సంకీర్ణ ప్రభుత్వం సేఫ్...ఎమ్మెల్యేలను భయపెట్టారన్న స్పీకర్

Submitted on 11 July 2019
Karnataka Speaker: They (rebel MLAs) told me that some people had threatened them

కొన్ని రోజులుగా ముంబైలో ఉంటున్న కర్ణాటక రెబల్ ఎమ్మెల్యేలు సుప్రీం ఆదేశాల ప్రకారం ఇవాళ(జులై-11,2019) బెంగళూరు వెళ్లి అసెంబ్లీ స్పీకర్ కేఆర్ రమేష్ ని కలిశారు. రెబల్ ఎమ్మెల్యేలతో సమావేశం అనంతరం విధానసౌధలో స్పీకర్ మీడియాతో మాట్లాడుతూ....రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాల విషయంలో జరగాల్సిన ప్రక్రియను ఆలస్యం చేస్తున్నానని కొన్ని వార్తలు చూసి నేను హర్ట్ అయ్యాను.జులై-6,2019న గవర్నర్ నాకు సమాచారమిచ్చారు.

అప్పటివరకు తాను ఆఫీస్ లోనే ఉన్నానని,రెబల్ ఎమ్మెల్యేలు తనను కలవలేదని,మధ్యాహ్నాం 1:30గంట వరకు ఉండి ఆరోజు వ్యక్తిగత కారణాలతో తాను ఆఫీస్ నుంచి వెళ్లిపోయానని,ఆఫీస్ వదిలి వెళ్లే వరకు ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా మిమ్మల్ని కలవడానికి వస్తున్నాం అని తనకు సమాచారమివ్వలేదని స్పీకర్ తెలిపారు. తాను బయటికి వెళ్లిన తర్వాత 2గంటల సమయంలో ఎమ్మెల్యేలు తన ఆఫీస్ కి వచ్చారని,.వాళ్లు సరైన విధంగా అపాయింట్ మెంట్ కూడా తీసుకోలేదన్నారు.

అందువల్ల వాళ్లు వస్తున్నారని తాను పారిపోయానని అనడం నిజం కాదని స్పీకర్ అన్నారు. కర్ణాటక అసెంబ్లీ రూల్స్,నిబంధనల ప్రకారం సోమవారం ఎమ్మెల్యేల రాజీనామాలను పరిశీలించానని, అయితే 8మంది రాజీనామాల లేఖలు సరైన విధంగా లేవన్నారు. మిగిలిన వాటి విషయంలో, రాజీనామాలు స్వచ్ఛందంగా మరియు నిజమైనవిగా ఉన్నాయో లేదో చూడాలని, రాజీనామాల స్వచ్ఛంద, నిజమైన స్వభావం గురించి ఇప్పుడు మాట్లాడనని స్పీకర్ తెలిపారు.

రెబల్ ఎమ్మెల్యేలు తనతో ఏ విధమైన కమ్యూనికేషన్ లేకుండా నేరుగా వెళ్లి గవర్నర్ ని కలిశారని,గవర్నర్ ఏం చేయగలడని స్పీకర్ ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు తనని కలవకుండా సుప్రీంకోర్టుకెళ్లారని ఆయన అన్నారు.కర్ణాటక రాష్ట్ర ప్రజలకు,రాజ్యాంగానికి  తాను బాధ్యుడినని ఆయన తెలిపారు.కన్నడ భూమిని ప్రేమిస్తున్నాను కాబట్టి ఆలస్యం చేస్తున్నానని, తొందరపడి నటించడం లేదని ఆయన అన్నారు.రెబల్ ఎమ్మెల్యేలు ఇవాళ సరైన విధంగా రాజీనామాలు ఇచ్చారని,అయితే వాటి విషయంలో నిర్ణయం తీసుకోవడానికి కొంత సమయం పడుతుందని ఆయన అన్నారు.రెబల్ ఎమ్మెల్యేల రాజీనామా లేఖలను రాత్రంతా పరిశీలించాల్సిన అవసరముందని,అవి నిజమైనవని నిర్థారించుకోవాలన్నారు.


సుప్రీంకోర్టు తనను రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాల విషయంలో నిర్ణయం తీసుకోవాలని కోరిందని,ఎలాంటి అపవాదు రాకూడదనే ఎమ్మెల్యేలు తనని కలిసిన సమయంలో  ప్రతిదీ వీడియో తీసినట్లు చెప్పారు. దీన్ని తాను సుప్రీంకి అందజేయనున్నట్లు తెలిపారు. కొంతమంది తమను బెదిరించారని రెబల్ ఎమ్మెల్యేలు తనకుచెప్పారని,వారు భయంతో ముంబై వెళ్ళారని, కానీ వారు నన్ను సంప్రదించి ఉండాల్సిందని,వారికి తాను రక్షణ కల్పించేవాడినని అన్నారు. కేవలం 3 పనిదినాలు గడిచిపోయాయని, కానీ వాళ్లు ఏదో భూకంపం సంభవించినట్లు వారు ప్రవర్తించారని స్పీకర్ రమేష్ అన్నారు.
 

karnataka
Speaker
Assembly
rebel mla's
resignation
meet
kr ramesh
threatened
Mumbai
protection


మరిన్ని వార్తలు