మోడీ చేసిన అభివృద్ధి చూసి బీజేపీలో చేరుతున్నారు : కాలికి గాయం వల్ల గరికపాటి రాలేకపోయారు

Submitted on 20 June 2019
jp nadda reaction on tdp mps joinings

ప్రధాని మోడీ చేసిన అభివృద్ధిని చూసి ఇతర పార్టీలు వారు బీజేపీలో చేరుతున్నారని బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా అన్నారు. జేపీ నడ్డా సమక్షంలో టీడీపీకి చెందిన ముగ్గురు ఎంపీలు బీజేపీలో చేరారు. రాజ్యసభ ఎంపీలు సుజనాచౌదరి, టీజీ వెంకటేష్, సీఎం రమేష్ లకు బీజేపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు జేపీ నడ్డా. మరో ఎంపీ గరికపాటి మోహన్ రావు.. అనారోగ్యం కారణంగా రాలేకపోయారు. కాలికి గాయం వల్ల గరికపాటి మోహన్ రావు రాలేకపోయారని నడ్డా చెప్పారు. ఏపీ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని నడ్డా చెప్పారు.

ఏపీ ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని నడ్డా ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ అభివృద్ది కోసమే నలుగురు ఎంపీలు బీజేపీలో చేరారని చెప్పారు. టీడీపీ నేతల చేరికలతో ఏపీలో బీజేపీ పునాదులు బలపడ్డాయని నడ్డా అన్నారు. ప్రధాని మోడీ నాయకత్వం నచ్చే నలుగురు టీడీపీ ఎంపీలు బీజేపీలో చేరారని అన్నారు.


తమ ప్రాంతాల అభివృద్ది కోసమే టీడీపీని వీడి బీజేపీలో చేరామని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ చెప్పారు. ప్రభుత్వంలో ఉంటే నియోజకవర్గాలను అభివృద్ధి చేసుకోవచ్చన్నారాయన. ప్రజాభిప్రాయం మేరకు తాము ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. రాజ్యసభలో బీజేపీకి బలం తక్కువగా ఉందన్న టీజీ.. బీజేపీకి బలం పెరగాల్సిన అవసరం ఉందన్నారు. తాము బీజేపీలో చేరడం.. తమకే కాదు.. బీజేపీకి కూడా లాభమే అన్నారు. రాజ్యసభలో బలపడితే కీలకమైన బిల్లులు పాస్ చేసుకోవచ్చన్నారు. గతంలో తనకు బీజేపీతో అనుబంధం ఉందని ఎంపీ టీజీ వెంకటేష్ గుర్తు చేశారు. విద్యార్థి నాయకుడిగా ఏబీవీపీలో పని చేశానని చెప్పారు.

JP NADDA
TDP
MPs
rajyasabha mps
BJP
Sujana Chowdary
CM Ramesh
tg venkatesh
garikapati rammohan rao

మరిన్ని వార్తలు