చిరుతిళ్ళ పోటీకి రండి : రూ.4.27 లక్షలు గెల్చుకోండి!

Submitted on 17 July 2019
Junk Food : Can earn Rs 4.27 lakh by just eating pasta, chips and bread for 30 days

జంక్ ఫుడ్ బాగా తినే అలవాటు ఉందా? అయితే మీరే లక్షాధికారి. ఎంత తింటే అంత సంపాదించవచ్చు. జంక్ ఫుడ్ తినేవారి కోసం ఫీల్స్ ఫుడ్ ఎక్స్‌పర్మెంట్ మల్టీవిటమిన్ కంపెనీ చిరుతిళ్ళ పోటీలు పెట్టింది. ఈ పోటీలో పాల్గొనేవారంతా జంక్ ఫుడ్ తినాల్సి ఉంటుంది. 30 రోజుల పాటు క్రమం తప్పకుండా డైట్ చేయాలి. సింగల్ మిల్ కూడా తప్పకుండా ఈ డైట్ కంటిన్యూ చేయాలి. ఇందులో పాస్తా, చిప్స్, బ్రెడ్, మిఠాయి, వివిధ రకాల వేయించిన పదార్థాలు ఉంటాయి. 

చిరుతిళ్ళ పోటీలో గెలిచినవారికి 5వేల పౌండ్లు (రూ.4.27 లక్షలు) గెలుచుకునే అవకాశం ఉంది. ఈ ప్రయోగంలో పోషణవిజ్ఞాన నిపుణుడు, ఒక వైద్యుడు ఉంటారు. పోటీలో పాల్గొనే వ్యక్తికి జంక్ ఫుడ్ డైట్‌లో భాగంగా ప్రతిరోజు ఒక మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ తీసుకోవాల్సి ఉంటుంది. 30 రోజుల వ్యవధిలో పోషకాహార స్థాయిని పరీక్షించడం ద్వారా కంపెనీ ఉత్పత్తి చేసే మల్టీవిటమిన్లలో 18 ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలను డెలివరీ చేస్తాయని నిరూపించడమే ప్రయోగం ఉద్దేశ్యం. ‘మనిషి జీవనంలో అన్ని రకాల విటమిన్లు, పోషకహార విలువలు పొందాలంటే చాలా కష్టంగా మారుతోంది. 

పోషక ఆహార సమతుల్యతను మెరుగుపర్చడానికి ఎన్నో ఆప్షన్లు ఉన్నాయి. కచ్చితమైన డైట్ అంటూ ఒకటి ఉందనడానికి ఎలాంటి అవకాశం లేదు. మల్టీవిటమన్ ఒకటే అందుకు సరైన పరిష్కారం’ అని ఫీల్ కంపెనీ వ్యవస్థాపకుడు బోరిస్ హోడేకల్ తెలిపారు. హెల్తీ డైట్ తీసుకునే ఆహారానికి బదులుగా తమ మల్టీవిటమిన్ తీసుకోవాలని ఎవరిని ప్రోత్సాహించాలనుకోవడం లేదని, తమ ప్రొడక్టు ఎంత ప్రభావంతంగా పనిచేస్తుందో నిరూపించేందుకే ఈ అధ్యయనం చేస్తున్నట్టు ఆయన చెప్పారు. ల్యాబ్ వంటి నియంత్రణ వాతావరణంలో టెస్టులో వచ్చిన ఫలితాలు కంటే.. రియాల్టీగా వచ్చే ఫలితాలు ఎంతో విశ్వాసాన్ని నింపుతాయని హోడేకల్ తెలిపారు.

పబ్లిక్ నుంచి ముగ్గురు వ్యక్తులను రిక్రూట్ చేసుకోవాలని అనుకుంటున్నాం. తక్కువగా డైట్ తినే వారే కావాలి. నెలపాటు జంక్ ఫుడ్ తినాల్సి ఉంటుంది. ప్రతిరోజు మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ తీసుకోవాల్సి ఉంటుంది’ అని ఫీల్స్ అధికారిక వెబ్ సైట్లో సమాచారం ఉంది.

ఆసక్తి ఉన్న అభ్యర్థులు 18ఏళ్ల లోపు వయస్సు ఉన్న ఎవరైనా ఈ పోటీలో పాల్గొనవచ్చు. ఆరోగ్యపరమైన సమస్యలు ఉండకూడదు. ఎలాంటి మెడికల్ ట్రీట్ మెంట్ వంటివి తీసుకుంటూ ఉండకూడదు. పుష్టిగా ఆరోగ్యం ఉన్నవారికే అధిక ప్రాధాన్యం ఉంటుందని కంపెనీ తమ వెబ్ సైట్లో ఉంచింది. 

pasta
chips
bread
eating Junk Food
Junk Food Competition
Feel’s food experiment
multivitamin company

మరిన్ని వార్తలు