18, 19 తేదీల్లో టీఎస్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు

Submitted on 11 July 2019
July 18 and 19 Telangana AssemblyTelangana Assembly Meeting Over Municipal Act

రెండు రోజుల పాటు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ కానుంది. జులై 18, 19వ తేదీల్లో సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొత్త మున్సిపల్ చట్టం అమలు కోసం ప్రత్యేకంగా సమావేశాలు జరుగుతున్నాయి. జులై 18న మున్సిపల్ చట్టం బిల్లును శాసనసభలో ప్రవేశ పెట్టనున్నారు. అనంతరం 19వ తేదీన దీనికి సభ ఆమోదం తెలుపనుంది. అదే రోజున శాసనమండలిలోనూ కొత్త మున్సిపల్ చట్టం బిల్లును ప్రవేశ పెట్టనుంది ప్రభుత్వం. 

రాబోయే మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మున్సిపల్ చట్టాన్ని రూపొందించింది. రెండు..మూడు రోజులుగా సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా దీనిపై చర్చిస్తున్నారు. ముసాయిదా చట్టానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం న్యాయాధికారులు దీనిని పరిశీలిస్తున్నారు. సభలో బిల్లుకు ఆమోదముద్ర పడిన వెంటనే అది చట్టంగా మారనుంది. ఇప్పటికే మున్నిపల్ ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే..చట్టం అమల్లోకి వచ్చాకే ఎన్నికలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దీంతో కొత్త చట్టం వచ్చిన తర్వాతే..ఎన్నికలు జరుగనున్నాయి. 

July 18
Telangana Assembly
meeting
Municipal Act

మరిన్ని వార్తలు