శ్రీలంక నుంచి కేర‌ళ‌కి ఐసిస్ ఉగ్ర‌వాదులు!

Submitted on 26 May 2019
Kerala coast on alert after intel on ISIS movement, Coast Guard deployed

దాదాపు 15మంది ఐసిస్ ఉగ్ర‌వాదులు తెల్ల‌రంగు ప‌డ‌వ‌లో శ్రీలంక నుంచి పడవల్లో  బయల్దేరినట్లు నిఘా సమాచారం అందినట్లు కేరళ పోలీసులు తెలిపారు. ఈ పడవలు లక్షద్వీప్,మినిసోయ్ దీవుల‌ వైపు వెళ్తున్నట్లు నిఘా నివేదికలు వెల్లడించాయని తెలిపారు.  కేరళ తీరం వెంబడి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించినట్లు తెలిపారు. తీర ప్రాంతంలోని పోలీస్ స్టేషన్లు, జిల్లా పోలీస్ చీఫ్‌లను అల‌ర్ట్ చేశామన్నారు.
 
పోలీసు శాఖలోని విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం....ఇటువంటి హెచ్చరిక సందేశాలు తరచూ వస్తూ ఉంటాయని, అయితే ఈసారి కచ్చితమైన సమాచారాన్ని నిఘా వర్గాలు తెలిపినట్లు తెలుస్తోంది. అనుమానాస్పద పడవలు వచ్చే అవకాశం ఉందని, వాటిని పసిగట్టి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శ్రీలంక నుంచి ఈ నెల 23న ఈ నిఘా సమాచారం అందింది.

ఏప్రిల్-21,2019న శ్రీలంకలో ఉగ్ర దాడులు జరిగినప్పటి నుంచి తాము అప్రమత్తంగానే ఉంటున్నామని కేరళ పోలీసులు తెలిపారు. ఐసిస్ ఉగ్ర‌వాదులు భార‌త జ‌లాల్లోకి ప్ర‌వేశించ‌కుండా రెండు దీవుల‌ స‌రిహ‌ద్దు జ‌లాల ద‌గ్గ‌ర  ఇండియ‌న్ కోస్ట్ గార్డ్ ఇప్ప‌టికే  షిప్ ల‌ను,స‌ముద్ర త‌నిఖీ ఎయిర్ క్రాఫ్ట్ ను రంగంలోకి దించింది. ఏప్రిల్-21,2019న శ్రీలంకలో ఐసిస్  ఉగ్రవాదులు జ‌రిపిన వ‌రుస బ్లాస్ట్ ల‌లో 250మందికి పైగా ప్రాణాలు కోల్పోగా 500మందికిపైగా  గాయ‌ప‌డిన విష‌యం తెలిసిందే.

kerala
coast
alert
after intel
ISIS
MOVEMENT
Coast Guard
deployed
maritime aircraft
ships
SriLanka

మరిన్ని వార్తలు