కేరళలో వరద సాయంపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం : 19 కేసులు నమోదు

Submitted on 13 August 2019
Kerala police register 19 cases for fake campaigns on social media over flood relief

కేరళలో వరద సాయంపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలకు సంబంధించి 19 కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు సోమవారం (ఆగస్టు 12, 2019) వ తేదీన కేరళ పోలీసులు కేసులు నమోదు చేశారు. వివిధ సైబర్ విభాగాల పోలీసులు కేసులు నమోదు చేశాయని, ఇప్పటికే దర్యాప్తు ప్రారంభమైందని రాష్ట్ర పోలీసు చీఫ్ లోక్‌నాథ్ బెహెరా తెలిపారు. వరదలు కేరళ రాష్ట్రాన్ని అతులాకుతలం చేసిన విషయం తెలిసిందే.

 వరద సాయంపై తప్పుడు ప్రచారం చేసినందుకు కేసులు నమోదు చేశామన్నారు. తప్పుడు ప్రచారాలు చేసే వారందరినీ అరెస్టు చేసి, చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని బెహెరా చెప్పారు. కొంతమంది పనిగట్టుకుని సామాజిక వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని కేరళ సీఎం పినరయి విజయన్ చెప్పిన మరుసటి రోజే పోలీసులు వారిపై చర్యలకు పూనుకున్నారు. 

ఆదివారం (ఆగస్టు 11, 2019) విలేకరుల సమావేశంలో పినరయి విజయన్ మాట్లాడుతూ సిఎం రిలీఫ్ ఫండ్ నిధికి సహకరించకుండా, ప్రజలను నిరుత్సాహపరిచే లక్ష్యంతో చేసే వ్యతిరేక ప్రచారంపై మండిపడ్డారు. ముఖ్యమంత్రి విపత్తు సహాయ నిధి (సిఎండిఆర్ఎఫ్) ఇతర ప్రయోజనాల కోసం ఖర్చు చేశారనే ప్రచారం తప్పన్నారు.

తప్పుడు సందేశాలను ప్రసారం చేయడం సహాయక చర్యలను ప్రభావితం చేసిందన్నారు. తగిన నిర్ణయాలు తీసుకోకుండా ప్రజలను నిరుత్సాహపరిచిందని తెలిపారు. సోషల్ మీడియా ద్వారా పుకార్లు, అసత్య వార్తలను నివారించే ప్రయత్నం చేయాలని పినరయ్ అన్నారు.

సిఎండిఆర్ఎఫ్ ఒక అధికారిక వ్యవస్థ అని, కష్టాల్లో ఉన్నవారికి రిలీఫ్ కోసం మాత్రమే ఈ డబ్బు  ఉపయోగించడం జరుగుతుందన్నారు. ఇందులో బడ్జెట్ కేటాయింపు కూడా ఉంటుందని తెలిపారు. అసత్య ప్రచారాలు చేసే వారి వలలో ప్రజలు పడకూడదని సీఎం అన్నారు. 

అంతేకాకుండా, సహాయక శిబిరాలకు చేరుకొని ప్రజలు ఇచ్చే విరాళాల గురించి తప్పుడు సమాచారం వ్యాప్తి చెందడంతో ఈ సంవత్సరం వివిధ విరాళాల సేకరణ కేంద్రాల్లో ప్రజల భాగస్వామ్యాన్ని విస్తృతంగా ప్రభావితం చేసిందని విరాళాల సేకరణ వాలంటీర్లు ఆరోపిస్తున్నారు. 

వారం నుంచి రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా 83 మంది మృతి చెందారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,500 సహాయ శిబిరాల్లో 2.6 లక్షలకు పైగా ప్రజలు ఉన్నారు.

Also Read : చేతులెట్లా వచ్చాయో : ఏడు నెలల బిడ్డను అమ్మకానికి పెట్టిన తల్లి

kerala
Police
Register
19 cases
fake campaigns
social media
flood relief

మరిన్ని వార్తలు