Jio GigaFiber వెరీ చీప్ : రూ.2వేలకే కొత్త కనెక్షన్ ఆఫర్!

Submitted on 11 June 2019
Jio GigaFiber becomes cheaper than ever before, New pricing offers

రిలయన్స్ జియో మొబైల్ డేటా సంచలనం.. యూజర్లను ఆకట్టుకునేందుకు కొత్త బ్రాడ్ బ్యాండ్ సర్వీసుపై చీపెస్ట్ ప్లాన్ ఆఫర్ తో ముందుకొస్తోంది. ఇతర నెట్ వర్క్ లకు పోటీగా జియో బ్రాడ్ బ్యాండ్ సర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చింది. జియో గిగాఫైబర్ సర్వీసు ఇప్పటికీ అధికారికంగా లాంచ్ కానప్పటికీ.. Preview Offer కింద వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది.

2018 ఏడాదిలోనే ఈ కొత్త బ్రాడ్ బ్యాండ్ సర్వీసును జియో ప్రవేశపెట్టింది. హైస్పీడ్ ఇంటర్నెట్ స్పీడ్ తో పాటు వీడియో స్ట్రీమింగ్ సర్వీసు ప్లాట్ ఫాం Netflix సర్వీసు కూడా ఆఫర్ చేస్తోంది. జియో గిగాఫైబర్.. ప్రివ్యూ ఆఫర్ కింద యూజర్లకు ఫ్రీ సర్వీసుతో అందుబాటులో ఉంది. 

సెక్యూరిటీ డిపాజిట్ రూ.4వేల 500 :
కానీ, గిగాఫైబర్ కస్టమర్లు ఈ కొత్త కనెక్షన్ యాక్టివేట్ చేసుకోవాలంటే ముందుగా సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.4వేల 500 చెల్లించాల్సి ఉంటుంది. గిగా ఫైబర్ కమర్షియల్ గా లాంచ్ అయ్యే వరకు ప్రివ్యూ ఆఫర్ యూజర్లు అదనంగా సబ్ స్ర్కిప్షన్ ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది.

కొత్త ప్లాన్.. రూ.2వేల 500 మాత్రమే :
గతవారమే జియో.. ప్రివ్యూ ఆఫర్ ను తగ్గింపు ధరకే అందిస్తున్నట్టు ప్రకటించింది. ప్రివ్యూ ఆఫర్ కింద గిగా ఫైబర్ కనెక్షన్ కేవలం రూ.2వేల 500లకు మాత్రమే పొందవచ్చునని చాలామంది యూజర్లు సోషల్ మీడియా వేదికగా తెలిపారు. సెక్యూరిటీ డిపాజిట్ చేసిన గిగాఫైబర్ సబ్ స్ర్కైబర్ల కంటే రూ.2వేలు తక్కువ. ఈ కొత్త ప్లాన్ పై జియో అధికారికంగా ఎలా ప్రకటన చేయలేదు. 

జియో అందించే గిగాఫైబర్ హై ప్రైస్ ప్లాన్... చీపర్ ప్లాన్ తో పోలిస్తే డేటా స్పీడ్, బెనిఫెట్స్ పరంగా తేడా ఉంటే అవకాశం ఉంది. చీపెస్ట్ ప్లాన్ యాక్టివేట్ చేసుకున్న యూజర్లకు.. హై ప్లాన్ యాక్టివేట్ చేసుకున్న యూజర్లు పొందే డేటాలో వ్యత్యాసం ఉంటుందని కొన్ని మీడియా నివేదికలు సూచిస్తున్నాయి. అవేంటో ఓసారి చూద్దాం..

1. స్పీడ్ తగ్గుతుంది : 
పాత ప్లాన్ రూ.4వేల 500 సెక్కూరిటీ డిపాజిట్ చేసిన యూజర్లు పొందే ఇంటర్నెట్ స్పీడ్ 100Mbps వరకు ఉంటుంది. చీపర్ ప్లాన్ రూ.2వేల 500 ప్లాన్ యూజర్లకు ఇంటర్నెట్ స్పీడ్ 50Mbpsకు తగ్గిపోతుంది. అంటే.. గిగాఫైబర్ అందించే ఫుల్ స్పీడ్ లో సగానికి తగ్గినట్టే. 

2. లోయర్ స్పెషిఫికేషన్ Wi-Fi రూటర్ : 
చీపర్ ప్లాన్ ఆఫర్ లో కూడా ఇన్ఫిరియర్ Wi-Fi రూటర్ పొందవచ్చు. కానీ, ఈ రూటర్ సింగల్ బ్యాండ్ ఛానెల్స్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. దీంతో 2.4GHz మాత్రమే కనెక్షన్ యాక్సస్ చేసుకోవచ్చు. హై స్పీడ్ ప్లాన్ లో మాత్రం జియో.. డ్యుయల్ బ్యాండ్ రూటర్ తో హైస్పీడ్ నెట్ ను ఆఫర్ చేస్తోంది. బేసిక్ బెనిఫెట్స్ మాత్రం రెండు ప్లాన్లలోనూ ఒకేలా ఉంటుంది. 

3. 100GB డేటా అప్లికేబుల్ : 
హై ఎండ్ ప్లాన్, చీపర్ ప్లాన్ యాక్సస్ చేసుకున్నప్పటకీ... ఈ రెండు ప్లాన్ యూజర్లకు జియో.. ప్రస్తుతం నెలకు 100GB డేటాను అన్ని అదనపు కూపన్లతో కలిపి ఆఫర్ చేస్తోంది. 

4. Voice సర్వీసెస్.. Jio TV యాప్ :
రూ.2వేల 500 చీపర్ ప్లాన్ యూజర్లు.. గిగాఫైబర్ కనెక్షన్ ద్వారా వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. Jio TV app కూడా అందుబాటులో ఉంది. పాత ప్లాన్ యూజర్లకు మాత్రం వాయిస్ సర్వీసు అందుబాటులో లేకపోవడం గమనార్హం. 

Jio GigaFiber
cheaper plan
New pricing offers
reliance jio

మరిన్ని వార్తలు