15న కేసీఆర్ నామినేషన్ ?..

08:28 - November 9, 2018

హైదరాబాద్ : తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నామినేషన్ ముహూర్తం ఖరారైనట్లుగా తెలుస్తోంది. కేసీఆర్ తో పాటు పలువురు టీఆర్ఎస్  అభ్యర్థులు కూడా  నామినేషన్ల దాఖలుకు మహూర్తాలను ఖరారు చేసుకుంటున్నట్లు తెలిసింది. ఈ నెల 12 నుంచి నామినేషన్ల దాఖలు ప్రారంభమవుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈనెల 15న  నామినేషన్‌ దాఖలు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. కాగా కేసీఆర్ లక్కీ నంబర్ 6 కాబట్టి ఆయన ఆరోజునే నామినేషన్ వేస్తారని రాజకీయ వర్గాల సమచారం.  ఈ మేరకు కొందరు పండితులు శుభముహూర్తంగా సీఎంకు చెప్పారని తెలిసింది. శుక్రవారం మరోసారి చర్చించి తేదీని ఖరారు చేయనున్నారు. గజ్వేల్‌ నుంచి పోటీ చేస్తున్న కేసీఆర్‌ ముందుగా కోనాయపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు చేసిన అనంతరం స్వయంగా ఆయనే నామినేషన్‌ దాఖలు వేసే వీలుంది. ఈనెల 12, 14, 16, 18 తేదీల్లో మంచి ముహూర్తాలున్నాయని.. ఎక్కువమంది వాటివైపు మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. ఈ నెల 11న తెరాస అభ్యర్థులకు బి-ఫారాలు ఇచ్చేందుకు అధిష్ఠానం సన్నాహాలు చేస్తోంది. పదో తేదీన కోనాయపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయంలో ముందుగా బి-ఫారాలకు పూజలు చేయించి, తీసుకొని వెళ్తారని తెలిసింది. 11న తెలంగాణభవన్‌కు కొంతమంది అభ్యర్థులను పిలిచి బి-ఫారాలు ఇస్తారు. ఆరోజు నుంచి వాటినిఅందుబాటులో ఉంచుతారు.
 

 

Don't Miss