మావోయిస్టులపై కిడారి భార్య పరమేశ్వరి సంచలన వ్యాఖ్యలు..

11:42 - October 25, 2018

విశాఖపట్నం : సాధారణంగా అతివలు అబలలు అంటారు. కష్టాలు వచ్చినప్పుడు వారు తట్టుకోలేరు అందుకే వారు ఏడ్చి తమ బాధను తగ్గించుకుంటారంటారు. ఏడుపు ఆడవాళ్లు సొత్తు అన్నట్లు వుంటారని సాధారణ నానుడి. కానీ..కష్టాలు వచ్చినప్పుడు నిబ్బరం చూపి ఆత్మవిశ్వాసం మా సొత్తు అని సాటి చెబుతున్నారు నేటి స్త్రీలు. దానికి నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తున్నారు ఇటీవల మావోయిస్టుల చేతిలో దారుణ హత్యకు గురైన కిడారి సర్వేశ్వరరావు భార్య పరమేశ్వరి. సివేరి సోమ సంతాపసభలో పాల్గొన్న ఆమె మొదటిసారి ప్రజల సమక్షంలో తీవ్ర ఉద్వేగంతో మాట్లాడారు. లివిటిపుట్టు పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ మౌనాన్ని వీడి, ధైర్యంగా నోరు విప్పి గట్టిగా సమాధానం చెప్పాలన్నారు. మనం నిశ్శబ్దంగా వుంటే ఇటువంటి సంఘటనలు మరిన్ని జరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. తప్పుడు సమాచారాలు ఇచ్చే వారు అటువంటి పనులు మానుకోవాలని సూచించారు.

Image result for kidari wifeమనం  సైలెంట్‌గా వుంటే వారు హత్యలు చేస్తునే వుంటారు : పరమేశ్వరి
మనం  సైలెంట్‌గా ఉన్నంత కాలం మావోయిస్టులు వయలెన్స్ చేస్తూనే వుంటారనీ..అందుకే కష్టాలలో వున్నాగానీ..మనల్ని బాధిస్తున్నవారి పట్ల మౌనాన్ని వీడి తిరుగుబాటు గళం వినిపించాలని పరమేశ్వరి పిలుపునిచ్చారు. ప్రజల కోసం తన  భర్త ఆదివారం కూడా కుటుంబాన్ని కాదని, ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి గ్రామాల్లో పర్యటించే వారు. ఎక్కువ సమయం ప్రజల మధ్యనే గడపడానికి ఇష్టపడేవారు. అటువంటి సేవాభావం ఉన్న తన భర్తతోపాటు మాజీ ఎమ్మెల్యే సోమను మావోయిస్టులు ఎందుకు హత్య చేశారు?’’ అని దివంగత ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు భార్య పరమేశ్వరి ప్రశ్నించారు. మరి పరమేశ్వరి వంటి ఆత్మ విశ్వాసం ప్రతీ ఒక్కరు అలవరచుకోవాలని ఆశిద్దాం.
 

Don't Miss