దేశంలోనే ఫస్ట్ స్టేట్ : కేరళలో వంద శాతం హైటెక్ స్కూల్స్.. స్విమ్మింగ్ ట్రైనింగ్

Submitted on 10 June 2019
Kerala Set To Become First State With 100 percent Hi-Tech Schools, Swimming To Be Part Of Curriculum

విద్యారంగంలో కేరళ రాష్ట్రం మరో రికార్డు సాధించేందుకు రెడీ అవుతోంది. విద్యారంగంలో పూర్తి స్థాయిలో అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా కేరళ ముందుంజలో కొనసాగుతోంది. దేశంలో వంద శాతం అక్షరాస్యత, ప్రైమరీ ఎడ్యుకేషన్ అందిస్తున్న తొలి రాష్ట్రంగా నిలిచిన కేరళ.. వంద శాతం హైటెక్ క్లాస్ రూమ్స్ కలిగిన ఫస్ట్ ఇండియన్ స్టేట్ గా దూసుకెళ్తోంది. ఇటీవల కేరళలో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా కేరళ విద్యాశాఖ మంత్రి ప్రొఫెసర్ సి. రవింద్రనాథ్ మాట్లాడుతూ.. కేరళలో అన్ని స్కూళ్లు హైటెక్ కేటగిరీతో ఉన్నత స్థాయిలో నిలవడమే కాకుండా దేశంలోనే తొలి రాష్ట్రంగా అవతరించిందని అన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 4వేల 752 స్కూళ్లు హైటెక్ మోడల్ స్కూల్స్ గా మారిపోగా.. అందులో 8వ తరగతి నుంచి 12వ తరగతి వరకు 4వేల 500 క్లాస్ రూంలు ఉన్నాయని చెప్పారు. 

ఒనమ్ పండుగకు ముందే 9వేల 941 స్కూళ్లల్లో (ఫస్ట క్లాస్ నుంచి 7వ తరగతి వరకు) హైటెక్ ల్యాబరేటీస్ ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో స్కూల్స్, ఐటీ ఎడ్యుకేషన్ ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రధాన విద్యా శాఖ ఓ ప్రాజెక్టును ప్రారంభించింది. కేరళ ఇన్ ఫ్రాస్ర్టక్చర్ అండ్ టెక్నాలజీ ఫర్ ఎడ్యుకేషన్ (KITE) ఆధ్వర్యంలో స్టేట్ రన్ ఏజెన్సీ ఐటీ@ స్కూల్ ఈ ప్రాజెక్ట్ ను ప్రారంభించింది.  

టీచర్లకు ఐటీ ట్రైనింగ్ :
‘జూలై నుంచి అన్నిస్కూళ్లలో హైటెక్ ల్యాబ్స్ ఏర్పాటు చేస్తాం. ఈ స్కూళ్లలో విద్యార్థులకు విద్యను బోధించేందుకు 76వేల 349 మంది టీచర్లకు ప్రత్యేకమైన ఐటీ ట్రైనింగ్ ఇస్తున్నాం’ అని కైట్ వైస్ చైర్మన్, ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ కె. అన్వర్ సదాత్ తెలిపారు. దీని ద్వారా ప్రారంభం నుంచి 9వేల 941 స్టేట్ రన్ స్కూల్స్ తో పాటు మొత్తం 20.86 లక్షల స్కూల్ విద్యార్థులు ప్రయోజనం పొందనున్నారు. ఈ ప్రాజెక్ట్ కు అయ్యే ఖర్చు రూ.204.90 కోట్లు వరకు అవుతుందని అంచనా. 

స్విమ్మింగ్ ట్రైనింగ్ కూడా :
రాష్ట్రంలోని ఈ స్కూల్స్ లో హైస్పీడ్ బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్ట్ విటీ ఏర్పాటు చేశారు. జూన్ నెలాఖరు నాటికి అన్ని క్లాస్ రూంల్లో నెట్ వర్కింగ్ పూర్తి చేయనున్నారు. ఈ ఏడాది కొత్త విద్యా సంవత్సరం నుంచి కేరళ రాష్ట్రంలో అన్ని పాఠశాలల్లోని పాఠ్యప్రణాళికలో స్విమ్మింగ్ ను ప్రవేశపెట్టనున్నారు.

ప్రొఫెసర్ రవింద్రనాథ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో నీళ్లలో పడటం కారణంగా సంభవించే మరణాలను తగ్గించడమే లక్ష్యంగా స్మిమ్మింగ్ ట్రైనింగ్ తీసుకోస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలోని మొత్తం 140 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక స్విమ్మింగ్ పూల్ ఉండేలా ఏర్పాట్లు చేస్తామని మంత్రి రవింద్రనాథ్ స్పష్టం చేశారు. 

Kerala State
Hi-Tech Schools
Swimming Training
Curriculum
kite

మరిన్ని వార్తలు