరించి ప్రత్యేకమైన అనుభవాన్ని పొందుతారని అభిప్రాయపడింది.

సినిమా కంటెంట్.. నిర్మాతకే రైట్ : INOX
మరోవైపు దేశంలో 600 మూవీ స్క్రీన్‌లను రన్ చేస్తున్న INOX స్పందిస్తూ.. సినీ నిర్మాతలు, పంపిణీదారులు, మల్టీప్లెక్స్ యజమానులు ఒక సినిమా థియేట్రికల్ రిలీజ్, మరే ఇతర ప్లాట్‌ఫామ్‌లో విడుదల చేయాలన్నా.. 8 వారాల ప్రత్యేకమైన థియేట్రికల్ పరస్పరం అంగీకరించినట్టు తెలిపింది. ఒక సినిమాకు ఆ చిత్ర నిర్మాతే క్రియేటీవ్ కంటెంట్ యజమాని. తన సినిమా కంటెంట్ పంపిణీ చేసేందుకు ఎక్కడ ఏ ప్లాట్ ఫాం ఎంచుకోవాలనే రైట్ అతడికే ఉంటుందని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పొందుపరిచినట్టు ఐనాక్స్ అభిప్రాయపడింది. 

ఒకే Timeలో విడుదల.. ఉల్లంఘనే : PVR 
ఈ ప్రత్యేకమైన థియేట్రికల్ విండోను దృష్టిలో ఉంచుకుని నిర్మాత.. థియేటర్ ఎగ్జిబిషన్ లేదా మరే ఇతర ప్లాట్‌ఫారమ్‌లోనో తన చిత్రాన్ని విడుదల చేయవలసి ఉంటుంది. ఎందుకంటే రెండింటిపై ఏకకాలంలో విడుదల చేస్తే.. మ్యూటవల్లీ అగ్రీడ్ ఎక్స్ క్లూజీవ్ థియేట్రికల్ విండో ఉల్లంఘన కిందకు వస్తుందని INOX తెలిపింది. వినోద రంగానికి సినిమా హాళ్ల సహకారంపై కీలక గణాంకాలను పివిఆర్ సినిమాస్ ప్రస్తావించింది. ఫిక్కీ నివేదికను ఉటంకిస్తూ.. 2018 సంవత్సరంలో మొత్తం రూ .174.5 బిలియన్ల ఎంటర్ టైన్‌మెంట్ ఆదాయంలో థియేటర్లలో 75 శాతం వాటా ఉందని PVR సినిమాస్ ఒక ప్రకటనలో తెలిపింది. 

జియో ప్రకటన.. క్షీణించిన PVR, INOX షేర్లు :
సెప్టెంబర్ 5 నుంచి జియో గిగాఫైబర్‌ సర్వీసు కమర్షియల్ లాంచ్ కానున్నట్టు అంబానీ సోమవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. జియో ఫైబర్ ప్రీమియం భాగంగా - జియో ఫస్ట్ డే ఫస్ట్ షో - కస్టమర్లు కొత్త సినిమా విడుదల రోజున వారి ఇంట్లోనే కూర్చొని సినిమాలు చూడవచ్చు. ఈ సర్వీసు 2020 మధ్యలో ప్రారంభం కానుంది. జియో సంచలన ప్రకటనతో PVR 2.45 శాతం, ఐనాక్స్ 2 శాతం పడిపోవడంతో రెండు మల్టీప్లెక్స్ ఆపరేటర్ల షేర్లు సెషన్‌లో క్షీణించాయి. 
Read Also : నెలకు రూ.700 మాత్రమే : జియో GigaFiber ఆఫర్లు ఇవే

JIO
First Day
first show
movie plan
PVR
inox
AGM

మరిన్ని వార్తలు