బక్రీద్ కు అసలైన అర్థం ఇదే : చిరు వ్యాపారి పెద్ద మనసు

Submitted on 12 August 2019
Kerala Garment Seller Naushad,Bakrid festival's meaning Donates All His Fresh Stock to Flood Victims

బక్రీద్ అంటే త్యాగం..త్యాగానికి ప్రతీకగా నిలుస్తుంది బక్రీద్ పండుగ. బక్రీద్ పండుగ అంటే కొత్త బట్టలు కుట్టించుకోవటం..గొర్రెల్ని కోసుకుని మాంసం వండుకుని తినటమే కాదు..త్యాగం..అంటే ఏదో ఆస్తులన్నీ పంచేయటం కాదు..తనకు ఉన్నంతలో పేదలకు పంచటం..కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవటమే బక్రీద్ పండుగకు  అసలైన అర్థం. బక్రీద్ అంటే త్యాగం అని చెప్పటమే కాదు చేసి తన దాతృత్వాన్ని చాటుకున్నాడు ఓ వ్యాపారి.

బక్రీద్ పండుగకు ప్రతీ ముస్లిం తప్పనిసరిగా కొత్త బట్టలు కొనుక్కుంటారు. దీంతో బట్టల వ్యాపారానికి మంచి డిమాండ్ ఉంటుంది. దీన్ని క్యాష్ చేసుకునేందుకు బట్టల వ్యాపారులంతా పోటీ పడుతుంటారు. కేరళలోని  ఎర్నాకుళంలోని మఠాన్ చేరిలో నౌషాద్ బట్టల వ్యాపారం చేస్తుంటాడు. నౌషాద్ అనే వ్యాపారి కూడా ఈద్ మార్కెట్‌లో అమ్మేందుకు భారీ స్థాయిలో బట్టలు కొన్నాడు. కానీ కేరళలో ఉన్న వరద పరిస్థితులు గుర్తుకొచ్చాయి.

అందరు బాధలల్లో ఉంటే తాను వ్యాపారం చేసి పండగను క్యాష్ చేసుకునేందుకు నౌషాద్ మనస్సు ఒప్పుకోలేదు. కట్టుకోవటానికి బట్టలు..నిలువ నీడ లేకుండా అల్లాడిపోతున్న బాధితులకు తనవంతుగా ఏదైనా చేయాలనుకున్నాడు. వ్యాపారం చేద్దామని తెచ్చిన బట్టల స్టాక్ మొత్తాన్ని వరద బాధితులకు ఇచ్చేశాడు. చిరువ్యాపారి అయిన నౌషాద్ పెద్ద మనస్సుకు సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

వదర బాధితుల్ని ఆదుకోవటానికి  నటుడు రాజేష్ శర్మ ఆధ్వర్యంలో కొంతమంది స్వచ్ఛంద సేవకులు సామగ్రిని సేకరించి మలబార్ ప్రాంతానికి పంపుతున్నారనే విషయాన్ని నౌషద్ విన్నాడు. వెంటనే వారిని తన షాపుకు రావాలని కోరాడు. బక్రీద్ పండుగ కోసం అమ్ముకునేందుకు తెచ్చిన ఐదు బస్తాల కొత్త బట్టల్ని ఇచ్చేశాడు. వీటిలో మహిళలు, పిల్లల కోసం తెప్పించినవే ఎక్కువగా ఉన్నాయి.

నౌషద్ ఔదార్యం చూసి స్వచ్ఛంద కార్యకర్తలు విస్తుపోయారు. తర్వాత నౌషాద్ ను అభినందనలతో ముంచెత్తారు. ఆదివారం (ఆగస్టు 11)న జరిగిన సంబంధించిన వీడియోను ఫేస్‌బుక్‍లో రాజేష్ పోస్ట్ చేయగానే...నౌషద్‌పై ప్రశంసల జల్లులు కురిసాయి. వరదలు తగ్గుముఖం పట్టగానే నౌషద్‌ను కలుస్తామంటూ పలువురు ప్రముఖులు పోస్ట్ చేశారు.

'ఈ లోకంలోకి వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాము..వదిలివెళ్లేటప్పుడు ఏదీ పట్టుకుని వెళ్లం. కలిగినంతలో ఆర్తులను నాకు చేతనైనంత చేయాలనుకున్నా..అదే చేశాను తప్పా ఇది పెద్ద సహాయం అని అనుకోవటంలేదంటున్న నౌషాద్ ది పెద్ద మనస్సు కాక మరేంటి... 

kerala
Garment Seller
Naushad
bakrid
festival's
cloths
donates
flood victims

మరిన్ని వార్తలు